ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
TOP TEN NEWS @5PM
author img

By

Published : Apr 4, 2021, 5:00 PM IST

  • తేలిక పాటి వర్షాలు..

రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చనిపోయి బతికింది..

ఆ అమ్మాయి వయస్సు ఇరవై ఏళ్లు.. అయినా మనస్సు మాత్రం చాలా పెద్దది. తల్లిదండ్రుల మనస్సు ఇంకా గొప్పది. తాను చనిపోయి ఏడుగురికి అవయవాలిచ్చి.. కొత్త జీవితాన్నిచ్చింది. గర్భశోకాన్ని దిగమింగుకున్న తల్లిదండ్రులు అందుకు సహకరించి ధన్యజీవులు అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈస్టర్​ శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్​ ఈస్టర్​ శుభాకాంక్షలు తెలిపారు. పండగ స్ఫూర్తితో కరోనాపై అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా​..

రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పర్శపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అదే ఆ అమ్మవారి ప్రత్యేకత..

ఆ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టి... ఏదయినా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. చతుర్భుజాలతో దర్శనమిస్తూ... భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలసి... పూజలు అందుకుంటున్న ఆ దేవతే ఇష్టకామేశ్వరి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'మోదీ దేవుడా? మానవాతీత శక్తా?'

బంగాల్​లో భాజపా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పడానికి ప్రధాన నరేంద్ర మోదీ 'దేవుడా, మానవతీత శక్తా' అని ఎద్దేవా చేశారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. మైనారిటీ ఓట్లు కొల్లగొట్టడానికి ఓ వ్యక్తికి భాజపా డబ్బులు ముట్టజెప్పిందని అబ్బాస్​ సిద్ధిఖీపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కాంగ్రెస్​ వ్యూహమేది?

అసోంను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్​ పార్టీ దగ్గర వ్యూహాలేవి లేవని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విమర్శించారు. అసోంలో చివరి దశ పోలింగ్ నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పంచాయతీ పోరులో అందాల భామ..

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆసీస్​ మహిళా జట్టు అదిరే రికార్డు..

వరుసగా ఎక్కువ మ్యాచ్​ల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది. ఇంతకీ ఆ జట్టు ఎన్ని మ్యాచ్​లు గెలిచిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలీవుడ్​ నటుడు గోవిందకు కరోనా..

ప్రముఖ నటుడు గోవిందకు కరోనా పాజిటివ్​గా తేలింది. కొద్దిపాటి కొవిడ్​ లక్షణాలతో ప్రస్తుతం ఆయన స్వీయనిర్బంధంలో ఉన్నట్లు గోవింద సతీమణి సునీత వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.