కీలకాంశాలపై చర్చ..
ఇవాళ ఐదు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటి కానుంది. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలుతో పాటు వీటిపై చర్చ జరగనుంది.
ఆదమరిస్తే.. ఆగమాగమే!
కరోనా ఇళ్లకు ఇళ్లనే చుట్టేస్తోంది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జియాగూడలో అసలేం జరుగుతుంది?
మార్గదర్శకాలు ఇవే!
రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
మార్గం సుగమం.
రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అది గరిష్ఠంగా మూడు శాతంగా ఉండగా దానిని ఐదు శాతానికి పెంచుతున్నట్టు ఆదివారం కేంద్రం ప్రకటించింది. దానివల్ల రాష్ట్రం ఎంత రుణం తీసుకోవచ్చంటే!
157 మరణాలు, 5242 కేసులు
దేశం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 157 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా 5242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ ఎంతమందికి సోకిందో తెలుసా?
అదనపు ఛార్జీ..
వాహనాల ఫాస్టాగ్ నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేకుండా ఆ మార్గంలోకి వాహనం వెళ్లినా, ఫాస్టాగ్ పనిచేయకున్నా రెండింతలు అదనంగా రుసుము వసూలు చేయనున్నారు. ఎందుకు ఇలా?
క్వారంటైన్ 'రాణి'గా
15 రోజులు క్వారంటైన్లో ఉండాలంటేనే ఇబ్బంది. అలాంటిది ఓ మహిళ రెండు ఖండాల్లో 3 నెలల వ్యవధిలో నాలుగు సార్లు నిర్బంధంలో గడపి బయటకు వచ్చింది. ఎవరు ఆమె?
కొంటే అంత.. తయారు చేస్తే ఇంత
స్వాబ్‌ల కొరత సవాలును భారత్ కేవలం 10 రోజుల్లోనే అధిగమించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఒక్కో స్వాబ్ ధర రూ.17 కాగా.. మన దేశంలో తయారుచేసిన స్వాబ్ కేవలం రూ.1.7కే లభ్యమవుతోంది. ఎలా అంటే!
వచ్చే నెల నుంచి..
జూన్ 6 నుంచి దేశవాళీ క్రికెట్ టోర్నీలను ప్రారంభించనున్నట్లు తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆటగాళ్లంతా కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే..
ప్రియమైన వ్యక్తి ?
ఇంట్లోనే హెయిర్‌కట్ చేసిన తన ప్రియమైన వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ధన్యవాదాలు తెలిపింది బాలీవుడ్ నటి ఆలియా భట్. ఇంతకీ ఎవరు ఆ ప్రియమైన వ్యక్తి?