ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@ 11AM - top news in Telugu

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు...

TOP TEN NEWS@11AM
TOP TEN NEWS@11AM
author img

By

Published : Sep 22, 2020, 11:01 AM IST

1.తగ్గినట్టే తగ్గి...

రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న కాస్తా తగ్గుముఖం పట్టినప్పట్టికీ నేడు మళ్లీ పెరిగిపోయాయి. రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.కరోనా గేరు మార్చింది...

భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 75,083 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1053 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.విపక్షాల వాకౌట్​...

రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కాంగ్రెస్​ డిమాండ్ చేసింది. కనీస మద్దతు ధరకు సంబంధించి మరో బిల్లు తీసుకురావాలని ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్​ స్పష్టం చేశారు. లేకపోతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.సస్పెండ్​ చేసి టీ ఇచ్చారు...

సస్పెండ్​ అయిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల దగ్గరకు వెళ్లి వారికి టీ ఇచ్చారు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్. వారి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడారు. డిప్యూటీ ఛైర్మన్​పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.వాటి వెనుక భారీ కుట్ర...

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. అందుకోసం కుట్రదారులకు రూ.1.61 కోట్లు అందాయని వెల్లడించారు. దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇటీవల 15 మందిపై అభియోగపత్రం దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.కశ్మీర్​లో ఎన్​కౌంటర్​...

కశ్మీర్​లోని బుద్గామ్​​ గత 12 గంటలుగా జరుగుతున్న ఎన్​కౌంటర్​లో.. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.వెనక్కి తగ్గాల్సిందే...

భారత్​-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కోర్​ కమాండర్ల స్థాయిలో ఆరోసారి చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల మధ్య కుదిరిన ఐదు సూత్రాల ఒప్పందం అమలుపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ట్రంప్​ బయపడ్డాడు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్​ భయపడ్డారని ఆరోపించారు. సంక్షోభంలో దేశాన్ని కాపాడాల్సింది పోయి.. నాయకత్వంలో విఫలమయ్యారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.భారీ నష్టాల్లో...

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 410 పాయింట్లకుపైగా కోల్పోయి 37,617 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లకుపైగా నష్టంతో 11,090 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.వారికి 20 ఏళ్ల శిక్ష...!

డ్రగ్స్​ కేసులో నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ బెయిల్​ పిటిషన్​ విచారణను గురువారానికి వాయిదా వేసింది సిటీ సివిల్​ కోర్టు. ఇద్దరి అభ్యర్ధనను న్యాయస్థానం విరివిగా పరిశీలించింది. సీసీబీ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన రిట్​ పిటిషన్​ను పరిగణనలోకి తీసుకుని రాగిణి, సంజన బెయిల్​ పిటిషన్​ విచారణ వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.