- కరోనా విజృంభణ
భారత్‌లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 37,148 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 28 వేలు దాటాయి. ఒక్కరోజే 587 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అందరికీ దక్కదు!
హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చిన బాధితులు సుమారు 70 శాతం ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం అందిస్తోన్న ఐసోలేషన్ కిట్లలో క్షేత్రస్థాయి రాజకీయాలు బాధితుల పాలిట శాపంగా మారుతున్నాయి. హోమ్ ఐసోలేషన్ బాధితులకు ఇవ్వాల్సిన కిట్లను స్థానిక నేతలు పంచుతున్నారు. వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రంపై రాహుల్ గుస్సా..
కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏయే నెలలో కేంద్రం ఏమి చేసిందో ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ నిర్ధారణకు ఆవైపే మొగ్గు!
ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్ వంటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సదుపాయాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో లేకపోవడంతో నేరుగా సీటీ స్కాన్‌తోనే కొవిడ్‌ను నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నమూనా సేకరణ కేంద్రాలకు పంపించి పరీక్షలు చేయిద్దామనుకుంటే.. ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు వెంటనే తేల్చే సీటీ స్కాన్‌వైపు మొగ్గుచూపుతున్నాయి. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అమ్మా నీకేం కాదు..
కిటికీ ఎక్కి.. 'అమ్మా నీకు నేనున్నా' అని ధైర్యం చెప్పడం తప్ప గుండెలకు హత్తుకుని తల్లిని ఓదార్చలేని పరిస్థితి తనయుడిది. కడసారి కన్న బిడ్డను ముద్దాడలేని దీనస్థితి ఆ తల్లిది. పాలస్తీనాకు చెందిన ఆ తల్లి-కుమారుడి వేదనకు అద్దం పట్టే ఓ ఫొటోను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి సామాజికమాధ్యమాల్లో పంచుకున్నారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తప్పిన ప్రమాదం..
వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. కారును తప్పించబోయి... హెచ్‌పీసీఎల్ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పింది. పొలంలో బోల్తాపడిన ట్యాంకర్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీకవుతోంది. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఇద్దరేనా..?
ఆంధ్రప్రదేశ్ కేబినేట్‌లో ఖాళీ అయిన మంత్రుల స్థానాల భర్తీకి దాదాపు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గంలోకి కొత్తగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజుల చేరిక ఖాయమైంది. బుధవారం రాజ్‌భవన్‌లో వీరిద్దరి చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- సూచీల జోరు..
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో 37,824 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 4 నెలల తర్వాత ఈ స్థాయికి చేరింది. నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల వృద్ధితో 11,129 వద్ద ట్రేడవుతోంది. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ హీరోలా రణ్వీర్..
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సరికొత్త హెయిర్ స్టయిల్‌తో దర్శనమిచ్చాడు. తన సతీమణి, నటి దీపికా పదుకొనే ఈ కొత్త లుక్‌లో రెడీ చేసినట్లు చెప్పుకొచ్చాడు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- విశ్వనాథన్ రెడీ..
లెజెండ్స్ ఆఫ్ చెస్ పోటీల్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బరిలో దిగనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో రష్యాకు చెందిన పీటర్ స్విద్లెర్తో ఆనంద్ తలపడనున్నారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీచూడండి: టాప్‌టెన్ న్యూస్ @9am