- సీఎం రాజీనామా..
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగాయి. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. తన పదవికి రాజీనామా చేశారు. అసమ్మతి ఎదురైన కారణంగా ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం..
బంగారం, వెండి ధరలు మంగళవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.35 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.553 పుంజుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ అలా చెప్పలేదు..
తెలంగాణలో ధాన్యం సేకరణ కేంద్రాలపై పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో లేవనెత్తారు. ధాన్యం కేంద్రాలు మూసివేస్తున్నట్లు రాష్ట్రం ప్రకటన చేసిందన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ధాన్యం సేకరణ కేంద్రాలు మూసివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆరుగురికి బెయిల్..
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి సహా మొత్తం ఆరుగురికి బెయిలిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెరాస దొంగ ఓట్లు చేర్చింది..
రాష్ట్రాన్ని తెరాస ప్రభుత్వం అప్పులపాలు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపాను అడ్డుకునేందుకే దొంగఓట్లు చేర్చారని విమర్శించారు. సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్రం అమ్మేస్తుంటే.. సీఎం కొంటున్నారు..
విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి.. జగన్ లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించారు. వైకాపా నాయకులు ఇకనైనా డ్రామాలు ఆపాలంటూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాస్క్ అవసరం లేదా?
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు అక్కడి ఆరోగ్య శాఖ తీపి కబురు చెప్పింది. ఇంటి లోపల మాస్కు, భౌతిక దూరం నిబంధనలు పాటించకుండానే వారు సాధారణంగా గడపవచ్చని తెలిపింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు రూపొందించిన ఫెడరల్ ఆరోగ్య అధికారులు.. కొత్త నిబంధనల అమలుతో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 51వేలు దాటిన సెన్సెక్స్..
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్లు బలపడి 51,025వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,098 పైకి చేరింది. ఆర్థిక,ఐటీ షేర్లు లాభాలను గడించాయి. హెవీ వెయిట్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీ20 ఆడేందుకు సిద్ధం..
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు.. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సిద్ధమవుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటాలని ముమ్మర సాధన చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హార్దిక్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలాంటి సినిమా చేయాలని ఉంది..
శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన సినిమా గాలిసంపత్. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడిగా వ్యవహరించిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు. దీంతో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో సినిమా చేయలని ఉందని మనసులో మాట చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.