- పురపోరుకు వేళాయే..
రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానుంది. వరంగల్, ఖమ్మం నగరపాలికలు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఈనెల 30న పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఒక్కొక్క వార్డుకు కూడా అదే రోజు ఓటింగ్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నాన్న బాటలో..
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధిస్తే ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెరాస అభ్యర్థి నోముల భగత్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఈనెల 17న జరిగే పోలింగ్‌లో తనకే ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ చరిత్ర సృష్టిస్తుంది..
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు జానారెడ్డి అన్నారు. తెరాస అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాలియాలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓట్లు కొని గెలవాలనుకుంటున్నారు..
సాగర్ ఉప ఎన్నికలో తెరాస నాయకులు డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెరాసకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. నల్గొండ జిల్లా తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. జానారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.150కిపైగా ఎగిసింది. వెండి ధర రూ.200కుపైగా పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీబీఐకి ఇస్రో గూఢచర్యం కేసు..
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై పోలీసుల కుట్ర కేసులో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది ముగ్గురు సభ్యుల అత్యున్నత కమిటీ. ఈ కేసును గురువారం సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చెత్త బండి'లో మృతదేహాల తరలింపు..
కొవిడ్ కారణంగా మానుషుల్లో మానవత్వం నశించిపోతోంది. కరోనాతో మృతిచెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో వైరస్‌తో చనిపోయిన వారిని.. శ్మశానవాటికకు తరలించేందుకు అక్కడి అధికారులు.. చెత్త తరలించే బండిని ఉపయోగించడం కలచివేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యూనిఫామ్‌లో ఉన్న పోలీసుపై దాడి..
యూనిఫామ్‌లో ఉన్న పోలీసును కొంతమంది చితకబాదారు. ఈ ఘటన దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్!
టీ20ల్లో భారత్ తరఫున ఘనత సాధించేందుకు అశ్విన్ సిద్ధమవుతున్నాడు. మరో వికెట్ తీస్తే 250 వికెట్ల మార్క్‌ను చేరుకుంటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బోర్డర్' ఫస్ట్‌లుక్..
తమిళ నటుడు అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న 'బోర్డర్' ఫస్ట్‌లుక్ విడుదలైంది. అలాగే సుదీప్ హీరోగా నటిస్తోన్న 'విక్రాంత్ రోనా' రిలీజ్ డేట్ ఖరారైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.