కేటీఆర్ కీలక సమావేశం
తెరాస ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉ.11 గం.కు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గిరిజనుల ఆగ్రహం
మహబూబాబాద్‌లో అటవీ అధికారులపై గిరిజన రైతులు దాడి చేశారు. పోడుభూమిలో సాగు చేస్తున్న గిరిజన రైతులను అటవీ సిబ్బంది అడ్డుకోగా.. వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కోర్టుల్లో అన్‌లాక్.!
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' భవిష్యత్తు తరాలకు అవసరం'
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పలువురు రచయితలు కలిశారు. తాము రచించిన పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు. సమాజానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎం పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (cm jagan).. పోలవరం పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విస్తరించిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఐదు రోజుల ఆలస్యంగా ఇవి ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్
నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియమితులయ్యారు. ఈ మేరకు నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పేరు మార్పుకు అదే కారణమా?
ఓయో సీఈఓ పేరు మార్చుకున్నారు. దీని వల్ల సంస్థకు మరింత లాభం జరుగుతుందని ఓయో భావిస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటి? ఆయన ఎందుకిలా చేశారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గంగూలీ బయోపిక్‌లో ఆ హీరో!
తన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly) అంగీకారం తెలిపాడని తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇందులో హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నవ్విస్తోన్న'మిమీ' ..!
సరోగసీ(అద్దె గర్భం దాల్చటం) నేపథ్యంలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిమీ'. కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అలరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.