- పరీక్షల రద్దు యోచనలో ప్రభుత్వం..
కరోనా నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్‌బోర్డు, ఎస్సెస్సీ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ సమావేశమయ్యారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులు చర్చిస్తున్నారు. దీనిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. 17న ఓటర్లు అందరూ తరలొచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రభావమెంత..?
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మందుల వినియోగం అదే స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కొవిడ్ రోగులకు అందించే రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రుణయాప్‌లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక..
ఆన్లైన్ రుణయాప్‌లపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. వాటిపై తీసుకున్న చర్యలపై ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. 290 రుణయాప్‌లను గుర్తించి నిలిపివేసినట్లు డీజీపీ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజలను కాపాడుకోవడమే భాజపా ధ్యేయం..
ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదన్నారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్‌షో అనంతరం ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా ఉత్పత్తి పెంచాలి..
కరోనా టీకాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయడానికి తగిన పరిస్థితుల్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అడ్డంకులను తాత్కాలికంగా తొలగించాలని ప్రపంచ వాణిజ్య సంస్థకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ భేటీలు రద్దు!
దేశంలో కరోనా విజృంభణ కారణంగా ప్రధాని మోదీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ముందుగా కుదిరిన షెడ్యూల్‌లను నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వైరస్‌పై ప్రధాని నిరంతరం సమీక్షలు జరుపుతున్న వేళ కొద్ది రోజుల తర్వాతే వారితో సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐరోపాలో 10 లక్షలు దాటిన కరోనా మృతులు..
ఐరోపాలో 10 లక్షలకు పైగా బాధితులు కరోనాకు బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరణాలను నివారించడం సహా, వైరస్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రాజెనెకా టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. కాబట్టి వ్యాక్సిన్‌పై అనుమానం వీడాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సరిత..
భారత మహిళా రెజ్లర్ సరితా మోర్.. ఆసియా ఛాంపియన్షిప్ తుదిపోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం సీమ- పూజ.. మ్యాచ్ ఆడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీజర్ టైమ్‌తో 'గల్లీరౌడీ'..
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'గల్లీ రౌడీ' టీజర్, రామ్ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్ అల్బమ్ సాంగ్‌కు సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.