- " class="align-text-top noRightClick twitterSection" data="">
- సీఎం సమీక్ష
పల్లెలు, పట్టణాలు మరింత అభివృద్ధి చేసే దిశగా సర్కార్ కార్యాచరణ ముమ్మరం చేసింది. పల్లెప్రగతి, పట్టణప్రగతితో ఊర్లు బాగుచేయాలని సంకల్పించిన సర్కార్ అందుకు తగ్గ కార్యాచరణపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 10 రోజుల పాటు పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఫంక్షన్ హాల్ కట్టిస్తాం
హైదరాబాద్ పీవీ మార్గ్ అంబేడ్కర్ నగర్‌లో ప్రభుత్వం నిర్మించిన 330 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్ల పక్కనే దవాఖానా, ఫంక్షన్ హాల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని విమర్శించారు. ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- నేనేమన్నా బిచ్చగాన్నా?
ఇద్దరు మిత్రులు పునుగులు తింటుండగా.. అక్కడి వచ్చిన ఓ పదేళ్ల బాలుడికి వారు ఓ పునుగు ఇచ్చాడు. నేనేమైనా అడుక్కునే వాడినా అంటూ పదేళ్ల బాలుడు వారితో గొడవకు దిగాడు. కత్తి తీసుకుని వచ్చి ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని పొడిచి .. అక్కణ్నుంచి పారిపోయాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- చీకట్లోకి మానవాళి
సమాజం నుంచి మాదక ద్రవ్యాలను దూరం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల మానవాళి చీకటి మయం అవుతుందన్నారు. శనివారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా.. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ట్విట్టర్‌ను వివరణ అడుగుతాం
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ ఖాతాలను నిలిపివేయటంపై ట్విట్టర్‌ను వివరణ కోరనున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. భారత్‌లో సేవలకు ఎలాంటి నిబంధనలు, విధానాలు పాటిస్తున్నారో తెలియజేయాలని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- డెల్టా రకం వేగంగా వ్యాప్తి
ప్రస్తుతం ప్రపంచాన్ని బయపెడుతోన్న డెల్టా వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూహెచ్ఓ. వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం ద్వారా కొత్త వేరియంట్లు ఉత్పన్నం కాకుండా నిర్మూలించవచ్చని సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అంబానీ విలువైన ఆస్తులు ఇవే!
విలువైన ఆస్తులు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సొంతం. ప్రపంచంలోనే గొప్పవిగా చెప్పుకునే వస్తువులు ఆయన దగ్గర కోకొల్లలు. అయితే.. వాటన్నింటి కన్నా ఓ నాలుగు ఆస్తులు మాత్రం ముకేశ్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- 20 సెకన్ల ఆలస్యం
పరుగుల వీరుడు, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మో ఫరా(Mo Farah).. ఈసారి ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. బ్రిటీష్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఇతడు.. ఒలింపిక్స్‌కు కావాల్సిన అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో పోటీలకు అర్హత సాధించలేకపోయాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆయన మాటలు బాధించాయి
'మా' ఎలక్షన్స్(MAA Elections) పోరు రసవత్తరంగా మారింది. మాటల యుద్ధం కూడా మొదలైపోయింది. ఈ క్రమంలోనే 'మా' మసకబారిపోయింది' అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అంటూనే తిరిగి కౌంటర్ వేశారు నటుడు నరేశ్. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.