- కొత్తగా 3,816 కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,816 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో 27 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రేమజంట ఆత్మహత్య..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పరిధి ఎల్లమ్మబండలో విషాదం చోటుచేసుకుంది. బాలయ్యనగర్‌లోని క్వారీ గుంతలో దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెరాస, ఈటల వర్గాల మధ్య ఘర్షణ..
కరీంనగర్ జిల్లా వీణవంకలో తెరాస, ఈటల వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మండల కేంద్రంలో జమ్మికుంట వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బాలకిషన్‌రావు తన అనుచరులతో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ క్రమంలో ఈటల వర్గీయులైన తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు మోటం వెంకటేష్, ఇల్లంతకుంట దేవస్థానం కమిటీ సభ్యుడు దాసారపు రాజుతో పాటు రాయిశెట్టి కుమార్‌లు అక్కడికి చేరుకొని.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బండి సంజయ్ లేఖ..
కరోనాను ఎదుర్కోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరోనా చికిత్స కోసం పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. గవర్నర్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హై టెన్షన్..
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీలోని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్ క్యాన్సర్ ఆస్పత్రి నుంచి జైలుకు తీసుకెళ్లారు. ఎలాంటి ఘటనలు జరగకుండా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ బయోటెక్‌తో హెస్టర్ చర్చలు..
టీకా ఉత్పత్తికి సాంకేతికత బదిలీపై భారత్ బయోటెక్‌తో హెస్టర్ బయోసైన్సెస్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు మార్లు చర్చలు జరిగాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం హెస్టర్ బయోసైన్స్ గుజరాత్ ప్రభుత్వంతో జట్టు కట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మేమూ మోదీని ప్రశ్నిస్తాం..
వ్యాక్సిన్ విషయంలో ప్రధాన మంత్రిని విమర్శించిన కొంతమందిపై దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. తమను కూడా ఈ విషయంలో అరెస్టు చేయాలని సవాలు విసిరింది. టీకాలను విదేశాలకు ఎందుకు ఎగుమతి చేశారని మోదీని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెమ్‌డెసివిర్ ఇచ్చేందుకు బైక్‌పై 420కి.మీ
కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్‌డెసివిర్ ఔషధానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. దీన్ని తన స్నేహితుడి తల్లికి అందించేందుకు ఓ వ్యక్తి ఏకంగా 420 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించాడు. పంజాబ్ విశ్వవిద్యాలయ విద్యార్థి చేసిన ఈ సాహసాన్ని భాజపా నేతలు అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎగ్జామ్స్ ఓవైపు.. షూటింగ్ పోటీలు మరోవైపు..
క్రొయేషియాలో షూటింగ్ పోటీల్ని, పరీక్షల ప్రిపరేషన్‌ను ఏకకాలంలో నిర్వర్తిస్తూ ఆహా అనిపిస్తోంది యువ షూటర్ మను బాకర్. తన పోటీల సమయంలోనూ, బీఏ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నెటిజన్‌కు నవీన్ సర్‌ప్రైజ్..
తనను ట్యాగ్ చేసిన ట్వీట్ పెట్టిన ఓ నెటిజన్ను సర్‌ప్రైజ్ చేశారు జాతిరత్నాలు ఫేమ్ నవన్ పొలిశెట్టి. ఇంతకీ ఏంటా సర్‌ప్రైజ్? నవీన్ నెటిజన్‌కు ఫోన్ చేయడానికి కారణమేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.