ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @9PM

author img

By

Published : Feb 5, 2021, 8:58 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @9PM
టాప్​టెన్​ న్యూస్ @9PM

తెరాస కార్యవర్గ సమావేశం

పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం, ప్లీనరీ సమావేశాల అజెండా, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత పునర్నిర్మాణంపై తెరాస దృష్టి సారించింది. ఫిబ్రవరి 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రేపటి నుంచి

రేపటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్​ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. హైదరాబాద్​లో ప్రభుత్వ ఆస్పత్రుల హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లతో మంత్రి సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పెళ్లైన రెండునెలలకే

పెళ్లి అయి రెండు నెలలు కూడా కాకముందే యువతి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న వాడు... సొంత బావే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

యథాతథంగానే..

ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లొసుగులు ఉన్నట్లు కాదు

వ్యవసాయ చట్టాల్లో సవరణలకు తాము సిద్ధంగా ఉన్నామంటే.. దానర్థం చట్టాల్లో లొసుగులున్నట్లు కాదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోమవారానికి వాయిదా

వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేసిన ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెచ్​1బీ వీసా నిబంధనల అమలు వాయిదా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నేతృత్వంలో తీసుకువచ్చిన హెచ్​1బీ వీసా నిబంధనల అమలును వాయిదా వేశారు అధ్యక్షుడు జో బైడెన్​. లాటరీ విధానాన్ని పొడిగించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

50,700పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 50,700 పైకి చేరింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 14 వేల 900 మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంగ్లాండ్​ ఆధిపత్యం

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. జో రూట్​(128*) సెంచరీ, డొమినిక్ సిబ్లే (87)​ అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 , అశ్విన్​ ఓ వికెట్​ దక్కించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బన్నీ అంటే చాలా ఇష్టం..

తన కెరీర్​ గురించి మాట్లాడిన నటి సయీ మంజ్రేకర్.. తెలుగులో అల్లు అర్జున్​ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్​లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.