- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఏరువాక పున్నమి...
భద్రాద్రి రాముడి సన్నిధిలో ఏరువాక పున్నమి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. లక్ష్మణసమేతసీతారాములకు అర్చకులు వైభవంగా అభిషేకం జరిపారు. గంధోదకములు, హరిద్రా చూర్ణములు, సమస్త నదీ జలాలతో తిరుమంజనం నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- యాజమాన్యాల సన్నద్ధం...
జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కరోనా భయం.. మరోవైపు తల్లిదండ్రుల్లో ఆందోళనల మధ్య స్కూళ్లు తెరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?...
పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆ పరిశ్రమకు ఊతమివ్వాలి...
ప్రధాని నరేంద్ర మోదీ 'టాయ్‌కాథోన్-2021(Toycathon-2021)' సదస్సులో వర్చువల్‌గా హాజరయ్యారు. బొమ్మల తయారీ పరిశ్రమలో భారత వాటాను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- సూరత్ కోర్టుకు రాహుల్...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019 నాటి పరువునష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తుది వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- భారత్ వెళ్లిపోండి!...
ఫిలిప్పీన్స్ పౌరులంతా కరోనా టీకా వేయించుకొనేందుకు ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని ప్రజలంతా భారత్కో, అమెరికాకో మరో చోటుకో వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- వీసాదారులకు శుభవార్త!...
హెచ్1బీ వీసా కోసం 2020 అక్టోబర్1 తర్వాత దరఖాస్తు చేసుకున్న గెస్ట్ వర్కర్స్కు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఆ అప్లికేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురి కాగా.. వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన చమురు ధరలు...
దేశవ్యాప్తంగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగి రూ. 97.76కు, డీజిల్‌పై 8 పైసలు పెంచటం వల్ల రూ. 88.30కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.89గా నమోదైంది. ఇక లీటర్ డీజిల్ ధర 95.79 వద్దకు చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ప్రతిసారి కొత్త విజేతనే...
డబ్ల్యూటీసీ తొలి ఛాంపియన్‌గా న్యూజిలాండ్ అవతరించింది. అయితే గత ఎనిమిదేళ్లలో జరిగిన ఏడు ఐసీసీ టోర్నీల్లో ఏడు జట్లు విజేతగా నిలవడం విశేషం. ఇంతకీ ఆ టోర్నీలు ఏంటి? అందులో గెలిచింది ఎవరు? పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆ ఫొటోల వల్లే హీరోగా ఛాన్స్...
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు(Hrithik Roshan) తొలిసారి సినిమా ఛాన్స్.. తన వల్లే వచ్చిందని అన్నారు ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ. ఈ విషయం హృతిక్యే స్వయంగా తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. త్వరలోనే తన కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.