ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : Jul 2, 2021, 10:55 AM IST

  • దేశంలో కొత్త కరోనా కేసులు..

దేశంలో కొత్తగా 46,617 కరోనా కేసులు నమోదయ్యాయి. 59,384 మంది కోలుకోగా 853 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా గురువారం 42,64,123 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సిటీలో హైటెక్​ వ్యభిచారం..

నగరంలో హై‘టెక్‌’ వ్యభిచారం నడుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా దందా నడిపిస్తున్నారు. ‘యాప్‌’ల ద్వారా వలపు వల విసురుతూ చీకటి దందా కొనసాగిస్తున్నారు. విదేశాల నుంచి మహిళలను తీసుకొచ్చి ‘డిమాండ్‌’ను సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పిల్లల్లో మూడో ముప్పు తక్కువే

మూడో దశ కరోనా ముప్పు(Corona Third Wave) భారత్​లో తక్కువగా ఉంటుందని ఏషియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పిల్లల్లో థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలుడిపైకి దూసుకెళ్లిన కారు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని... ప్రేమావతిపేటలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్... ఇంటి ముందు కూర్చున్న బాలుడిని ఢీకొట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సైబరాబాద్ పోలీసుల వ్యవహారం వైరల్

సైబరాబాద్‌ పోలీసుల వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతోంది. నిన్నటికి నిన్న ఇన్‌స్పెక్టర్‌ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ అదే స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ రాసిన లేఖ వైరల్‌ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకాతో తలెత్తే రక్తపు గడ్డలకు చికిత్స

కరోనా టీకా తీసుకున్న కొందరిలో ఏర్పడుతున్న రక్తపు గడ్డలకు సరికొత్త చికిత్సను కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యాంటీ క్లాంటింగ్​ మందులు, ఐవీఐజీ ఇవ్వడం ద్వారా నయం చేయొచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పుల్వామాలో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ జవాన్​ వీరమరణం పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'డెల్టాపై సింగిల్​ డోస్భేష్​'

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న డెల్టా వేరియంట్​పై తమ సింగిల్​ డోస్​ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని జాన్సన్​ అండ్​ జాన్సన్​ ప్రకటించింది. డెల్టా వేరియంట్​ వ్యతిరేక యాంటీబాడీలు ఎనిమిది నెలలపాటు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఎలా నవ్వగలుగుతున్నావు బుమ్రా'?

సామాజిక మాధ్యమాల వేదికగా టీమ్ఇండియా పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాను అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇన్​స్టాతో పాటు ట్విట్టర్​లో తన భార్య సంజనా ఫొటోను పెట్టిన బుమ్రాను.. 'ఇందుకు మీకు బాధగా లేదా'? అంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దర్శకధీరుడికి చేదు అనుభవం

ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఎయిర్​పోర్ట్​లో చేదు అనుభవం ఎదురైంది. లుఫ్తాన్సా విమానంలో దిల్లీకి చేరుకున్న జక్కన్నకు అక్కడి పరిస్థితులు నచ్చలేదట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసిన రాజమౌళి.. దిల్లీ ఎయిర్​పోర్ట్​ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.