1. మరోమారు చర్చలు..
ఈ నెల 30న చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్రం లేఖ రాసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సమావేశానికి హాజరు కావాలని కోరింది. 40 రైతు సంఘాలకు ఈ మేరకు ఆహ్వానం పంపింది. సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేలా విశాల దృక్పథంతో సానుకూల చర్చలు జరిపేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గౌరవించకపోతే పతనమే..
వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుందని వ్యాఖ్యానించారు ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్. భారత్‌లో అలా జరగదని నమ్ముతున్నానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సీఎం కేసీఆర్ సమీక్ష..
నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. జలవనరుల శాఖ స్వరూపాన్ని సీఎం ఖరారు చేశారు. నీటిపారుదల రంగంలో వచ్చిన మార్పులకనుగుణంగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ చేసినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ప్రజలను మోసం చేస్తున్నాయి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అది ఓ రబ్బర్ స్టాంప్..
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మందుబాబు హల్చల్..
పూటుగా మద్యం సేవించాడు. పడుకోవడానికి స్థలం దొరకలేదు కాబోలు.. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై పడుకున్నాడు. అంతే మందుబాబు కారణంగా ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్‌పేట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మీ సీఎం సాబ్‌కు చెప్పండి..
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తక్షణ సాయం కింద రూ.పది వేలు ఇవ్వాలన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సమయం ఇస్తున్నామని...ఆదుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. రైతు సాధికారత..
ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలును ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్లోని షాలీమార్ వరకు ఈ రైలు నడవనుంది. త్వరగా పాడయ్యే కూరగాయలు సహా వివిధ రకాల పండ్లను ఈ రైలులో రవాణా చేసుకునేందుకు వీలుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆ సెంచరీనే ఇప్పటికీ ఉత్తమం..
లార్డ్స్‌లో తాను చేసిన సెంచరీనే ఉత్తమమైనదని భారత ఆటగాడు రహానె చెప్పాడు. ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఇద్దరు కంగనలున్నారు..
నటి కంగనతో తనుకున్న అనుబంధం గురించి చెప్పిన దర్శకుడు అనురాగ్ బసు.. ప్రస్తుతం ఆమె అస్సలు అర్ధమే కావట్లేదని అన్నారు. తనకు తెలిసినంత వరకు ఇద్దరు కంగనా రనౌత్‌లు ఉన్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.