ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM - Telangana news in telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM
author img

By

Published : Jun 29, 2021, 4:58 PM IST

సుప్రీం గ్రీన్ సిగ్నల్

జులై 5 నుంచి ఛార్టర్డ్​ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఏఐకి అనుమతించింది సుప్రీంకోర్టు. ఐసీఏఐ పరీక్షలకు సంబంధించిన మూడు పిటిషన్లపై సుప్రీం మంగళవారం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అలా అయితే హెల్మెట్​ ధరించాల్సిందే'

వర్షాకాలం వేళ ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్​ చేయలాని సీపీ అంజనీకుమార్​ సూచించారు. వాహనంపై ఇద్దరుంటే ఇద్దరూ హెల్మెట్​ ధరించాలని సూచించారు. త్వరలో నిర్వహించనున్న బోనాల వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు సహకరించాలని సీపీ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో వర్షసూచన

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ 'ఇంద్రజాల్'

జమ్ము వాయుసేన స్థావరంపై డ్రోన్ల (Drone) దాడి, కలుచక్‌లోని సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ముప్పు వచ్చి మన ముంగిట నిలిచిందన్న విషయం ఈ ఘటనలతో అర్థమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సుప్రీంలో పిటిషన్

గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు సిట్​ ఏర్పాటుపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్​ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చిన్నారులకు రక్ష

చిన్నారుల్లో కరోనావాక్ టీకా​ సురక్షితం, ప్రభావవంతమని ఓ అధ్యయనంలో తేలింది. రెండు టీకా డోసులు వేసుకున్న 3-17 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అయినట్లు వెల్లడైంది. టీకా వేసుకున్న చోట కొద్దిపాటి నొప్పి మినహా ప్రతికూల అంశాలు లేవని తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ సంస్థ పనే

జమ్ములో వైమానిక స్థావరంపై దాడికి పాల్పడింది ఉగ్రసంస్థ లష్కరే తొయిబా అని అనుమానిస్తున్నారు అధికారులు. పాక్​ నుంచే ఆ డ్రోన్లు వచ్చాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హక్కులు వారికే.!

పురుషుల టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 14 వరకు పొట్టి ప్రపంచకప్​ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మళ్లీ నష్టాలే.!

వరుసగా రెండో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు తగ్గి 52,600 దిగువకు చేరింది. నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో..15,750 మార్క్ కోల్పోయింది. బ్యాంకింగ్, లోహ షేర్లు అధికంగా నష్టపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆరోజే ఎందుకు?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​'(RRR Movie) సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. టాకీ పార్ట్​ పూర్తయ్యిందని చిత్రబృందం ఓ పోస్టర్​ ద్వారా తెలియజేయడం సహా అందులో విడుదల తేదీని గతంలో చెప్పిన (13 అక్టోబరు 2021) దానికే కట్టుబడి ఉంది. దీంతో సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తీపికబురు చెప్పినట్లైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.