1.భవిష్యవాణి రంగం కార్యక్రమం విశేషాలు చుద్దామా
పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఈరోజుతో ముగిశాయి. ఈ రోగం మీరు తెచ్చుకున్నదే.. ఎంత దూరంగా ఉంటే అంత మేలని అనురాధ భవిష్యవాణి రంగం చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం
కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆరోగ్యవంతమైన ఇద్దరు వాలంటీర్లకు నిమ్స్‌లో.. సోమవారం వైద్యులు తొలి విడత వ్యాక్సిన్ ఇచ్చారు. ఐదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని క్లినికల్ ట్రయల్స్ బృందం సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక చనిపోవడం దారుణం : ఉత్తమ్
నల్గొండలోని జిల్లా కారాగారం, ప్రభుత్వాసుపత్రిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. జైల్ సూపరింటెండెంట్, ఖైదీలతో మాట్లాడారు. జైలు పరిసరాలు, ప్రభుత్వాసుపత్రిలోని వార్డులను పరిశీలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.108 కేటీఆర్ ముఖ చిత్రాలు గీశాడు.. రికార్డు తిరగరాశాడు
మంత్రి కేటీఆర్‌పై 108 ముఖ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ చిత్రాలు గీసి ఆకట్టుకున్నాడు. దీంతో ముంబయికి చెందిన డాక్టర్ రాజేంద్ర కాంతక్ గీసిన 101 చిత్రాల రికార్డును తిరగరాశాడు. గతంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై పెన్సిల్ స్కెచ్ వేసి ప్రశంసలందుకున్నారు ఆ ప్రవాస భారతీయుడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ఈనెల 16న వివాహిత మృతికి సంబంధించి సుబేదారి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సంగీత ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందలేదని, ఆమె భర్తే హత్య చేశాడని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6.ఆగస్టు 3న రష్యా కరోనా టీకా రిలీజ్!
కరోనా వ్యాక్సిన్ కనుగొనే రేసులో రష్యా ముందంజలో నిలవనుందా? ఔననే అంటున్నారు ఆ దేశ ఆరోగ్య మంత్రి. ఆగస్టు 3 నుంచి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7.'ఆ విషయంలో ఒక్క సెకను కూడా వాదనలు వినం'
ఏజీఆర్ బకాయిల పునర్లెక్కింపు విషయంలో ఒక్క సెకను కూడా వాదనలు వినే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపు కోసం టెలికాం సంస్థలు తగిన కాలప్రణాళికతో ముందుకురావాలని సూచించింది. గత 10 సంవత్సరాల ఖాతాల వివరాలను సమర్పించాలని ప్రైవేటు టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8.ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావడం కష్టమే!
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నెగ్గడం కష్టమేనని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని అధిక శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. నిజాయితీ, నమ్మకం, వ్యక్తిగత విలువలు కల్గి ఉండడం వంటి అంశాల్లోనూ... బైడెన్ కంటే ట్రంప్ వెనుకబడి ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9.ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ జరుగుతుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెర పడింది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వాయిదా వేసింది. సోమవారం ఈ మెగాటోర్నీపై కమిటీ సభ్యులంతా చర్చించి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10.గ్రీన్ ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన మంచు లక్ష్మి
హైదరాబాద్ ఫిలింనగర్లో నటి మంచు లక్ష్మి... తన నివాసంలో కూతురితో కలిసి మొక్కలు నాటారు. మరో ముగ్గురికి ఈ గ్రీన్‌ఛాలెంజ్‌ను విసిరారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సూచించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.