1. 'కేసులు తగ్గుతున్నాయి'
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు వైద్య, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లాక్‌డౌన్ లేదు
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధింపుపై సీఎస్ సోమేశ్‌కుమార్ స్పష్టత ఇచ్చారు. లాక్‌డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. లాక్‌డౌన్ కరోనా సమస్యకు పరిష్కారం కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చేతులు కడుగుతున్నారా..
కరోనా నేపథ్యంలో అతిగా చేతులు శుభ్రం చేసుకోవటం, ఎక్కువసార్లు శానిటైజర్లు వినియోగించటం ద్వారా చర్మం పొడిబారి సమస్యలకు దారి తీస్తుంది. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినం సందర్భంగా ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అవి ఊపిరి తీసే సిలిండర్లు
మహారాష్ట్రలో ప్రాణావాయువు పేరుతో కార్బన్‌డై ఆక్సైడ్ సిలిండర్లు విక్రయిస్తోన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు ఓ సామాజిక కార్యకర్త. ఈ సిలిండర్లు రోగుల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, అవి పేలిపోయే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అలా చేస్తే సమస్య తీరుతుందా..
దిల్లీలో గత మూడు రోజుల్లో ఎంత మొత్తంలో ఆక్సిజన్ సరఫరా చేశారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారులను శిక్షంచడం ద్వారా ఆక్సిజన్ కొరత తీర్చలేమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ముచ్చటగా మూడోసారి
బంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అందిరికీ ఉచిత వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్ వంటి ఔషధాలు అందుబాటులో ఉంచాలని కోరుతూ మోదీకి దీదీ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. రుణం తీర్చుకుంటూ..
ఓ వైపు తల్లి మరణం. మరోవైపు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రి. ఆ పరిస్థితుల్లో ధైర్యం కోల్పోని ఓ వ్యక్తి.. ఆరోగ్యం క్షీణించిన తన తండ్రిని కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. భారీ నష్టాలతో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 465 పాయింట్లు క్షీణించి 48,253 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,496 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టీ20 ప్రపంచకప్ ఎప్పుడంటే...
ఐపీఎల్ వాయిదా పడటం వల్ల టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. దీనిపై నిర్ణయం జులైలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఉదారతను చాటుకున్న అడివి శేష్
హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు హీరో అడివి శేష్. తన వంతు బాధ్యతగా నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.