ETV Bharat / sports

6ఏళ్ల తర్వాత కెప్టెన్​గా ఎంపికైన వార్నర్- ఇక డేవిడ్ భాయ్​ 'తగ్గేదేలే' - DAVID WARNER CAPTAINCY

కెప్టెన్​గా ఎంపికైన వార్నర్- ఆరేళ్ల తర్వాత తొలిసారి- ఏ జట్టుకంటే?

David Warner Captaincy
David Warner Captaincy (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 6, 2024, 10:21 AM IST

David Warner Captaincy : ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్​ సిడ్ని థండర్​ (Sydney Thunder) జట్టు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ మేనేజ్​మెంట్ తాజాగా అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. ఇటీవల వార్నర్​పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎత్తివేయడం వల్ల, ఆరేళ్ల తర్వాత మళ్లీ సారథి​గా జట్టును నడిపించడనున్నాడు. దీంతో 2024 బిగ్​బాష్​ లీగ్​లో​ సిడ్ని థండర్ జట్టుకు వార్నర్​ కెప్టెన్​గా వ్యవహరించడనున్నాడు.

అయితే తనను కెప్టెన్​గా ప్రకటించడంపై వార్నర్ స్పందిచాడు. తన పేరు పక్కన కెప్టెన్ అనే ట్యాగ్ ఉండడం అద్భుతంగా అనిపిస్తోందని వార్నర్ అన్నాడు. యంగ్ ప్లేయర్లతో తన అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు సిడ్ని థండర్స్ అఫీషియల్ వెబ్​సైట్​లో చెప్పాడు.

'ఈ సీజన్​లో థండర్ జట్టుకు మళ్లీ కెప్టెన్​గా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉంది. టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఈ జట్టుతో నా అనుబంధం కొనసాగుతోంది. ఇక నా పేరు పక్కన మళ్లీ కెప్టెన్ అనే ట్యాగ్ రావడం అద్భుతంగా అనిపిస్తోంది. నా అనుభవంతో జట్టును ముందుకు తీసుకెళ్తా. జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టిస్తాను. కెప్టెన్సీ అనేది మైదానం బయటకూడా కీలకమే. యువ ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా ఉండడం చాలా ముఖ్యం. వాళ్లతో నా అనభవాన్ని కూడా షేర్ చేసుకుంటా' అని వార్నర్ పేర్కొన్నాడు.

IPLలోనూ ఛాన్స్!
కాగా, 2024 బిగ్​బాష్ లీగ్ డిసెంబర్ 15న ప్రారంభం కానుంది. ఇక ఈ లీగ్​లో కెప్టెన్​గా రాణిస్తే, 2025 ఐపీఎల్​లోనూ వార్నర్​కు జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతంత కోల్​కతా, పంజాబ్, లఖ్​నవూ, ఆర్సీబీ, దిల్లీ జట్లకు కెప్టెన్​ లేడు. ఈ క్రమంలో మెగా వేలంలో ఆయా జట్లు వార్నర్​పై ఓ లుక్కేసే ఛాన్స్ ఉంది. వేలంలో దక్కించుకొని నాయకత్వ బాధ్యతలు కూడా అప్పజెప్పే అవకాశం ఉంది.

ఇదీ వివాదం
2018లో వార్నర్ శాండ్​పేపర్ స్కామ్​ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ ఏడాది స్టీవ్‌ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్​ల సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. ఆ పర్యటనలో ఆసీస్​కు వార్నర్ వైస్ కెప్టెన్. మూడో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్​ బాన్‌క్రాఫ్ట్‌ బంతిని రుద్దుతూ కనిపించాడు. దీంతో సాండ్‌ పేపర్‌లా ఉన్న గుడ్డ ముక్కను జేబులో దాచి పెట్టినట్లు ప్రత్యర్థి జట్టు ఆరోపించింది.

అయితే దీని వెనున డేవిడ్‌ వార్నర్ కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాన్‌ క్రాఫ్ట్‌ సాండ్‌ పేపర్‌ను ఉపయోగించినట్లు అంగీకరించాడు. దీంతో విచారణ చేపట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. బాన్‌ క్రాఫ్ట్‌ కూడా నిషేధం ఎదుర్కొన్నాడు. అలానే వైస్‌ కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌పైనా జీవిత కాలం కెప్టెన్సీ బ్యాన్‌ విధించింది.

తనపై బ్యాన్ ఎత్తివేయాలని వార్నర్ అప్పట్నుంచి పలుమార్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును కోరాడు. ఇటీవల అతడి విజ్ఞప్తి రివ్యూ చేపట్టిన బోర్డు అక్టోబర్ 25న వార్నర్​పై నిషేధం ఎత్తివేసింది.

డేవిడ్ వార్నర్‌పై 'జీవిత కాల' కెప్టెన్సీ నిషేధం ఎత్తివేత

భర్త కమ్​బ్యాక్​పై వార్నర్ సతీమణి కీలక కామెంట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.