ETV Bharat / state

'షర్మిల నా కుమార్తె కాదంటున్నారు? - ఇంతలా దిగజారుతారా?' - YS VIJAYAMMA SENSATIONAL VIDEO

వైఎస్​ విజయమ్మ వీడియో సందేశం - తన కుటుంబపై చేస్తున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోందన్న వైఎస్​ విజయమ్మ

YS Vijayamma Video Message
YS Vijayamma Video Message (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 11:03 AM IST

Updated : Nov 6, 2024, 11:31 AM IST

YS Vijayamma Video Message : దివంగత వైఎస్​ కుటుంబంలో ఆస్తుల విషయంలో తగాదా జరుగుతున్న విషయం తెలిసిందే. వైఎస్​ జగన్​, షర్మిల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై వైఎస్​ సతీమణి విజయమ్మ స్పందించారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని తెలిపారు. అంతమాత్రాన ఆ తల్లికి కుమారుడు కాకుండా పోతాడా? లేకపోతే కొడుక్కి అమ్మ కాకుండా పోతుందా? ఓ అన్నకు చెల్లి కాకుండా పోతుందా? చెల్లికి అన్న కాకుండా పోతాడా అంటూ ఓ వీడియో సందేశం ద్వారా ప్రశ్నించారు.

ఆ వీడియో సందేశంలో తన పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచామని వైఎస్​ విజయమ్మ తెలిపారు. తమను అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోందని ఆవేదన చెందారు.

రెండేళ్ల క్రితం జరిగిన తన కారు ప్రమాదానికి తన కుమారుడు జగన్​కు ఎలా ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన కూతురే కాదంటున్నారని, తన మనవల దగ్గరకు వెళితే అదో కథగా ప్రచారం చేశారని వాపోయారు. ఇంతగా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా అంటూ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్​ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు - తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్‌

జగన్​పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు - ఆ సంగతి అన్నయ్యకు తెలుసు - కావాలనే ఇప్పుడు రాజకీయాలు!

Last Updated : Nov 6, 2024, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.