ETV Bharat / entertainment

'కాంతార 2' సెట్స్​లో రిషభ్​ - 60రోజులు నాన్​స్టాప్ షూటింగ్! - KANATA CHARPTER 1 UPDATE

కాంతార 2 అప్డేట్- సెట్స్​లో రిషభ్​ శెట్టి- 60రోజులు నాన్​స్టాప్ షూటింగ్

Kanata Charpter 1
Kanata Charpter 1 (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 10:47 AM IST

Kanata Charpter 1 : కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కాంతార చాప్టర్ -1'. 2022లో రిలీజై భారీ విజయం దక్కించుకున్న 'కాంతార'కు ప్రీక్వెల్​గా రూపొందుతోంది. 'కాంతార' తొలి పార్ట్​లో చూసిన కథకు ముందు ఏం జరిగింది? అనేది ఈ 'కాంతార చాప్టర్- 1'లో చూపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే?

ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లలో జరిగింది. తాజాగా మూడో షెడ్యూల్​ షూటింగ్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​లో హీరో రిషభ్ శెట్టి పాల్గొంటారట. నాన్ స్టాప్​గా 60 రోజులపాటు ఈ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్​లోని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నట్లు సమాచారం.

అయితే కాంతార తొలి భాగాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. కథంతా అటవీ ప్రాంతం బ్యాక్​ డ్రాప్​లో తీయడం వల్ల పెద్దగా ఖర్చు అవ్వలేదు. కానీ, ఈ ప్రీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. దీనికి దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ 4వ సెంచరీలోదని, రిషభ్ శెట్టి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇన్​సైడ్ టాక్. ఇక మూవీకి హైప్ క్రియేట్ అయ్యేలా, వీఎఫ్​ఎక్స్ డిజైన్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే బడ్జెట్ రేంజ్ పెరిగినట్లు తెలుస్తోంది.

జై హనుమాన్​లో రిషభ్
టాలీవుడ్​ యంగ్ డైరెక్టర్​ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో 'హను- మాన్‌' సీక్వెల్ గా వస్తున్న 'జై హనుమాన్'లో రిషభ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అలాగే దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్​ సైతం విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్​లో భాగంగా ఇది తెరకెక్కుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ హనుమాన్ సీక్వెల్​ రూపుదిద్దుకోనుంది.

రిషభ్​ శెట్టికి ప్రశాంత్ వర్మ థాంక్స్ - 'హనుమాన్' రోల్​కు పర్ఫెక్ట్ మ్యాచ్!

'జై హనుమాన్​'లో రానా? - ఆ స్పెషల్ ఫొటోతో ప్రశాంత్ వర్మ సర్​ప్రైజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.