ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @5PM

author img

By

Published : Apr 13, 2021, 4:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
TOP TEN NEWS @5PM
  • ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈ ఏడాది సాధారణ వర్షపాతమే..

నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది సాధారణం వర్షపాతం నమోదు కానుందని ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మాయ మాటలు చెప్పేవారిని మళ్లీ నమ్మొద్దు..

సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బలం చూపించుకునేందుకు అధికార పార్టీ నేతలు.. పట్టు పెంచుకునేందుకు ప్రతిపక్ష నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పండగ నాడూ.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉగాది శుభాకాంక్షలు తెలిపిన దత్తన్న..

హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర రాజ్​భవన్​లో యజ్ఞం నిర్వహించారు. కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మందుపాతరలకే భయపడలేదు..

సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగాది పంచాగ శ్రవణంలో పాల్గొన్న ఆయన.. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఏడాది నెలకొన్న చీకట్లను ఈ కొత్త సంవత్సరంలో అధిగమించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆరుగురు కరోనా రోగులు మృతి..

ఆక్సిజన్ కొరత కరోనా రోగుల పాలిట మృత్యుపాశమైంది. మధ్యప్రదేశ్​ భోపాల్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేమితో ఆరుగురు కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​కన్నా ఎవరూ ముఖ్యం కాదు..

ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అమెరికాకు భారత్​కన్నా మరే దేశం ముఖ్యం కాదని అగ్రరాజ్యానికి చెందిన ఓ మేధో సంస్థ పేర్కొంది. ఇరు దేశాలు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రపంచంలో రెండు భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. భారత్​లోని సంస్థలపై అమెరికా కంపెనీలు ఆధారపడటం వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు మంగళవారం మరింత దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.130 తగ్గింది. వెండి ధర దాదాపు రూ.66 వేలకు దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఇండియా ఓపెన్' టోర్నీ..

ఇండియా ఓపెన్ టోర్నీ షెడ్యూల్​ ప్రకారమే జరగనుంది. అయితే కరోనా రెండో దశ ప్రభావం వల్ల, ప్రేక్షకులు ఎవర్ని మ్యాచ్​లు చూసేందుకు అనుమతించట్లేదని బాయ్ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • షట్లర్ గుత్తా జ్వాల పెళ్లి తేదీ ఫిక్స్​..

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ పెళ్లి ముహూర్తం ఏప్రిల్​ 22న ఖరారైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు విశాల్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.