- కొవిడ్‌పైనే తొలి యుద్ధం..
అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని బైడెన్ ప్రకటించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికాలోని ప్రతి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేనే గెలిచాను..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాభావం చవిచూసినా.. ఇంకా ఓటమిని అంగీకరించడంలేదు డొనాల్డ్ ట్రంప్. బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మరోమారు ఆరోపించారు. 7 కోట్లకుపైగా ఓట్లు సాధించిన తానే గెలిచినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజకీయ జీవితం ముగిసిపోతుందా..
రెండోసారి అగ్రరాజ్య పెద్దన్నగా వెలుగొందాలనే అధ్యక్షుడు ట్రంప్ కలలు కల్లలయిపోయాయి. భారీ మెజారిటీతో గెలవాలనుకున్న ట్రంప్ ఆశలకు గండిపడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ జీవితం ఇక్కడితో ముగియనుందా? లేదా 2024లో జరగునున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా 45,674 కరోనా కేసులు..
దేశంలో కొత్తగా 45,674 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 559 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 85,07,754కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,26,121కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అప్పుడు నాగరాజు.. ఇప్పుడు ధర్మారెడ్డి..
మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ లంచం కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ పాసుపుస్తకాల కేసులో అరెస్టైయిన ధర్మారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ కుషాయిగూడ వాసవీ శివనగర్ కాలనీలో ఉరేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పత్తి రైతులకు షాక్..
తెలంగాణలో పత్తి రైతులకు సీసీఐ షాకిచ్చింది. నాణ్యంగా లేదంటూ ఈనెల 12 నుంచి మద్దతు ధరను రూ.50 తగ్గిస్తున్నట్లు భారత పత్తి సంస్థ (సీసీఐ) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంతా ఖుల్లా.. అవుతాం గుల్ల..
హైదరాబాద్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ ఊపందుకున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బార్‌లు, మాల్స్ అన్ని తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలతోపాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఇవన్నీ సాగించాలని ప్రభుత్వం పేర్కొన్నా.. చాలా చోట్ల ఆ నిబంధనలే కానరావడంలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంతా... అవినీతి రాజకీయ సంత..
అవినీతి అరికట్టేందుకు 1963లో కేంద్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సీబీఐ చేరుకుందా? అన్న ప్రశ్నకు సీబీఐ పనిపోకడలు భ్రష్టు పట్టిపోయాయనే స్పష్టమవుతోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి రాజకీయ ప్రయోజనాన్ని సాధించి పెట్టగల పనిముట్టుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలా అనడం సరికాదు..
ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలనడం సరికాదని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. అది సరైనా పరిష్కారం కాదని అభిప్రాయపడ్డాడు. జట్టు మెరుగుపడేలా మార్పులు చేయాలని ఫ్రాంచైజీకి సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సవాలు స్వీకరించిన రామ్‌చరణ్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో రామ్‌చరణ్.. మొక్కలు నాటి తన వంతు బాధ్యత నిర్వర్తించారు. తన అభిమానులు కూడా మొక్కలు నాటాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.