అప్పుడే ఇంటర్ పరీక్షలు!
ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆగస్టు మొదటి వారంలో పరీక్షలను(Inter first year exams) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆగస్టులో ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కాల్పుల కలకలం
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేపాయి. అబిడ్స్‌లోని ఎస్‌బీఐ కార్యాలయ ఆవరణలో కాల్పుల మోత మోగింది. ఒప్పంద ఉద్యోగి సురేందర్‌పై సెక్యూరిటీ గార్డు సర్దార్‌ఖాన్ కాల్పులు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యాయత్నం.!
ప్రగతిభవన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆక్రమణకు గురైన భూమి విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
61 లక్షలకు చేరాయి.!
తెరాస సభ్యత్వాల సంఖ్య 61 లక్షలకు చేరుకుందని.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమాల విభాగం ఏర్పాటుచేయాలని... పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అధికారపక్ష నేతగా గోయల్!
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు భాజపా అధిష్ఠానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. రాజ్యసభలో భాజపాపక్ష నేతగా ఆయన్ను నియమించింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డీఏ అమలు అప్పుడే..!
ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు, ఆయుష్ మిషన్ పొడగింపు వంటి పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'గల్వాన్‌లో మళ్లీ ఘర్షణ!'
తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం మరోసారి దుస్సాహసానికి పాల్పడిందా? గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ(India China soldiers clash) జరిగిందా? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షేర్ చేసిన కథనంలో ఏముంది? దీనిపై ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారు టీకా తీసుకుంటేనే సేఫ్!
కొవిడ్(Covid-19) నుంచి కోలుకున్నవారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంగా గతంలో కరోనా బారిన పడి కోలుకున్న చాలా మంది.. తమలో యాంటీబాడీలు ఉన్నాయని భావించి టీకా(Corona vaccine) తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అంబాసిడర్ అతనేనా?
అడిడాస్, గాటోరేడ్, హార్డ్ రాక్ కేఫ్, జకోబ్, పెప్సీ వంటి పలు బడా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(lionel messi).. భారత్‌లోని ఓ స్థానిక బీడీ కెంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడని మీకు తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆమె బిడ్డ రెండు నెలలు ఐసీయూలోనే.!
తనకు పుట్టిన చిన్నారి.. రెండు నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నాడని హీరోయిన్ దియా మీర్జా వెల్లడించింది. ఆ విషయాన్నే చెబుతూ, ఇన్‌స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.