ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM
author img

By

Published : Nov 22, 2020, 12:59 PM IST

భద్రతకు ఓటు వేయండి..

ప్రజల భద్రత, రక్షణకు తెరాస ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆరేళ్లలో హైదరాబాద్​లో చేసిన అభివృద్ధిపై ట్విట్టర్​లో వీడియోను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాసను నిలదీయండి..

రెండు పడకగదుల ఇళ్ల కోసమే గత ఎన్నికల్లో తెరాసకు ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేశారని కిషన్​రెడ్డి తెలిపారు. పేద ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లను దండుకున్నారని ధ్వజమెత్తారు. సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. దుబ్బాక ప్రజలు మార్పునకు తొలి అడుగు వేశారన్న కిషన్‌రెడ్డి.. అక్కడ స్ఫూర్తితో నగర ప్రజలు భాజపాను గెలిపించాలని కోరుతున్నామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెలంగాణ తేజం...

తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త... కొవిడ్​కు సరికొత్త చికిత్సను కొనుగొన్నారు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్ర మెంఫిస్‌ నగరంలో ఉన్న సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్న తెలుగు సైంటిస్ట్​... కరోనా సోకినవారిలో ‘ఇన్‌ఫ్లమేటరీ కణ మరణం’ అనే ప్రక్రియను గుర్తించారు.దాన్ని విచ్ఛిన్నం చేసే చికిత్సలను కనుగొన్నారు. ఆమే.. తెలుగు తేజం తిరుమల దేవి కన్నెగంటి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్​ ప్రస్థానం..

ఓ రాజు యువతిపై పెంచుకున్న ప్రేమ.. ఆమె ఊరిని భాగ్యనగరంగా మార్చింది. తర్వాత వచ్చిన వారూ ఆ నగరాన్ని అమితంగా ఆదరించి హైదరాబాద్‌గా తీర్చిదిద్దితే.. ఆధునిక పాలకులూ ఒక్కో ఇటుక పేర్చుతూ.. నేడు విశ్వనగరంగా విలసిల్లేలా చేశారు.! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మూడు మతాల సాక్షిగా..

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన సందర్భం. అందుకే వివాహాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకోసం మూడు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రంప్​ తీసుకున్న డ్రగ్​కు ఆమోదం..

కరోనాతో విలవిల్లాడుతోన్న అమెరికా ప్రజలను కాపాడేందుకు ఎఫ్​డీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ప్రయోగాత్మక కరోనా డ్రగ్​కు అత్యవసర ఆమోదం ఇచ్చింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి ఈ ఔషధం ఉపశమనం ఇస్తుందని పేర్కొంది.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చైనా వక్ర బుద్ధి..

భారత్​-చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని పరిష్కరించడానికి ఇప్పటికే పలు దఫాలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ తరుణంలో ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయలను అభివృద్ధి చేస్తోంది చైనా​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పండుగ వేళ విజృంభణ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తంగా 5 కోట్ల 84 లక్షలకు పైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 13లక్షల 86 వేల మందికి పైగా మృతిచెందారు. జపాన్​లో పండుగ సెలవుల నేపథ్యంలో గడిచిన నాలుగు రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు బయటపడతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరోసారి చరిత్ర సృష్టిస్తాం..

ఆసీస్​ గడ్డపై టెస్టు సిరీస్​లో మరోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తామని టీమ్​ఇండియా పేసర్​​ షమి ధీమా వ్యక్తం చేశాడు. ఎంతటి ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​ అయినా తమ బౌలింగ్​లో ఔట్​ అవ్వాల్సిందేనని అన్నాడు. డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హాస్యనటి భర్త కూడా అరెస్టు..

మాదకద్రవ్యాల వినియోగం కేసులో బాలీవుడ్​ హాస్యనటి భారతీ సింగ్​తో పాటు ఆమె భర్త హర్ష్​ను అరెస్టు చేశారు. సోదాల్లో భారతీ నివాసంలో గంజాయిని స్వాధీనం చేసుకోగా.. వారిద్దరూ దాన్ని సేవించినట్లు విచారణలో అంగీకరించారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.