ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM - TOP TEN NEWS @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM
టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM
author img

By

Published : Nov 19, 2020, 10:57 AM IST

  • మరో 45,576 కొవిడ్ కేసులు..

భారత్​లో కొత్తగా 45,576 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 89 లక్షల 58 వేలు దాటింది. మరో 585 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అభివృద్దికి ఓటేయండి..

రాజకీయ కుట్రలకు తావివ్వకుండా... బాధ్యతాయుత పార్టీకి మాత్రమే అమూల్యమైన ఓటేసి గెలిపించాలని హైదరాబాదీలను ఎమ్మెల్సీ కవిత కోరారు. ఆరేళ్లలో హైదరాబాద్​ సాధించిన పురోగతిని విశ్లేషించుకోవాలని... బలమైన నాయకత్వాన్ని కొనసాగించాల్సి బాధ్యత నగరవాసులపై ఉందని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మేమే ప్రత్యామ్నాయం..

భాగ్యనగరంలో భాజపా జెండా ఎగరేస్తుందనే భయంతోనే ప్రభుత్వం గ్రేటర్​ ఎన్నికల నోటిఫికేషన్​కు తెరలేపిందని ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. జీహెచ్​ఎంసీలో అన్ని చోట్ల తెరాసకు ప్రత్యామ్నాయం తమ అభ్యర్థులే అని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్​ మహిళా కార్యదర్శి గోదావరిని భాజపాలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గాంధీభవన్‌ కిటకిట..

చాలా రోజుల తర్వాత గాంధీ భవన్​ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల దృష్ట్యా.... నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. మహిళలు సైతం పెద్దఎత్తున గాంధీ భవన్​కు చేరుకుని దరఖాస్తులు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సిరా చుక్క కథ తెలుసుకోండి..

బల్దియా ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పత్రాల ముద్రణను హైదరాబాద్​లోని 15 ప్రింటింగ్ కేంద్రాలకు అప్పగించారు. మరి పోలింగ్ రోజున ఓటరు వేలిపై పెట్టే సిరా చుక్కకు పెద్ద కథే ఉంది. ఈ సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసుకోండి మరి! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పుష్కర ఏర్పాట్లు..

పన్నెండేళ్లకొకసారి నదీమ తల్లికి జరిగే పుష్కర సంబురానికి సర్కార్‌ సర్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఎంతో వైభవంగా సాగే తుంగభద్ర పుష్కరాలు ఈ నెల 20 నుంచి ఆరంభం కానున్నాయి. కొవిడ్ దృష్ట్యా ఈసారి నిరాడంబరంగా సాగుతున్న ఉత్సవాలకు... అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు నిబంధనలకు లోబడి పుష్కరాల్లో పాల్గొనేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇందిరా గాంధీకి రాహుల్ నివాళులు​..

మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆమెకు నివాళులర్పించారు. దిల్లీలోని శక్తిస్థల్​లో ఉన్న ఇందిర సమాధి వద్దకు రాహుల్​ సహా పార్టీ ముఖ్యనేతలు చేరుకున్నారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రీకౌంటింగ్​ ఫలితాలు ఎప్పుడంటే..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జార్జియాలో ఓట్ల లెక్కింపుపై చేపట్టిన ఆడిట్​ నేటితో ముగియనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చేతితో లెక్కింపు ప్రక్రియ ముగుస్తుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి ఆడిట్​ నివేదికను విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బుమ్రా, షమి కష్టమే!..

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​కు బౌలర్లు బుమ్రా, షమిలకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్​ఇండియా మేనేజ్​మెంట్ భావిస్తోంది. టెస్టు సిరీస్​ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 17న తొలి టెస్టు ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దర్శకుడి యాటిట్యూడ్​ నచ్చింది..

దాదాపు 25 ఏళ్ల తర్వాత ప్రేక్షకులకు కనిపించిన 'నిరీక్షణ' అర్చన.. 'ఆలీతో సరదాగా' షోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో భారీ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.