- ముగిసిన అంత్యక్రియలు...
హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో మృతిచెందిన గర్భిణీ అంత్యక్రియలు ముగిశాయి. తల్లికి, శిశువుకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎనిమిది నెలలు నిండిన గర్భిణీ పావని.. శుక్రవారం రోజున అంబులెన్సులోనే ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా పరిస్థితులపై మోదీ...
దేశంలో కరోనా రెండో దశ పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్‌గా ఈ భేటీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గుతున్న కరోనా కేసులు...
రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల కొంతమేర కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే.. కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి భారీగా మృతదేహాలు...
ఉత్తర్‌ప్రదేశ్ ఘాజీపుర్‌లోని గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. శనివారం ఉదయం ఈ మృతదేహాలను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అనాథలైన చిన్నారులకు అండగా...
కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వారి చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రసంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి!...
దక్షిణాది ప్రజలు ప్రత్యేకించి తెలుగు వారిలో చాలామందికి రసం లేనిదే ముద్ద దిగదు. దీనికున్న రుచి అలాంటిది మరి. వంటగదిలో దొరికే కొన్ని పదార్థాలతో సులభంగా తయారుచేసుకునే ఈ వంటకంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ వలసదారులకు ఊరట
అమెరికా వచ్చే వలసదారులు వైద్య ఖర్చులను సొంతంగా భరించేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానానికి జో బైడెన్ స్వస్తి పలికారు. ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ విధానం అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా లేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకతలివే..
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ మూడు ల్యాప్‌టాప్‌లను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. పరిమాణం, సామర్థ్యాన్ని బట్టి వాటి పేర్లను, ధరలను నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒలింపిక్స్‌పై అనుమానాలు..
ఒలింపిక్స్‌కు ఇంకా పది వారాల సమయం మాత్రమే ఉంది. కొవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో అసలు ఒలింపిక్స్ జరగుతాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రాధే' చిత్రంపై మీమ్స్ చూశారా!..
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే' చిత్రం గురువారం విడుదలైంది. అయితే తొలి రోజు నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ మూవీని టార్గెట్ చేస్తూ నెట్టింట మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.