ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana latest updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 9AM
author img

By

Published : Feb 27, 2021, 8:59 AM IST

  • 300 మంది విద్యార్థినుల అపహరణ

నైజీరియాలో దారుణం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై సాయుధులు దాడికి పాల్పడి 300మంది అమ్మాయిలను కిడ్నాప్​ చేశారు. మూకుమ్మడిగా వచ్చిన దుండగులు.. గంటల వ్యవధిలోనే ఈ దురాగతానికి పాల్పడ్డారు. అయితే.. డబ్బు, జైల్లో ఉన్న తమ సభ్యుల విడుదల కోసమే బందిపోటు ముఠాలు ఈ దాడులు చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గెలుపు మంత్రాంగం

ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం కేసీఆర్... నేతలకు స్పష్టం చేశారు. పలువురు మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మోగిన ఎన్నికల నగారా

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలను ఓసారి పరిశీలిద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అసెంబ్లీ 'పంచ'తంత్రం

పుదుచ్చేరి, అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ్‌ బంగ శాసనసభల్లోని మొత్తం 824 స్థానాలకు 2.7 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో 18.68 కోట్లమంది ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొనే ఈ మహాక్రతువు- మినీ సార్వత్రిక సమరాన్నే తలపిస్తోంది. మరి ఈ మహా సమరంలో కమలం పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది? కాంగ్రెస్​ పరిస్థితి ఏంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రూ.5 పెరిగిన పెట్రోల్

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. మూడ్రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్ రేట్లు పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 పైసలకు చేరిగా.. డీజిల్​ రూ.88.86గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రోజూ 1.20 లక్షల మందికి టీకా

దేశ వ్యాప్తంగా మార్చి 1 నుంచి వయో వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి కొవిడ్ వాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొవిన్ సాఫ్ట్​వేర్​లో అవసరమైన మార్పులు చేసి... నేడు, రేపు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇక ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ... వ్యాక్సినేషన్​పై తగు మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భౌతిక దూరమేది?

గురుకుల సొసైటీల్లో ఐదో తరగతి మినహా ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధనలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటైన గురుకులాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండటం వల్ల భౌతిక దూరం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం అమలుపై గురుకులాల ప్రిన్సిపళ్లకు సంక్షేమ సొసైటీల అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జియో : రెండేళ్లు అపరిమిత కాల్స్‌

రిలయన్స్​ జియో.. 2021లో మరో కొత్త ఆఫర్​ను తీసుకొచ్చింది. కేవలం రూ.1,999కే జియోఫోన్​తో పాటు రెండేళ్లపాటు అపరిమిత కాల్స్​.. నెలకు 2జీబీ డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏడాది పాటు ఈ సౌకర్యాలు కావాలంటే రూ.1,499 చెల్లించి పొందవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'మొతేరా' విజయ రహస్యం

పొడి పిచ్‌లపై ఆడుతున్నప్పుడు ఫుట్‌వర్క్‌, షాట్ల ఎంపిక పక్కాగా ఉండాలని సూచించాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. స్పిన్‌ పిచ్‌లపై గెలవాలంటే ఏం చేయాలో చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఛత్రపతి బయోపిక్​లో షాహిద్​

మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ బయోపిక్​ గురించి బాలీవుడ్​లో సన్నాహాలు జరుగుతున్నాయి. వాటిలో ఒకదానిలో షాహిద్​ కపూర్​ నటించనున్నారని మాట్లాడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.