Ramayana Movie Release Date : నితేశ్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'రామాయణ'. పలువురు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో కలిసి అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎట్టకేలకు 'రామాయణ' సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.
రెండు పార్టులుగా 'రామాయణ' మూవీ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే గత కొంతకాలంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యయి. అంతే కాకుండా షూటింగ్ స్పాట్లో తీసిన కొన్ని ఫొటోలు కూడా లీకయ్యాయి.
MASSIVE DEVELOPMENT... 'RAMAYANA' PART 1 & 2 RELEASE DATE ANNOUNCEMENT... Mark your calendars... #NamitMalhotra's #Ramayana - starring #RanbirKapoor - arrives in *theatres* on #Diwali 2026 and 2027.
— taran adarsh (@taran_adarsh) November 6, 2024
Part 1: #Diwali2026
Part 2: #Diwali2027
Directed by #NiteshTiwari. pic.twitter.com/3BRWR0bg2L
రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి
ఇక 'రామాయణ'లో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నారు. సీతగా సాయిపల్లవి అలరించనున్నారు. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. ఇక హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ దేవోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా కనిపించనున్నట్లు సమాచారం.
'మద్యపానం కూడా మానేశాను'
రాముడి పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్నానని, డైట్ ఫాలో అవుతున్నట్లు బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తెలిపారు. మద్యపానం కూడా మానేసినట్లు వెల్లడించారు. అలాగే సీత పాత్రలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ సాయిపల్లవి పేర్కొన్నారు.‘ చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథల్లో రామాయణం ఒకటని, సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. భయాన్ని పక్కనపెట్టి, సీతమ్మగా మారాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. నటిగా కాకుండా భక్తురాలిగా ఆ రోల్ చేస్తున్నానని వివరించారు.
అంతర్జాతీయ టెక్నీషియన్స్
'రామాయణ' మూవీ కోసం ప్రపంచ స్థాయి టెక్నిషీయన్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కోసం ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్ ఈజీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సినిమాకు తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్రబృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ట్యూన్స్ ఇచ్చేది వారే!
అలాగే మ్యూజిక్ అందించే బాధ్యతను ఆస్కార్ విజేతలకు ఇచ్చారట. ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ రామాయణకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. హన్స్ జిమ్మెర్ హాలీవుడ్ లోని టాప్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు రామాయణ కథ వివరించిన వెంటనే అంగీకరించారని, దీని పనులు మొదలుపెట్టేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
'రామాయణ' సెట్స్‌లోకి రావణ'యశ్' - అప్పుడు నుంచే! - Ramayana Yash
'రామాయణ'లో రణ్‌బీర్ ద్విపాత్రాభినయం - ఆ పాత్రకు అమితాబ్ వాయిస్ ఓవర్! - Ramayan Ranbir Kapoor