- తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరుతోంది. దీంతో జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులపై ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని తెలంగాణ కోరుతుండగా.. విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం రాకకోసం ముస్తాబవుతున్న సిరిసిల్ల
కార్మిక, ధార్మికక్షేత్రంగాఏర్పడిన రాజన్నసిరిసిల్ల జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ముస్తాబవుతోంది. అభివృద్ధిలో అన్ని జిల్లాల్లోకెల్లా ముందున్న సిరిసిల్లలో సరికొత్త భవనాలు, సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈనెల 4న ప్రారంభించబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాలలో మరో రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యార్థుల్లో అయోమయం..
అసలే టీవీ పాఠాలు(Digital Classes)..అర్థం కావడం అంతంత మాత్రం. కనీసం 15-25 శాతం మంది ఇంటర్ విద్యార్థులకు టీవీలూ లేవు. కొందరికి టీవీలున్నా బిల్లు చెల్లించే పరిస్థితి లేక ప్రసారాలు లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి వారికి దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ పాఠాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రానికే పెద్దపీట!
ఒకటిరెండు రోజుల్లోనే ప్రధాని మోదీ కేంద్రం మంత్రివర్గ విస్తరణను చేపట్టవచ్చని సమాచారం. నూతన మంత్రివర్గంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు కీలక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వంట ఇంట గ్యాస్ మంట..
గ్యాస్ బండ బాదుడు మళ్లీ మొదలైంది. రెండు నెలలుగా నిలకడగా ఉన్న వంట గ్యాస్ ధరలు... ఒక్కసారిగా పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరను కేంద్రం రూ.25.50 పెంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రేమోన్మాది ఘాతుకం
తన తండ్రి స్నేహితుడి కుమార్తెతో అతనికి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత అది ప్రేమగా మారింది. అతని ప్రవర్తన నచ్చని ఆ యువతి ఈ విషయాన్ని పెద్దలకు చెప్పింది. క్షణికావేశంలో ఉన్మాదిగా మారి ఆమె గొంతులో కత్తితో పొడిచాడు. కసితీరక.. చున్నీని మెడకు బిగించి హతమార్చాడు(MURDER). తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుటుంబాన్ని కాపాడిన నాలుగేళ్ల చిన్నారి..
నాలుగేళ్ల చిన్నారి వివేకంతో తన కుటుంబాన్ని కాపాడింది. పెంపుడు కుక్కలతో ఆటలో ఉన్నప్పటికీ.. కిచెన్‌లో చెలరేగిన మంటలను గుర్తించి.. బాత్రూమ్లో ఉన్న తండ్రిని అప్రమత్తం చేసింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అతిపిన్న' అభిమన్యుడు..
మహాభారతంలో కౌరవుల పద్మవ్యూహానికి చిక్కి ఆ అభిమన్యుడు బలికాగా.. ఇప్పుడు ఈ భారత సంతతి అమెరికా అభిమన్యు మాత్రం చదరంగ వ్యూహాల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ సాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జపనీస్ 'జిగేల్ రాణి'ని చూశారా?
రామ్ చరణ్ 'రంగస్థలం' చిత్రంలోని 'జిగేలు రాణి' పాట ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ పాటకు కవర్సాంగ్తో అలరించింది జపాన్‌కు చెందిన ఓ జోడీ. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.