ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - TOP NEWS@6AM

TOP NEWS@6AM
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Oct 28, 2021, 6:07 AM IST

Updated : Oct 28, 2021, 9:59 PM IST

21:49 October 28

TOP NEWS @10PM

తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర (Ys Sharmila Padayatra) 100 కిలోమీటర్లకు చేరుకుంది. ఇబ్రహీంపట్నం చేరుకోవడం వల్ల ఈ ఫీట్​ అందుకున్నారు. ఇందుకు చిహ్నంగా తల్లి విజయమ్మతో కలిసి పావురాలను ఎగురవేశారు.

  • రాష్ట్రాలకు  జీఎస్టీ పరిహారం

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రూ.44 వేల కోట్లు విడుదల చేసింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ సెక్యురిటీల జారీ ద్వారా వీటిని సేకరించిన కేంద్రం.. రాష్ట్రాల్లో ప్రజావసరాలు, ఆరోగ్య వసతులకు ఈ మొత్తం ఉపకరిస్తుందని పేర్కొంది.

  • 'అప్పటి వరకు తక్కువ తినండి'

తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉత్తర కొరియా(North Korea Food Crisis) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్​ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశ ప్రజలను 2025 వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.

  • ఐపీఎల్​ మెగా వేలం.. కొత్త నిబంధనలు ఇవే!

ఐపీఎల్ 2022 వేలానికి(IPL 2022 Auction) సంబంధించి కొత్త నిబంధనలు జారీ చేసింది ఐపీఎల్ పాలక మండలి. ప్రస్తుతం ఉన్న 8 జట్లు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలని తెలిపింది.

  • రజనీకాంత్​కు స్వల్ప అనారోగ్యం

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు.

20:59 October 28

TOP NEWS @9PM

  • పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్​..!

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై ఫైర్ అయ్యారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చి ఇప్పుడు వారిని మోసం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.

  • రాజకీయాలు ఆపాదించొద్దు..

ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ycp mp vijaya sai reddy) చేసిన వ్యాఖ్యలను నల్గొండ ఎస్పీ రంగనాథ్​(nalgonda sp ranganath)​ ఖండించారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటాననటం నిరాధారమని స్పష్టం చేశారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దని సూచించారు. గంజాయి నివారణకు అందరూ కలిసి పనిచేయాలని ఎస్పీ రంగనాథ్‌ కోరారు.

  • 'రేషన్​ తరహాలో సబ్సిడీపై గడ్డి'

ఉత్తరాఖండ్​ కేబినెట్ మంత్రి ధన్​ సింగ్ రావత్​.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, మరోసారి చిక్కుల్లో పడ్డారు. తమ పశువుల కోసం అవసరమైన గడ్డి కోసం దుకాణాలు తెరుస్తామని, ప్రతి మహిళకు 20 కిలోల గడ్డి ప్యాక్​లను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలను నెటిజన్లు తెగ ట్రోల్స్​ చేస్తున్నారు.

  • 'భారత్​-పాక్​ మ్యాచ్​.. అలా జరిగితేనే ఫుల్​ మజా'

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాకిస్థాన్​ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలుత భారత్​ను(IND vs PAK T20) ఓడించిన పాక్.. న్యూజిలాండ్​పైనా(PAK vs NZ T20) విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన పాక్​ దిగ్గజం సక్లైన్ ముస్తాక్(Saqlain Mushtaq Coach).. ఫైనల్​లో భారత్, పాక్​ తలపడాలని ఆశించారు.

  • 'మరో రెండు నెలల్లో 'లైగర్' చిత్రీకరణ పూర్తి'

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్(Liger Update). పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా చిత్రీకరణపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు పూరీ. మరో రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.

19:53 October 28

TOP NEWS @8PM

  • ఫిర్యాదులపై ఈసీ ఆరా..!

హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పరిశీలకులకు స్పష్టం చేసింది. పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ దిల్లీ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది.

  • ఆ రాష్ట్రంలో 30 వేలు దాటిన కరోనా మరణాలు

కేరళలో కొత్తగా 7,738 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. ఒక్కరోజే ఆ రాష్ట్రంలో వైరస్ కారణంగా 708 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 30,685కు చేరింది.

  • 26 అంతస్తుల ఎత్తులో ఉండగా తాడును కోసేసి

ఇద్దరు పెయింటర్లు ఎత్తైన బహుళ అంతస్తుల బిల్డింగ్‌కు ఓ చోట పెయింట్‌ వేస్తుండగా ఒక మహిళ తన ఇంటి మీదుగా వెళ్తున్న సపోర్ట్‌ తాడును కోసేసింది. దీంతో ఇద్దరు 26వ అంతస్తు పైనుంచి ప్రమాదకరంగా గాల్లో వేలాడసాగారు. సహాయం చేయాలని అరవగా చూసిన ఓ జంట.. తమ బాల్కనీలోకి వారిని అనుమతించింది. అలా ప్రాణాలు కాపాడుకున్నారు. 

  • ఆ బోర్డు సభ్యుడిగా తప్పుకున్న గంగూలీ!

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. మోహన్ బగన్ బోర్డు సభ్యుడిగా తప్పుకున్నారు. ఈ మేరకు బోర్డుకు లేఖ కూడా పంపారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

  • మా ఇద్దరికీ అస్సలు పడదు

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​, తాను(raveena tandon and salman khan) ఎప్పుడూ తగాదా పడేవారని గతాన్ని గుర్తుచేసుకుంది నటి రవీనా టాండన్​. తామిద్దరిదీ చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పింది. దీంతో పాటే తన ఫేవరెట్​ కోస్టార్స్​ పేర్లను వెల్లడించింది.

18:52 October 28

TOP NEWS @7PM

  • ఫ్లెక్సీల వివాదం

తెరాస ప్లీనరీ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జీహెచ్​ఎంసీ జరిమానాలు విధించింది. మంత్రి తలసాని, మేయర్‌, ఎమ్మెల్యే దానంకు జరిమానాలు వేసింది. రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించింది. 

  • కేంద్రం కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి(Covid-19 India) విధించిన ఆంక్షలను(Covid 19 Containment) నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్​ భల్లా సమావేశం నిర్వహించారు.

  • పసిడికి భారీగా పెరిగిన డిమాండ్​

దేశంలో బంగారానికి విపరీతంగా డిమాండ్​ పెరిగినట్లు ప్రపంచ పసిడి మండలి(డబ్ల్యూజీసీ) నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుతో పసిడి కొనుగోళ్లు పెరిగి.. సాధారణ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించింది.

  • చర్మం ఒలిచి చిత్రహింసలు

తిరుగుబాటుతో దేశాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్న మయన్మార్​ సైన్యం.. అరాచకాలు సృష్టిస్తోంది. ప్రజల్ని కారణాలు లేకుండానే చిత్రహింసలకు గురిచేస్తోంది. దాదాపు దేశమంతటా ఒకే పద్ధతిలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు సైనికులు. కొంతమంది ప్రజల్ని రహస్యంగా విచారించగా ఈ విషయాలు బయటపడ్డాయి.

  • రానాకు జోడీ ఈ ముద్దుగుమ్మే

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లానాయక్‌'. ఈ చిత్రంలో రానాకు జోడీగా మలయాళీ నటి సంయుక్త మేనన్‌ను ఖరారు చేసినట్లు తెలిపింది చిత్రబృందం.

17:57 October 28

TOP NEWS @6PM

  • మావి కావా ఓట్లు..?

ఓటుకు నోటివ్వడం ఎన్నికల్లో వింటూనే ఉంటాం. కొన్నిచోట్ల పట్టుబడిన సంఘటనలూ చూశాం. కానీ బహిరంగంగా రోడ్డెక్కి.. 'మాకెందుకు పైసలివ్వరు? మావి ఓట్లు కావా? ఓటుకు నోటివ్వాల్సిందే.. లేకపోతే అసలు ఓటే వెయ్యం..' అని ఆందోళనలకు దిగడం హుజూరాబాద్ ప్రజలకే దక్కిందేమో? అసలు ఈ విధానం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకూ కరెక్టు? అసలిలా ధర్నాలు చేయడానికి కారణమేంటి?

  • ఇటలీకి మోదీ

జీ20 సదస్సు (G20 Summit 2021) కోసం ఇటలీ పర్యటనకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటలీ ప్రధానితో చర్చలు జరపనున్నారు. క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్​ను మోదీ (Modi Pope Francis) కలవనున్నట్లు తెలుస్తోంది.

  • కరోనా విజృంభణ- ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

రష్యాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి రికార్డుస్థాయిలో 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం వల్ల ఆంక్షలు కఠినతరం చేశారు. కరోనా నియంత్రణకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వారంపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్‌ హాలిడేను ప్రకటించారు.

  • ఇక ఆడలేను..!

దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్(Chris Morris News).. తమ జాతీయ జట్టుకు ​గుడ్​ బై చెప్పే సమయం వచ్చేసిందని అన్నాడు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేనని తెలిపాడు. తమ దేశ క్రికెట్​ బోర్డుతో దాదాపు ఏడాది నుంచి సంబంధాలు లేవని చెప్పాడు.

  • ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ మంజూరు

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ (Cruise Drugs Case) కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు (Aryan Khan) బెయిల్‌ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. 

16:47 October 28

TOP NEWS @5PM

  • 'ఒకే రాష్ట్రంగా కలిసుందాం'

"రెండు తెలుగు రాష్ట్రాలనూ కలిపేద్దాం.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి" అని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఏపీ మంత్రి పేర్నినాని సూచించారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా ఏపీలో పోటీ చేయొచ్చన్నారు. ఏపీ, తెలంగాణ ఒకే రాష్ట్రంగా ఉండాలని గతంలోనే ఏపీ సీఎం జగన్(cm jagan) సూచించారని మంత్రి తెలిపారు.

  • నెత్తురోడిన హైవే..

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

  • చనిపోయిన వారికి వివాహం

కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లికాకుండా చనిపోయిన తమవారికి వివాహం జరుపుతున్నారు. అది కూడా సాధారణంగా పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోని రీతిలో! అసలు చనిపోయిన వారికి ఎలా వివాహం జరిపిస్తారు? అసలు ఎందుకు ఇదంతా?

  • ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌

ఎన్నో ఏళ్ల కింద అంతరించిపోయిన డైనోసర్​ మళ్లీ ప్రత్యక్షమైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (Dinosaur at united nations) జరుగుతుండగా.. ఓ డైనోసర్​ వచ్చింది. అది చూసి ప్రపంచ నేతలు, పలు దేశాల ప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. పోడియంపైకి (Dinosaur at un meeting) వెళ్లి అది​ ప్రజలను హెచ్చరించింది. వినాశనాన్ని కొనితెచ్చుకోకుండా.. జాతిని కాపాడుకోండి అని చెప్పి సెలవిచ్చింది. అసలు డైనోసర్లు రావడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇది చూసేయండి.

  • 'ఆర్​ఆర్​ఆర్​' నుంచి బిగ్​ సర్​ప్రైజ్​ ఇదేనా?

అక్టోబర్​ 29న ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రబృందం(Rajamouli RRR movie) ​. ఇప్పుడా బిగ్​ అప్డేట్​ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే?

15:16 October 28

TOP NEWS @4PM

  • మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

మాజీ మిస్‌ తెలంగాణ ఆత్మహత్యకు యత్నించింది(suicide attempt case). ఉరి బిగించుకుని బలవర్మణం చెందేందుకు పూనుకుంది. ఇంతలోనే.. పోలీసులు వచ్చి ఆమెను ప్రాణాలతో కాపాడారు. ఆస్పత్రికి తరలించటంతో ఆ యువతి ఇప్పుడు క్షేమంగా ఉంది. అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోలీసులకు ఎలా తెలిసింది..? అసలు అక్కడ జరిగిన సంగతేంటో తెలుసుకుందాం రండి..

  • ఏసీబీ అధికారులపై పోలీసుల దాడి

ఏసీబీ అధికారులపై పోలీసులు దాడి (Attack on Police today) చేశారు. అవినీతి కేసులో ఓ పోలీసుపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇరువర్గాల ఘర్షణతో పోలీస్ స్టేషన్ రణరంగాన్ని తలపించింది.

  • కుప్పుకూలిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​లో భారీ​ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1159 పాయింట్లు కోల్పోయి.. 60 వేల దిగువన స్థిరపడింది. నిఫ్టీ 18 మార్క్​ను కోల్పోయింది.

  • 'భారత్​-న్యూజిలాండ్​ మ్యాచ్​ను అలా చూడొద్దు'

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం(అక్టోబర్ 31) మ్యాచ్(IND vs NZ T20 Match)​ జరగనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్​ను క్వార్టర్​ ఫైనల్లా భావించొద్దని పేర్కొన్నాడు. 

  • సామ్ అంత పనిచేసిందా?

ఇప్పటికే నాగచైతన్యతో సమంత(chaysam divorce) విడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న అక్కినేని అభిమానులకు.. మరోసారి షాక్​ ఇచ్చింది సామ్​. దీంతో ఫ్యాన్స్​ చాలా బాధపడుతున్నారట! ఇంతకీ ఆమె​ ఏం చేసిందంటే?

14:43 October 28

TOP NEWS @3PM

  • రేపటి నుంచి ఆందోళన చేస్తాం..

హైదరాబాద్‌ నాంపల్లిలో బండి సంజయ్‌ రైతు దీక్ష (bandi sanjay rythu deeksha) ముగిసింది. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు బండి సంజయ్ రైతు దీక్ష కొనసాగింది.

  • ట్రాన్స్​ఉమన్​తో యువకుడి పెళ్లి

అమె ఓ ట్రాన్స్​ఉమన్​. తనకు ఇష్టమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడు. కానీ ఆ ప్రేమను వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమను గెలిపించుకునేందుకు వారు పెళ్లి చేసుకున్నారు. ఇదీ తమిళనాడులోని రియా-మనో కథ.

  • మార్కెట్లోకి పల్సర్​ 250

బజాజ్ సంస్థకు చెందిన మరో బైక్​ మార్కెట్​లోకి విడుదలైంది. దీపావళికి ముందే పల్సర్​ 250 సీసీ బైక్​ను గురువారం ఆవిష్కరించింది బజాజ్​.

  • డికాక్​ క్షమాపణలు

దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​, బ్యాటర్​ క్వింటన్​ డికాక్.. వెస్టిండీస్​తో మ్యాచ్​ నుంచి తాను ఎందుకు తప్పుకున్నాడో క్లారిటీ ఇచ్చాడు​. తాను అలా చేసినందుకు సహ ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. 

  • ఈ భామ గుర్తుందా?

 భారత సంతతికి చెందిన బ్రిటీష్ గాయని, వ్యాఖ్యాత.. సోఫీ చౌదరి అందాలతో కుర్రాళ్ల మదిలో అలజడి రేపుతోంది. తెలుగులో మహేశ్​బాబు 'వన్: నేనొక్కడినే' సినిమాలోని 'లండన్ బాబు' పాటలో కనిపించింది ఈ భామనే.

13:56 October 28

TOP NEWS @2PM

  • ముగ్గురు యువతుల అదృశ్యం

జగిత్యాల జిల్లా ఉప్పరిపేటలో నిన్న ముగ్గురు యువతుల అదృశ్యమయ్యారు. ధర్మసముద్రం చెరువులో ఇద్దరి యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

  • రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

హరియాణాలో దారుణం జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఘటన సమయంలో వీరంతా ఆటో కోసం ఎదురుచూస్తూ డివైడర్​పై కూర్చున్నారని పోలీసులు తెలిపారు.

  • స్నేహమే భారత్​కు ప్రధానం

ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో (Asean India Summit) వర్చువల్​గా పాల్గొన్నారు. పరస్పర సహకారంతోనే ఆసియాన్​ దేశాలు-భారత్​ మధ్య బంధం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

  • జడేజా అసంతృప్తి!

ఓపెనర్లు విఫలమైన వేళ టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమ్​ఇండియా. ఓటమి అనంతరం కోహ్లీ (Virat Kohli News) చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయడని చెప్పాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja News).

  • నొప్పి భరిస్తూనే నటిస్తున్నారు..!

కొందరు సినిమా తారల జీవితం బయటకు కనిపించినంత అందంగా ఉండదు! అందుకు ఉదాహరణే ఈ స్టోరీ. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? వాళ్లకున్న సమస్యేంటి? తదితర విషయాలు మీకోసం.

12:49 October 28

TOP NEWS @1PM

  • సంజయ్​కి మంత్రి నిరంజన్​ రెడ్డి సవాల్​..

వరి-ఉరి ప్రభుత్వ వైఖరితో బండి సంజయ్ చేస్తున్న దీక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిగింజా కొనేవరకు భాజపా నేతలు దీక్ష చేయండంటూ సవాల్​ విసిరారు.

  • తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట..

పరిగి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తమపేరు మీద వారసత్వ భూమిని నమోదు చేయలేదని ఆరోపిస్తూ పెట్రోలు పోసుకుని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

  • నీట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్..

నీట్ ఫలితాలు వెల్లడించేందుకు (NEET result 2021) ఎన్​టీఏకు అనుమతులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇద్దరు అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు తారుమారైన నేపథ్యంలో ఫలితాలు నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది అభ్యర్థుల ఫలితాలను ఆపలేమని పేర్కొంది.

  • లోయలో పడ్డ మినీ బస్సు- 9మంది మృతి

జమ్ముకశ్మీర్​లో దోడాలో ఓ మినీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 9మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

  • సల్మాన్​ఖాన్​పై వెబ్ సిరీస్..

కండలవీరుడు సల్మాన్​ఖాన్(salman khan web series) లైఫ్​స్టోరీతో ఓ డాక్యుమెంటరీ తీస్తున్నారు. దీనికి ఆలియా(alia bhatt salman khan).. యాంకర్​గా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నారు.

11:58 October 28

TOP NEWS @12PM

  • జోక్యం చేసుకోలేం: హైకోర్టు

దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. దిశ కమిషన్ విచారణ తీరుపై డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం  కొట్టివేసింది.  సిర్పూర్కర్‌ కమిషన్ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 

  • లోయలో పడ్డ మినీ బస్సు

జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. తత్రి నుంచి తోడాకు వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

  • పెరిగిన బంగారం ధర

బంగారం ధర (Gold price Today) పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.211 మేర పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

  • మేటి క్రికెటర్లు.. వెరైటీ కెరీర్స్

వ్యాఖ్యాత బ్రెట్‌లీ.. బాక్సర్‌ ఫ్లింటాఫ్‌.. గిటారిస్ట్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌.. ట్రక్‌ డ్రైవర్‌ క్రిస్‌ కెయిన్స్‌.. ఏంటిదంతా? క్రికెటర్ల ముందు వచ్చి చేరిన ఆ కొత్త కెరీర్‌లేంటి అంటారా? ప్రస్తుతం ఆ జగమెరిగిన క్రికెటర్లు చేస్తున్నది అదే.

  • వారి కాంబో మరోసారి

టాలీవుడ్​ సక్సెస్​ కాంబినేషన్లలో ఒకటైన బన్నీ-త్రివిక్రమ్(allu arjun trivikram movies).. మరోసారి కలిసి పనిచేయనున్నారు. అయితే అది సినిమానా? లేదా మరేదైనా ప్రాజెక్టు అనేది తెలియాల్సి ఉంది.

10:44 October 28

TOP NEWS @11AM

  • పోరాడి ఓడిపోయింది

ఓ మహిళ కాన్పుకోసం వచ్చి.. పది రోజులు కోమాలోకి వెళ్లి.. చివరికి ప్రాణం కోల్పోయిన ఘటన భద్రాద్రిలో చోటు చేసుకుంది. శస్త్రచికిత్స తర్వాత బాలింత ఆరోగ్యం విషమించింది. పది రోజులుగా బాధితురాలు అపస్మారక స్థితిలోనే ఉంది. బతుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు నిరాశే ఎదురైంది. పుట్టిన బాబు దక్కకపోవడం, బాలింతరాలు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

  • డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం

తాగిన మత్తులో అర్ధరాత్రి ఓ యువతి ఇంటికి వచ్చిన యువకుడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆమె అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు యువకుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్​ వట్టినాగులపల్లిలో చోటుచేసుకుంది.

  • సిర్పుర్కర్ కమిషన్ విచారణ

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణను వేగవంతం చేసింది. తాజాగా సీఐ నర్సింహా రెడ్డి, గచ్చిబౌలి అదనపు ఇన్​స్పెక్టర్ లాల్​మదర్​లను ప్రశ్నించింది. నిందితులు తమపై కాల్పుల జరపడం వల్లే ఎదురుకాల్పులు జరిపినట్లు సీఐ చెప్పగా.. తుపాకీ ఎలా లోడ్ చేస్తారని కమిషన్ అడిగింది.

  • ముంబయి డ్రగ్స్​ కేసు సాక్షి అరెస్ట్

ముంబయి డ్రగ్స్​ కేసులో సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని (Kiran Gosavi Latest News) పోలీసులు అరెస్ట్​ చేశారు. 2018లో నమోదైన ఓ చీటింగ్​ కేసులో గోసావి నిందితుడిగా ఉండటమే కారణమని పోలీసులు వెల్లడించారు.

  • పోర్న్​సైట్​లో పాఠాలు

పోర్నహబ్​ అంటే సహజంగా పొర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఇదే సైట్​లో ఓ టీచర్​ 'లెక్కలు' చెబుతున్నాడు. గణితశాస్త్రంపై తనకున్న పట్టును వీడియోల రూపంలో పోర్న్​సైట్​లో పెడుతున్నాడు. పోర్న్​సైట్​లో లెక్కలు ఎవరు చూస్తారు? అని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఆ వీడియోల ద్వారా ఆ మాస్టారు.. ఏడాదికి రూ.2కోట్లు సంపాదిస్తున్నాడు!

09:49 October 28

TOP NEWS @10AM

  • దళితబంధు పంపిణీ 

ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం(Dalit Bandhu Scheme in Telangana) ఫలితం లబ్ధిదారులకు అందింది. లబ్ధిదారులకు యూనిట్‌లను మంత్రి జగదీశ్‌ రెడ్డి పంపిణీ చేశారు. గ్రామంలోని 10 కుటుంబాలు వాహనాలను అందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబంధు పధకమని జగదీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఎంతో ముందుచూపుతో తీసుకొచ్చిన ఈ పథకం దేశానికే ఆదర్శవంతమైనదని మంత్రి కొనియాడారు.

  • కరోనా కేసులిలా..

దేశంలో రోజువారి కరోనా కేసులు సంఖ్య పెరుగుదల (Coronavirus update) కొనసాగుతోంది. కొత్తగా 16,156 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి (Covid cases in India) మరో 733 మంది ప్రాణాలు కోల్పోగా.. 17,095 మంది కోలుకున్నారు.

  • నష్టాల్లో స్టాక్​ మార్కెట్

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 250 పాయింట్లకుపైగా పతనమై.. 60,893 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 80 పాయింట్లకుపైగా తగ్గి 18,130 వద్ద కొనసాగుతోంది.

  • నేను ఫామ్​లో లేనా?

ఐపీఎల్​లో ఫామ్​లేమితో బాధపడిన ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్​ (David Warner News).. టీ20 ప్రపంచకప్​లోనూ (T20 World Cup 2021) బ్యాట్​ను ఝళింపించలేకపోతున్నాడు. అయితే తన ఫామ్​పై ఎలాంటి ఆందోళనలూ అవసరం లేదని అంటున్నాడు వార్నర్.

  • సినిమా ముచ్చట్లు

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యే వరుడు కావలెను(varudu kaavalenu release date), రొమాంటిక్(romantic movie review) చిత్ర మేకింగ్ వీడియోలు అంచనాల్ని పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.

08:42 October 28

TOP NEWS @9AM

  • నిజాలు వెలుగు చూడాల్సిందే!

ఈ ఏడాది పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు వెలుగులోకి వచ్చిన పెగసస్‌ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పెగసస్​ వ్యవహారం పట్ల కేంద్రం వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

  • విషమిచ్చి చంపారు..!

మెదక్ జిల్లా నర్సాపూర్​లో 200లకు పైగా కుక్కలకు(Street Dogs were Killed) విషమిచ్చి చంపి, వాటిని లక్ష్మీనారాయణస్వామి ఆలయ భూముల్లో పాతిపెట్టారన్న సమాచారంతో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో శునకాల కళేబరాలు బయటపడ్డాయి. ఆ శునకాలను ఎవరు చంపారు? ఎందుకు చంపారు?

  • సంక్షోభంలోకి దక్షిణాఫ్రికా క్రికెట్!

'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమానికి మద్దతుగా ఆటగాళ్లందరూ మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (South Africa Cricket News) హుకుం జారీ చేసింది. అది నచ్చని డికాక్ (Black Lives Matter De Kock) మ్యాచ్​ నుంచి తప్పుకొన్నాడు.

  • మళ్లీ పెరిగిన చమురు ధరలు

దేశంలో 'పెట్రో' బాదుడు కొనసాగుతోంది. మరోసారి ఇంధన ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) తెలిపాయి.

  • 'ప్రభాస్​తో అంటే నమ్మలేకపోయా'

'రొమాంటిక్'తో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న నటి కేతికశర్మ. సినిమా విడుదల సందర్భంగా తన గురించి, చిత్ర విశేషాలను వెల్లడించింది. ప్రభాస్​తో ఇంటర్వ్యూ అంటే నమ్మలేకపోయాను.

07:58 October 28

TOP NEWS@8AM

  • కిమ్స్‌ చేతికి సన్‌షైన్‌

న్​షైన్ హాస్పిటల్స్(Sunshine Hospitals)​లో మెజార్టీ వాటా(51.07%) కొనుగోలు చేయడానికి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్స్(Krishna Institute of Medical Sciences) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ఫలితంగా 9 నగరాల్లో 12 ఆసుపత్రులు, 3,666 వైద్య పడకలు, 1200 మంది వైద్యులు, 12,000 మంది ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థల్లో కిమ్స్‌ హాస్పిటల్స్‌కు స్థానం లభిస్తుంది.

  • పర్యావరణహిత బాణసంచా

మార్కెట్లోకి పర్యావరణహిత బాణసంచా వచ్చేసింది. దీపావళి సమయంలో పర్యావరణానికి హాని కలిగించే భారీ శబ్దాలు, పొగ, ఉద్గారాలు ఇకపై ఉండవు. పండుగకి వెలుగులు మాత్రమే పూసేలా.. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించకుండా తయారీదారులు తయారు చేశారు. మామూలు పటాకుల్లాగా వీటివల్ల అంత ఎక్కువ కాలుష్యం వెలువడదు. ఈ విత్తన టపాసులు (Seed Crackers) కొనుగోలుదారులను సైతం ఆకర్షిస్తున్నాయి.

  • విభజించి పాలించు

జలియన్​వాలాబాగ్​ ఉదంతం అనంతరం ప్రకటించిన పరిహారంలోనూ బ్రిటిష్​ ప్రభుత్వం 'విభజించి పాలించు' విధానాన్ని అమలు చేసింది. ఘటనలో ఒకే విధంగా గాయపడిన ఇద్దరికి వేరువేరు పరిహారాలు చెల్లించి వివక్ష చూపించింది.

  • ఇలా కూడా పెడతారా?

ABCDEF GHIJK Zuzu.. ఏంటిది అనుకుంటున్నారా? ఇది ఓ మనిషి పేరు. ఆశ్చర్యపోయారు కదా! ఇండోనేషియాకు చెందిన ఓ తండ్రి.. తన కొడుకుకు ఈ పేరు పెట్టారు. ఇందుకో ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే..

  • బాలయ్య హీరోయిన్​గా.. 

బాలయ్య(balakrishna movies) కొత్త సినిమా హీరోయిన్​ ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. శ్రుతిహాసన్(shruti haasan movies)​ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

06:52 October 28

TOP NEWS@7AM

  • పోలింగ్​కు సర్వం సిద్ధం

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌(Huzurabad by election Polling Arrangements )కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రచార గడువు ముగియడంతో నిర్వహణ దిశగా దృష్టి సారించింది. లోలోపల ప్రచారాలు మాత్రం యథావిధిగా చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తుండగా.. ఎక్కడా అలాంటి ఊసే కనిపించకుండా పోలీసు పహారా.. ఇతర పరిశీలకుల నిఘా మరింతగా పెంచారు. భారీ పోలీసు పహారా నడుమ ఉపఎన్నిక కొనసాగనుండగా. పోలింగ్‌ ముగిసే వరకు 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది.

  • యువతపై కరోనా పంజా

రాష్ట్రంలో యువతపై కరోనా పంజా విసిరింది. వైరస్​ సోకిన బాధితుల్లో 90 వేలమంది యువతే ఉన్నారు. అందులోనూ పదేళ్లలోపు పిల్లలు 19 వేలదాకా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. తాజాగా వయసుల వారీగా కరోనా బాధితుల నివేదికను రూపొందించింది.

  •  మరింత చేరువగా సభ

రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టిన ఈ నాలుగేళ్ల కాలంలో సభ విషయాలు ఎక్కువగా ప్రజలకు చేరవయ్యాయి. 2017 ఆగస్టులో ఛైర్మన్‌గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు. నాటినుంచి ఇప్పటివరకు సభ కార్యకలాపాల పనితీరు గురించి ప్రజలకు వివరిస్తూ పెద్దల సభ సచివాలయం 491 పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ఉపరాష్ట్రపతి వెంకయ్య పనితీరుకు నిదర్శనం.

  • ఛాంపియన్‌గా తెలుగమ్మాయి

జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో (National Boxing Championship 2021) పసిడి కైవసం చేసుకుంది యువ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen News). ఫైనల్లో 4-1 తేడాతో మీనాక్షి (హరియాణా)పై విజయం సాధించింది.

  • ప్రీ రిలీజ్​ వేడుకలో అల్లుఅర్జున్.

"చిత్ర పరిశ్రమల్లో అన్ని సమస్యలూ తొలగిపోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే ఉత్సాహం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నా" అని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో 'వరుడు కావలెను' ముందస్తు విడుదల వేడుక జరిగింది. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

04:57 October 28

TOP NEWS@6AM

  • డిజిటల్‌ సాంకేతికతలో అద్భుతాలు

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తొలి రోజు కీలక భేటీల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డేటాపై వారితో చర్చించారు. పరస్పర సహకారం అందించుకునే అవకాశాలపై ప్రధానంగా చర్చించారు.

  •  చేనేత జీన్స్‌

కళాత్మక నైపుణ్యం, అపూర్వ మేధాశక్తితో కూడిన చేనేత రంగం భారతదేశ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. శతాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసినా ఈ వస్త్ర రాజసం వన్నె మాత్రం ఏనాడు తగ్గలేదు. ప్రజల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రకాలతో సొబగులందుకుంటూ వస్తోంది. చేనేత పరిశ్రమ. మారుతున్న కాలానుగుణంగా ఫ్యాషన్‌ హోరుకు దీటుగా విభిన్న రకాల డిజైన్ల రూపొందిస్తున్న నేతన్నలు యువత అభిరుచులకనుగుణంగా జీన్స్‌ దుస్తులను సైతం నేస్తూ ఔరా అనిపిస్తున్నారు.

  • ఇకపై రోజు వారీ విచారణ

జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. 2012 నుంచి దాఖలైన సుమారు 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది.

  •  నవంబర్​ 3 నుంచి ఐసెట్​ కౌన్సెలింగ్​ 

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నవంబరు 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది (ts Icet Counseling 2021). మొదటి, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది.

  • పోడుభూములపై  సీఎస్​ సమీక్ష

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంపై అధికారులతో సీఎస్​ సోమేశ్​ కుమార్​ అధికారులతో చర్చించారు. రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో బీఆర్కేభవన్​లో సమీక్ష నిర్వహించారు.

  •  కోటిరెడ్డికి రిమాండ్‌

నగరంలోని నల్లగండ్లలో జరిగిన నర్సు నాగచైతన్య హత్య కేసులో చందానగర్‌ పోలీసులు నిందితుడు కోటిరెడ్డిని రిమాండ్​కు తరలించారు. నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కత్తితో నాగచైతన్య గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు

  • రాందేవ్ బాబాకు  సమన్లు

యోగా గురువు రాందేవ్ బాబాకు అలోపతి వైద్యం వివాదం ఉచ్చు బిగుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

  • ఎన్​ఏబీఎఫ్ఐడీ ఛైర్​పర్సన్​గా కేవీ కామత్​

నేషనల్​ బ్యాంక్​ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్​మెంట్​( ఎన్​ఏబీఎఫ్ఐడీ) ఛైర్​పర్సన్​గా దిగ్గజ బ్యాంకర్ కేవీ కామత్​ను ప్రభుత్వం నియమించింది. న్యూ డెవలప్​మెంట్ బ్యాంక్ (ఎన్​డీబీ ) మొదటి అధిపతిగా పనిచేసిన కామత్​, అయిదేళ్ల పదవీకాలాన్నీ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.

  • వారు స్వేచ్ఛగా ఉండే బయటి ప్రదేశం అదొక్కటే..!

అఫ్గాన్​లో తాలిబన్ల పాలనతో మహిళలు (afghan womens) మళ్లీ పరదాల జీవితాన్ని గడపాల్సి వస్తోంది. ఇల్లు దాటి బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఈ ఆంక్షల మధ్య కాబుల్ మహిళలకు మాత్రం బయటకు వచ్చి తమ సాధకబాధకాలు చెప్పుకోవడానికి ఓ ప్రదేశం ఉంది తెలుసా..? అదెక్కడంటే..!

  • 'వారు కూడా ఐపీఎల్​ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవచ్చా?'

ఐపీఎల్​ కొత్త ఫ్రాంచైజీలను(IPL 2022 new team name) కొనుగోలు చేసిన సంస్థపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్స్​పై(CVC capital india) విమర్శలు చేశారు ఐపీఎల్​ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. బెట్టింగ్​లు నిర్వహించే ఆ సంస్థ బిడ్​ను దక్కించుకోవడమేంటని బీసీసీఐని ప్రశ్నించారు.

Last Updated : Oct 28, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.