ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM
author img

By

Published : Jul 5, 2021, 6:58 PM IST

ఆ ప్రాజెక్టుతో తీవ్ర ప్రభావం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎన్జీటీలో పిటిషన్

రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation)లో ఉల్లంఘనలను స్వయంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) బృందం తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో రాయలసీమ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అప్పుడే రీ-ఓపెన్​..!

కరోనా కారణంగా కుదేలైన సినిమా థియేటర్ వ్యవస్థకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సినిమా థియేటర్ల విషయంలో.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎంతో కుంబ్లే భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను, ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకారిస్తానని కుంబ్లే తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అతడు అడవిని సృష్టించాడు

మానవ చర్యలతో అడవులు కనుమరుగవుతున్నాయి. వేలాది జీవజాతులు... ఆవాసం కోల్పోయి..ఆహారం దొరక్క అంతరించిపోతున్నాయి. పర్యావరణానికి ఇంతలా విఘాతం కలుగుతున్నా ప్రజలు మాత్రం..మొక్కలు నాటడానికి బద్దకిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం... ఎకరాల కొద్ది భూమిని కొనుగోలు చేసి దట్టమైన అడవిగా మార్చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టీఎంసీ గూటికి అభిజిత్ ముఖర్జీ.!

మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ.. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. కోల్​కతాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోటి సబ్​స్క్రైబర్లు.!

ప్రాంతీయ భాష సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది 'విలేజ్​ కుకింగ్​ ఛానల్​'. పెద్ద పెద్ద ఇంగ్లిష్​ యూట్యూబ్​ ఛానళ్లకే దక్కని ఘనతను సాధించింది. పెట్టిన మూడేళ్లకే కోటికిపైగా సబ్​స్క్రైబర్లను సొంతం చేసుకుంది. ఈ ఏడాది తొలినాళ్లలో.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో కలిసి చేసిన వీడియో తర్వాత.. ఈ ఛానల్ పేరు​ దేశంలో మారుమోగిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వచ్చే వారమే ఆ టీకా.!

దేశంలో మోడెర్నా టీకా(Moderna Vaccine) జులై 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీకాల దిగుమతి ప్రక్రియను ఫార్మా సంస్థ సిప్లా ప్రారంభించింది. ఈ వారం చివరి నాటికి ఇవి భారత్​కు రానుండగా.. ఆస్పత్రులకు కేటాయించేందుకు మరోవారం పట్టనుందని సమాచారం.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏంటీ గొడవ?

టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​కు, సెలక్షన్ కమిటీకి మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​ కోసం పృథ్వీషా, దేవ్​దత్ పడిక్కల్​ను తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి సూచించిన.. సెలక్టర్ చేతన్ శర్మ పట్టించుకోవడం లేదట! ఇంతకీ ఏం జరుగుతోంది?

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒకేసారి ఐదు సినిమాలతో.!

కథానాయకుడు కల్యాణ్​రామ్ టాప్​గేర్​లో దూసుకెళ్తున్నారు. ఐదు విభిన్న తరహా సినిమాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటుండగా, మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.