- ఆగని ఉద్ధృతి..
రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి కొవిడ్ బాధితుల సంఖ్య 47,705కి చేరుకుంది. మహమ్మారి నుంచి కోలుకుని 2,062 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నుంచి 36,385 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా విలయం..
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలనూ చుట్టేసింది. కేసుల నమోదులో మరింత ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కోటీ 50 లక్షలమందికిపైగా వైరస్ బారినపడ్డారు. 6.20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో మూడు నెలల్లో..
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆశాజనక ఫలితాలు సాధిస్తోన్న ఆక్స్ఫర్డ్ టీకా.. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్‌లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త సచివాలయం అలా ఉండాలి..
సచివాలయ కొత్త భవనం హుందాగా, పూర్తి సౌకర్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్కిటెక్ట్‌ల నమూనాను పరిశీలించిన సీఎం... కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. సచివాలయానికి సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏదడిగినా ఇవ్వండి..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం వల్ల వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనాపై వాస్తవాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న ‘కొవాక్జిన్’ ట్రయల్స్
నిమ్స్‌లో కొవాక్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలిదశ మానవ ప్రయోగాల్లో భాగంగా సోమవారం ఇద్దరు వాలంటీర్లకు టీకా డోసు ఇచ్చారు. వారిని 24 గంటలపాటు వైద్య బృందం పర్యవేక్షించింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో మంగళవారం డిశ్ఛార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- చుట్టూ జనం.. దూరం అసాధ్యం
ఆయనొక ఎమ్మెల్యే.. ఇంటికి వివిధ పనుల కోసం నిత్యం రెండువందల మందికి పైగా వస్తుంటారు. వారంతా నియోజకవర్గ ప్రజలే కాదు.. ఓటర్లు కూడా! ప్రతి ఒక్కరినీ పలకరించి, పనులు చేస్తేనే వచ్చినవారికి సంతృప్తి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ ప్రభావం తర్వాతి ఎన్నికల్లో ఉంటుందనేది కాదనలేని విషయం. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- సవాళ్లకు సై..
చైనాను ఏకాకి చేయడానికి ప్రపంచ దేశాలు పట్టుబిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్వాన్ ఘర్షణల పరిణామాల్లో భారత్ అడిగినదే తడవుగా ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లు యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను హుటాహుటిన పంపాయి. తాజాగా రఫేల్ యుద్ధ విమానాలను ఈ నెల 29న దేశానికి పంపనుంది ఫ్రాన్స్. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- నాట్లు వేసిన హీరో..
లాక్డౌన్ విరామ సమయంలో సినీప్రముఖులు ఇంటి వద్దనే ఉంటూ సోషల్‌మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా నెటిజన్లతో ముచ్చటిస్తున్నారు. వీటితోపాటు వారికి ఇష్టమైన వ్యాపకాలతోనూ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అయినా ఆడతా..
ప్రపంచస్థాయి వేదికలపై పోటీపడే మాతృమూర్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాక్సర్ మేరీకోమ్, చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి వంటి ఎందరో ప్లేయర్లు అమ్మలయ్యాక కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ ఆటలో రాణిస్తున్నారు. త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు సీనియర్ రెజ్లర్ గీతా ఫొగాట్. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేసింది గీతా. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.