- విధుల్లో చేరండి..
జూనియర్ వైద్యుల సమ్మె పిలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3,762 కేసులు..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సాయంత్రం వరకు 91,048 మందికి పరీక్షలు జరపగా.. 3,762 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పటిష్ఠంగా లాక్‌డౌన్..
లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తున్నారు. సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చేవాళ్లు సైతం కొంత దారిలోకి వస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తుండటం వల్ల జంకుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు..
రాష్ట్రంలో ప్రతి 10 మందిలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కొవిడ్ కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.1 శాతంగా ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హనుమాన్ జన్మస్థలంపై చర్చ..
హనుమాన్ జన్మస్థలంపై తిరుపతి సంస్కృత విద్యా పీఠంలో గురువారం చర్చ జరగనుంది. పంపా - కిష్కింధ ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి పాల్గొంటున్నారు. తితిదే తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొననున్నారు. బహిరంగ చర్చకు రావాలని తీర్థ క్షేత్ర ట్రస్టు తితిదేకు గతంలో సవాలు విసిరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు లాన్సెట్ సూచనలు..
భారత్‌లో కరోనాను సమర్థంగా కట్టడి చేసేందుకు లాన్సెట్ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. కరోనా మరణాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించింది. రాష్ట్రాల మధ్య అసమానతలు తగ్గించేలా.. టీకా విధానంలో మార్పులు చేయాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిత్య పెళ్లికూతురు..
పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుత ఘట్టం. కాబోయే భర్తతో జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఊహించుకుంటారు అమ్మాయిలు. కానీ, కొందరు డబ్బు కోసం పెళ్లిని వాడుకుంటున్నారు. సరిగ్గా 21 ఏళ్లు కూడా లేని ఓ యువతి ఏకంగా 13 మందిని వివాహం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్రానికి బాబా రాందేవ్ సవాల్..
యోగా గురువు బాబా రాందేవ్ మరో వివాదానికి తెరతీశారు. ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఆయన సవాల్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీనియర్ల సలహాలతోనే..
సీనియర్ల సలహాలతో ఇంగ్లాండ్ పర్యటనలో విజయవంతం కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్. పిచ్, వాతావరణ పరిస్థితులు, డ్యూక్స్ బంతులతో బౌలింగ్ వంటి విషయాలలో తనకు సహచరుల అనుభవాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్జీఎమ్ స్టూడియో అమెజాన్ సొంతం..
ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ఎమ్జీఎమ్ను 8.45 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ అంగీకరించింది. ఈ ఒప్పందంతో ఆ స్టూడియోకు సంబంధించిన 4 వేల చిత్రాలతో పాటు 17 వేల టీవీ షోలు ప్రసారం చేసే అవకాశం అమెజాన్‌కు లభించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.