ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
TOP TEN NEWS @5PM
author img

By

Published : Apr 9, 2021, 5:00 PM IST

  • ఆదుకుంటాం..

ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచి రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందించనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో సుమారు లక్షా 45 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ..

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రముఖ టెక్స్​టైల్ కంపెనీ ముందుకొచ్చింది. రెడిమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రగతిభవన్​లో టెక్స్​టైల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకా పక్కా..

రాష్ట్రంలో రెండో దశలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికుల నుంచి కమిషనర్​ వరకు ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యాక్సినేషన్ నిర్వహణపై జోనల్ కమిషనర్లతో.. కమిషనర్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాస అసత్య ప్రచారం చేస్తోంది..

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్‌కు భాజపా అంటే భయం పట్టుకుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • షర్మిలకు ఘనస్వాగతం..

ఖమ్మంలో సంకల్ప సభకు వెళ్తున్న వైఎస్ షర్మిలకు సూర్యాపేట జిల్లాలో ఘనస్వాగతం లభించింది. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో వాహనం దిగి అభిమానులకు ఆమె అభివాదం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎయిమ్స్​లో 35 మంది వైద్యులకు కరోనా..

దిల్లీ ఎయిమ్స్​లో కరోనా కలకలం రేగింది. ఏకంగా 35 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరణంలోనూ వీడని స్నేహం..

కుల మతాల పేరిట గొడవలు పడే వారిని చూస్తుంటాం. అయితే మతాలు వేరైనా అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పదని నిరూపించారు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నలభై ఏళ్లుగా స్నేహం చేసిన వారు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని చాటారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పెరిగిన పసిడి- తగ్గిన వెండి..

దేశీయంగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.97 పెరిగింది. కిలో వెండి ధర రూ.275 తగ్గి.. రూ.66,253కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముంబయితో మ్యాచ్​ అంటే గట్టి పోటీనే..

ఐపీఎల్​లో తమ జట్టు ముంబయితో ఆడనున్న తొలిమ్యాచ్​కు ముందు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. డిఫెండింగ్ ఛాంపియన్​తో మ్యాచ్​ కోసం తాము ఆసక్తికరంగా చూస్తున్నట్లు తెలిపాడు. ఇరుజట్ల మధ్య గొప్ప పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నటి ఐశ్వర్యకు కరోనా..

తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి.. కొవిడ్ బారిన పడింది. దీంతో ఆమె హోం క్వారంటైన్​లోకి వెళ్లిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.