ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 19, 2021, 8:58 PM IST

నాపై దాడికి కుట్ర

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు (sectional comments) చేశారు. తనపై దాడికి కుట్ర పన్నారని.. ఈ విషయం మాజీ నక్సలైట్ (former Naxalite) సమాచారం ఇచ్చినట్లు శనిగరంలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పెట్టుబడులకు అనుకూలం

బ్యాంకింగ్‌, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో హైదరాబాద్‌లో మరిన్ని నూతన పెట్టుబడులు రావాల్సి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతల వల్ల ఈ రంగాల్లో ఇప్పటికే లక్షా 80 వేల మందికి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌ సంస్థ కార్యాలయాన్ని కేటీఆర్‌ రాయదుర్గంలో ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారి వేతనాలు పెరిగాయి

జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచుతూ... రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి రూ. 28,719కి పెంపు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

21 కోట్ల హెరాయిన్ పట్టివేత

శంషాబాద్​ విమానాశ్రయంలో మత్తుపదార్థాల రవాణా ఆగడం లేదు. నిఘా సంస్థల కళ్లుగప్పేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ... అధికారుల నుంచి మాత్రం తప్పించుకోలేక పట్టుబడుతున్నారు. తాజాగా విమాశ్రయంలో ఓ మహిళ నుంచి 3.2 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలిరోజే దుమారం

చమురు ధరలు, కరోనా సంక్షోభం, ఇతర అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు హోరెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలగా.. లోక్​సభ, రాజ్యసభ ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అందుకే ఆ కథనాలు'

ఫోన్‌ హ్యాకింగ్‌ అంశంపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్​సభలో ప్రకటన చేశారు. ఫోన్‌ హ్యాకింగ్‌పై ఓ వెబ్‌ పోర్టల్‌లో సంచలనాత్మక కథనాలను ఉద్దేశపూర్వకంగానే ప్రచురించినట్లు పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలా చేసినట్లు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఆ వేరియంటే కారణం'

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80శాతానికి పైగా కేసులకు డెల్టా వేరియంటే కారణమని సార్స్ ​కొవ్​- జీనోమ్ కన్సార్టియమ్ అధిపతి ఎన్​కే అరోడా తెలిపారు. ఆల్ఫా వేరియంట్​ కన్నా ఈ వేరియంట్​ 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ బీమాపై అపోహలొద్దు!

కరోనా మహమ్మారి విరుచుకుపడిన తర్వాత.. ఆరోగ్య బీమాకు డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా ఉండాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ ఆరోగ్య బీమా విషయంలో చాలా మందికి అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి. వాటన్నింటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ పడకలు అలా​ కాదు..!

ఒలింపిక్​ గ్రామంలో ఏర్పాటు చేసిన పడకలు యాంటీ-సెక్స్​ అని రకరకాల రూమర్లు రావడంపై అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ(IOC) స్పందించింది. అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు మన్నిక కలిగినవని స్పష్టం చేసింది. మరోవైపు ఐర్లాండ్​ చెందిన జిమ్నాస్టిక్​ క్రీడాకారుడు కూడా సదరు వార్తలను కొట్టివేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' డబ్బింగ్ చెప్పగలనా అనుకున్నా'

విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నారప్ప'(Narappa). ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ పలు విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.