ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @5PM
టాప్​టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jul 16, 2021, 5:00 PM IST

  • తెలంగాణ స్వప్నం సాకారం కోసం..

చేనేత వర్గాలకు వందశాతం ఉజ్వల భవిష్యత్‌ అందించే మార్గాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ భరోసా ఇచ్చారు. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌, సిరిసిల్లలో అపరెల్‌ పార్క్‌లతో చేనేత జీవన ముఖచిత్రం మారుతుందనే విశ్వాసం ప్రకటించారు. తెలంగాణ తెదేపా మాజీ అధ్యక్షుడు ఎల్​.రమణకు గులాబీ కండువా కప్పి లాంఛనంగా తెరాసలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలీస్​ స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్య..

వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరి పీఎస్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి పోలీస్​స్టేషన్​లోనే కుప్పకూలిన బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేటాయింపుల ప్రకారమే నీటి పంపిణీ..

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై ఇచ్చిన నోటిఫికేషన్​ వివరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపణీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని, అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి, ఇరురాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • త్వరలోనే ఉద్యోగాల భర్తీ..

బీసీ సంక్షేమ శాఖలో ఖాళీల గుర్తింపుపై ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్ష నిర్వహించారు. జోన్ల విభ‌జ‌న పూర్తితో ఉద్యోగాల భ‌ర్తీ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నార‌ని మంత్రి వెల్లడించారు. ఉద్యోగ ఖాళీల పూర్తి స‌మాచారాన్ని త్వరలోనే ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తారు..

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ మంత్రి పేర్ని నాని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం... పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పుణ్యక్షేత్ర నిర్మాణం అద్భుతంగా జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సోనియాతో సిద్ధూ భేటీ..

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మరోమారు భేటీ అయ్యారు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. ఈ సమావేశంలో రాహుల్​ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్​ రావత్​ పాల్గొన్నారు. సిద్ధూకు పంజాబ్​ కాంగ్రెస్​ పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మాజీ హోంమంత్రి ఆస్తులు అటాచ్​..

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై పీఎంఎల్​ఏ చట్టం కింద చర్యలు చేపట్టింది ఈడీ. ఆయనకు చెందిన రూ.4 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టార్గెట్ చైనా!

హిందూ మహాసముద్రంలో.. భారత నావికాదళంతో యుద్ధ విన్యాసాలు జరపనుంది బ్రిటన్. జులై 26న జరిగే ఈ కార్యక్రమం కోసం బ్రిటన్​ యుద్ధ నౌక హెచ్​ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్​ ఇప్పటికే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​- పాక్​ 'మ్యాచ్'​ ఫిక్స్..

టీ20 ప్రపంచకప్ డ్రా విడుదలైంది. గ్రూప్​ 2లో భారత్​తో పాటు పాకిస్థాన్ కూడా ఉంది. 8 జట్లు నేరుగా పొట్టి ప్రపంచకప్​కు అర్హత సాధించగా.. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్స్​లో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కమల్ 'విక్రమ్' షూటింగ్ షురూ..

కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం విక్రమ్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. అలాగే ఆర్య నటించిన సార్పట్ట తెలుగు ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.