ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - telangana top news

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Sep 15, 2021, 6:01 AM IST

Updated : Sep 15, 2021, 8:59 PM IST

20:55 September 15

టాప్​ న్యూస్​ @ 9 PM

పెయింటర్​కు ప్రాణదానం

"చావు ఎదురుగా నిలబడ్డా.. కొంచెం కూడా బెదరకుండా పోరాడింది ఏం గుండెరా వాంది. ప్రజలను రక్షించే వృత్తిలో ఉండి.. దేహమంతా నిస్తేజంగా పడి ఉన్నా కర్తవ్యాన్ని మరవకుండా... ఇంకో ప్రాణాన్ని కాపాడిందంటే అదిరా గుండె అంటే. తమ కుటుంబంలో విషాదం నిండుతుందని తెలిసినా.. మరొకరి ఇంట్లో వెలుగులు నింపేందుకు ఒప్పుకున్న ఆ మానవతామూర్తులది ఎంత గొప్ప మనసురా."--- వీరబాబు, అతడి కుటుంబం గురించి అందరూ అనుకుంటున్న మాటలివి.

కొత్తగా 324 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 324 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,62,526కు చేరింది. తాజాగా కొవిడ్‌తో ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య  3,899కి చేరింది.  మరో 280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,302 మంది కొవిడ్​ నుంచి  బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

న్యాయం కోసం కొనసాగుతోన్న దీక్ష

సైదాబాద్​లో అత్యాచారానికి గురైన చిన్నారికి న్యాయం జరగాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష 5 గంటలుగా కొనసాగుతోంది. చిన్నారికి న్యాయం జరిగేదాకా దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు.

క్వాడ్​ సమావేశంపై చర్చ!

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరీసన్​​తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై (India-Australia Partnership) చర్చించినట్లు తెలిపారు.

46 బంతుల్లో సెంచరీ!

ఐపీఎల్​-2021(IPL 2021) రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా ట్రోఫీని ముద్దాడాలన్న ఆశయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో(RCB Practice Today) తీవ్రంగా శ్రమిస్తున్నారు. గురువారం జరిగిన ఇంట్రాస్క్వాడ్​ మ్యాచ్​లో(RCB Practice Match) ఆర్సీబీ స్టార్​ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 46 బంతుల్లో సెంచరీ సాధించి.. అందర్ని ఆశ్చర్యపరిచాడు.

రాజ్​కుంద్రాపై 5000 పేజీల ఛార్జిషీట్

పోర్న్ వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో నటి శిల్పాశెట్టి భర్త రాజ్​కుంద్రాను రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. ఇప్పుడు అతడితో పాటు మరో 13 మందిపై కలిపి మొత్తంగా 5000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.

19:57 September 15

టాప్​ న్యూస్​ @ 8 PM

గుండె మార్పిడి విజయవంతం

నిమ్స్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.  దాదాపు 5 గంటల పాటు గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.

భారత్​.. ప్రజాస్వామ్యానికి అమ్మ లాంటిది

సంసద్​ టీవీ ఛానెల్​ను (sansad tv launch) ప్రధాని నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. పార్లమెంట్​ విధానంలో మరో కీలక ఘట్టంగా పేర్కొన్నారు మోదీ.

ఆ డబ్బు మోదీనే జమచేశారు..

పొరపాటుగా తన బ్యాంకు ఖాతాలో పడ్డ రూ.5 లక్షలను తిరిగిచ్చేందుకు ఓ వ్యక్తి నిరాకరించాడు. తనకు ఆ డబ్బును ప్రధాని మోదీ జమచేశారని, వాటిని ఖర్చుపెట్టానని తెలిపాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

స్విగ్గీ, జొమాటో సేవలపై జీఎస్​టీ?

ఈ నెల 17న జరగనున్న సమావేశంలో జీఎస్​టీ కౌన్సిల్ (GST council meeting) మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థల సేవలను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే (GST on Swiggy) అంశంపై ఈసారి భేటీలో చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అత్యుత్తమ కెప్టెన్​ అతడే!

టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సౌరవ్​ గంగూలీ, మహేంద్రసింగ్​ ధోనీలలో గొప్ప కెప్టెన్​(Team India Best Captain) ఎవరనే ప్రశ్నకు మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ ఆసక్తికర సమాధానమిచ్చాడు. వారిద్దరిలో ఒకరు జట్టును కొత్తగా పరిచయం చేస్తే.. మరొకరు ప్రపంచ ఛాంపియన్​గా నిలబెట్టారని వెల్లడించాడు.

19:00 September 15

టాప్​ న్యూస్​ @ 7 PM

నా హృదయాన్ని కలిచివేసింది

సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం తన హృదయాన్ని కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. తానున్నానని ధైర్యం చెప్పారు. తల్లిదండ్రుల బాధను చూసి భావోద్వేగానికి లోనైన జనసేనాని.. నిందితునికి శిక్ష పడే వరకు పోరాడతానని భరోసా ఇచ్చారు. 

సోనూసూద్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఈ మేరకు ముంబయి, లఖ్‌నవూలోని సోనూసూద్‌కు చెందిన ఆరు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  

రేపట్నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

రాష్ట్రంలో రేపట్నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్‌పై పంచాయతీరాజ్​ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ

ఈనెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ కానుంది. ఈ సమావేశంలో గెజిట్ అమలుపై చర్చించనున్నారు. 

12 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం

మనమరాలి వయసు ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ వృద్ధుడు. బాధితురాలిని ఇష్టం వచ్చినట్లు కొట్టి బలవంతంగా తన వాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది.

18:53 September 15

టాప్​ న్యూస్​ @ 6 PM

6 గంటలపాటు విచారణ

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. సినీనటీ ముమైత్​ఖాన్​ను ఈడీ అధికారులు 6 గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీల గురించి ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ముమైత్ సమాధానమిచ్చారు.

పాక్​కు భారత్​ చురకలు!

ఉగ్రవాదులకు పాకిస్థాన్​ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్​లో(UN Human Rights Council) భారత్​ ఆరోపించింది. ఉగ్రవాదాన్ని పాక్​ పెంచి పోషిస్తోందని విమర్శించింది. ఉగ్రమూలాలకు పుట్టినిల్లైన పాక్​ నుంచి నీతి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని స్పష్టం చేసింది.

కలెక్టర్ ఎదుటే ఉమ్మిన వ్యక్తి.. ఆ తర్వాత..?

ఆస్పత్రి ప్రాంగణంలో ఉమ్మిన వ్యక్తిపై ఓ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తితోనే.. ఉమ్మిని తూడ్పించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) ఈసారి ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని ఆ దేశ స్టార్​ బ్యాట్స్​మన్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ జోస్యం చెప్పారు. ఇలాంటి మెగా టోర్నీకి ముందు ఐపీఎల్​ ఆడడం(Australian Cricketers in IPL 2021) కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు.

అఫ్గాన్ పరిస్థితులపై సినిమా

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. లైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, పిప్పా, గార్డ్ చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

17:02 September 15

టాప్​ న్యూస్​ @ 5 PM

సింగరేణి కాలనీలో ఉద్రిక్తత..

సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన అధినేత పర్యటనతో అక్కడికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. 

గడువు మళ్లీ పెంపు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్(Intermediate) మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును(inter admissions 2021) మళ్లీ పొడగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు ఈనెల 30 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ గడువు ఆగస్టు 30 వరకు ఉండగా... దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. తాజాగా మరో 15 రోజుల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  
 
మోదీ ప్రసంగం

షాంఘై సహకార సంస్థ​(ఎస్​సీఓ) కౌన్సిల్​ సమావేశానికి ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్​ నాలుగోసారి పాల్గొంటుంది. ఎస్​సీఓ 20 వసంతాలను పూర్తి చేసుకుంది. తజికిస్థాన్​ రాజధాని దుశాన్బెలో ఈ సమ్మిట్​ నిర్వహించనున్నారు.

ఖైదీ కోరిక.. చివరకు

జైలులో తనకు ఇష్టమైన పాట పెట్టాలంటూ ఓ ఖైదీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. న్యాయస్థానం అందుకు అంగీకరించినా.. ఆ ఖైదీ కోరిక నెరవేరలేదు. అసలు ఏం జరిగిందంటే..?

ఐపీఎల్​లో ప్రేక్షకులకు అనుమతి

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ రెండోదశలో అభిమానులను అనుమతించనున్నారు. అయితే పరిమితంగానే టికెట్లను విక్రయిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.

16:00 September 15

టాప్​ న్యూస్​ @ 4 PM

ఘటన బాధాకరం

సైదాబాద్ చిన్నారి ఘటనపై(Saidabad incident) మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. నిందితుడు రాజు కోసం 10 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

సీబీఐ కోర్టు నిరాకరణ

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ (AP CM JAGAN), వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. ఎంపీ రఘురామరాజు పిటిషన్​ను ధర్మాసనం కొట్టివేసింది.

ప్రమాదకర మ్యు, సీ.1.2. కేసులున్నాయా?

డెల్టానే ఇప్పటికీ.. భారత్​లో ఆందోళనకరమైన కరోనా వేరియంట్​గా ఉందని తెలిపింది జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం- ఇన్సాకాగ్ (INSACOG)​. అయితే.. ఇటీవల వెలుగుచూసిన కరోనా రకాల్లో ప్రమాదకరమైన మ్యు, సీ.1.2.(C.1.2 Variant) వేరియంట్లపై కీలక ప్రకటన చేసింది. టీకాలను ఏమార్చే గుణాలున్న.. ఈ తరహా కరోనా కేసులు భారత్​లో ఉన్నాయా? కట్టడి చేయడం ఎలా? ఇన్సాకాగ్​ ఏం చెప్పింది..

58,700పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు (Stocks Today) మరోసారి రికార్డు సృష్టించాయి. బుధవారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 476 పాయింట్లు పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 58,700 మార్క్​ను దాటింది. నిఫ్టీ (Nifty Today) 139 పాయింట్లు​ బలపడి సరికొత్త రికార్డు స్థాయి అయిన 17,500పైకి చేరింది.

మెరిసిన కోహ్లీ, కేఎల్​ రాహుల్​

అంతర్జాతీయ క్రికెట్​ కమిటీ(ఐసీసీ) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా కెప్టెన్​​ విరాట్​ కోహ్లీ సత్తాచాటాడు. కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు చేరుకోగా.. భారత ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ఆరో స్థానంలో నిలిచాడు.

14:36 September 15

టాప్​ న్యూస్​ @ 3 PM

స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..

సైదాబాద్​లో అత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. గుండెలవిసేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వీలైనంత తొందరగా నిందితున్ని పట్టుకుని... కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్​ చేశారు.

నిమ్స్​కు చేరుకున్న గుండె..

హైదరాబాద్​ మలక్​పేట యశోద నుంచి పంజాగుట్టలోని నిమ్స్​కు గుండె చేరుకుంది. గ్రీన్​ఛానల్​ ద్వారా ప్రత్యేక అంబులెన్స్​లో నిమ్స్​కు గుండెను తరలించారు. ఇప్పటికే శస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసిన వైద్యులు.. ఆస్పత్రికి గుండె చేరుకోగానే.. ఆపరేషన్​ ప్రారంభించారు.

భాజపా సహకరించాలి

రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాక నేరాలు బాగా పెరిగిపోయాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా జాతీయ నేర గణాంక సంస్థ ఇచ్చిన నివేదికే దీనికి నిదర్శనమన్నారు. కేసీఆర్, కేటీఆర్​, తెరాస నేతలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు భాజపా సహకరించాలని రేవంత్ కోరారు.

చెట్టుకొమ్మపై వ్యక్తి.. చివరకు...

వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక శాఖ(Fire Department) సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన ఒడిశా నయాగఢ్​ జిల్లాలో(Odisha Nayagarh News) జరిగింది. నువాసాహస్​పుర్​ గ్రామానికి చెందిన కిశోర్​ చంద్ర ప్రధాన్​.. కుసుమీ నదిలో(Kusumi River) చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే.. ఆకస్మాత్తుగా ఆ నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. దాంతో కిశోర్​ స్నేహితులు వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, కిశోర్​ అక్కడే చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న మామిడి చెట్టు కొమ్మపై కూర్చొని ఉండిపోయాడు. అనంతరం... అతని స్నేహితులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. అతణ్ని రక్షించి, ఒడ్డుకు చేర్చారు.

మూడోదశ ట్రయల్స్​కు డీసీజీఐ ఆమోదం

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​ లైట్​ టీకా మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​కు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​.. దేశంలోని ఇతర రెండు డోసుల టీకాల కంటే సమర్థవంతంగా పనిచేస్తోందని లాన్సెట్​లో ఓ అధ్యయనం ప్రచురితమైన తరువాత డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

13:33 September 15

టాప్​ న్యూస్​ @2PM

  •  రెండు కోట్ల మందికి వాక్సినేషన్‌ పూర్తి

తెలంగాణలో.. జనవరిలో ప్రారంభమైన టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ రెండు కోట్ల మార్క్​ను దాటింది. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ కేక్​ కట్​ చేశారు. వ్యాక్సినేషన్​లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని సీఎస్​ అభినందించారు.

  • చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. సైదాబాద్‌లోని బాలిక ఇంట్లో... చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చనున్నారు. కాసేపట్లో సైదాబాద్‌కు చేరుకోనున్నారు.

  • ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి డెడ్​లైన్​

దేశంలోని వివిధ ట్రైబ్యునళ్లలోని ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Tribunals Supreme Court) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సమయంలో ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

  • వీర్యంతో రోగులకు గర్భం- వైద్యుడి నిర్వాకం!

దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా సొంత వీర్యాన్ని (Fertility Doctor using own sperm) ఉపయోగించి వైద్యుడు తన తల్లిని గర్భవతిని చేశాడని ఓ మహిళ ఆరోపించారు. దీనిపై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

  • లిక్కర్​ పారబోస్తే.. ఐదేళ్ల వరకు తాగుడు బంద్​!

సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా.. సందర్భం ఏదైనా మద్యం ప్రియులు తాగుతూ ఎంజాయ్​ చేస్తారు. ఈ క్రమంలో మత్తులోనో.. అనుకోకుండానో ఒక్కోసారి గ్లాసు లేదా బాటిల్​ కింద పడుతుంది. అవసరమనుకుంటే.. మరొకటి కొనుక్కొని తాగుతారు. కానీ ఓ దేశంలో మాత్రం ఇలా పడేస్తే.. శిక్షిస్తారని మీకు తెలుసా..?

12:43 September 15

టాప్​ న్యూస్​ @1PM

  • నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్‌లో నిమజ్జనం అంశంపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించగా.. రేపు విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. హుస్సెన్​సాగర్​తో పాటు జంటనగరాల్లోని ఇతర జలాశయాల్లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయోద్దన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టింది. నిమజ్జనంపై రేపు సుప్రీం కోర్టు విచారణ జరుపనుంది. 

  • హుస్సేన్​సాగర్​కు గణనాథులు..

పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై స్పష్టత రాకముందే.. మట్టి గణపతులు ఇప్పటికే గంగమ్మ బాట పట్టారు. మట్టి విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ఇవ్వటం వల్ల.. ఇప్పటికే చాలా గణేశులు హుస్సేన్​సాగర్​కు చేరుకుంటున్నారు. నిమజ్జనానికి క్రేన్లతో పాటు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు క్లీనింగ్​ మిషన్​లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

  • 17న యాదాద్రికి కేసీఆర్..

సీఎం కేసీఆర్ ఈనెల 17న యాదాద్రిలో పర్యటించనున్నట్లు యాడా వర్గాలు తెలిపాయి. చినజీయర్ స్వామితో ఆలయాన్ని పరిశీలించి... ప్రధానాలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పనుల పూర్తిపై క్షేత్రస్థాయిలో సీఎం సమీక్షించనున్నారు.

  • రూ. 11 వేలు కడితే..​ ఎమ్మెల్యే టికెట్​!

''మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే.. రూ. 11 వేలు కట్టి అప్లై చేసుకోండి.'' ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్(UP Congress news)​ చేసిన ప్రకటన. వచ్చే ఏడాది అక్కడ శాసనసభ ఎన్నికలు (UP Election 2022) జరగనున్న నేపథ్యంలో.. పార్టీ టికెట్​ ఆశించే వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్​.

  • ధోనీ నియామకానికి కారణం అదే

మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని టీమ్​ఇండియా మెంటార్​గా(Team India Mentor T20 World Cup) నియమిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటో తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Ganguly on Dhoni).

11:56 September 15

టాప్​ న్యూస్​ @12PM

  • హైకోర్టుకు బదిలీ

అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు(telangana high court) నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ(mp raghurama) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు ‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును మాత్రం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.  

  • సర్వత్రా ఉత్కంఠ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వాలని, పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్‌పై హైకోర్టు నేడు నిర్ణయం ప్రకటించనుంది. రఘురామ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరిస్తే.. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఒకవేళ హైకోర్టు రఘురామ వాదనతో ఏకీభవిస్తే.. తీర్పు వెల్లడి నిలిచిపోయే అవకాశం ఉంది.

  • కాసేపట్లో నిమ్స్​లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్

హైదరాబాద్​ పంజాగుట్ట నిమ్స్​లో వైద్యులు గుండె మార్పిడి చికిత్స చేయనున్నారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్​డెడ్​ అయిన వ్యక్తి హృదయాన్ని మలక్​పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్​ ఛానెల్​ ద్వారా తరలించనున్నారు.

  • పట్టిస్తే.. నేనూ రివార్డు ఇస్తా.!

సైదాబాద్​ హత్యాచార ఘటనపై యావత్​ రాష్ట్రం ఆగ్రహం, విచారం వ్యక్తం చేస్తోంది. ఘటనకు పాల్పడిన రాజును అరెస్టు చేసి.. కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రాజుని పట్టిస్తే తన వంతుగా రూ. 50వేలు రివార్డు అందిస్తానని సంగీత దర్శకుడు ఆర్​పీ పట్నాయక్​ ప్రకటించారు. ఆ మానవ మృగాన్ని పట్టుకోవడంలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

  • ప్లేయర్​పై అత్యాచారం

24 ఏళ్ల జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారిణిపై అత్యాచారయత్నం, హత్య కేసును 3 రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేశారు. మరోచోట.. అడిగినంత కట్నం తేలేదని అత్తింటివారే కోడలికి విషమిచ్చి చంపారు. ఈ రెండు ఘటనలు ఉత్తర్​ప్రదేశ్​లో జరిగాయి.

11:02 September 15

టాప్​ న్యూస్​ @11AM

  • విచారణకు హాజరైన నటి ముమైత్‌ ఖాన్‌

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు నటి ముమైత్‌ఖాన్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. 

  • రంగంలోకి డీజీపీ

బాలికపై అత్యాచారం, హత్య కేసు(saidabad rape and murder case) నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును డీజీపీ(dgp mahender reddy) నేరుగా పరిశీలిస్తున్నారు. డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

  • దాడికి సిద్ధమైన ట్రంప్​

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. చైనా విషయంలో దూకుడైన నిర్ణయాలు తీసుకుంటారేమోనని ఓ సైనికాధికారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో చైనా సైనికాధికారితో చర్చించి.. యుద్ధం (US China War) రాకుండా చూడాలని కోరారు. ఈ విషయాలు ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

  • రెండో పెళ్లి చెల్లదు

ప్రత్యేక వివాహ చట్టానికి సంబంధించి ఓ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం వ్యక్తి హిందూ మహిళను రెండో వివాహం చేసుకుంటే అది చెల్లదని తెలిపింది. ఈ వివాహాన్ని చట్టం కూడా కాపాడలేదని స్పష్టం చేసింది.

  • అషురెడ్డి అందాలు అదరహో

బిగ్​బాస్​తో క్రేజ్​ సంపాదించుకున్న నటి అషురెడ్డి. సోషల్​మీడియాలో తన ఫొటోలను షేర్​ చేస్తూ అభిమానులకు టచ్​లో ఉంటుంది. ఇవాళ(సెప్టెంబరు ) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

09:51 September 15

టాప్​ న్యూస్​ @10AM

  • లాభాల్లోనే సూచీలు.. సెన్సెక్స్​ 100 ప్లస్​

స్టాక్​ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కనిపిస్తున్నందున మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయినా సూచీలు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 118 పాయింట్ల లాభపడి 58,365 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు వృద్ధి చెంది 17,416 వద్ద కదలాడుతోంది.

  • పెరిగిన పసిడి ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. వెండి ధర కూడా పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

  • దేశంలోనే తెలంగాణ టాప్..

గ్రామీణ ప్రాంతాల్లో సాగులో ఎక్కువ శాతం మంది ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ 87.6% కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 60.8 శాతంతో 19వ స్థానంలో నిలిచింది. దేశంలో ఉన్న భూమి కమతాలు, రైతు కుటుంబాలు, పాడి పశువుల పెంపకం తదితరాలపై చేసిన సర్వే వివరాలను జాతీయ కార్యక్రమాల అమలు, గణాంకాల శాఖ విడుదల చేసింది.

  • మొన్న సారంగపూర్... నేడు మల్కపేట

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మరో పంప్‌హౌస్‌ వరద నీటిలో చిక్కుకుంది. కొద్దిరోజుల క్రితమే నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్‌ పంప్‌హౌస్‌ నీట మునిగింది. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట భూగర్భ పంపుహౌస్‌ వరదలో చిక్కుకుంది.

  • కమలా హారిస్​ హత్యకు కుట్ర!

తాను అమెరికా ఉపాధ్యక్షురాలు(America Vice President) కమలా హారిస్​ను(Kamala Harris) హత్య చేయాలని యత్నించానని న్యాయస్థానంలో అంగీకరించింది ఓ మహిళ. ఈ హత్య కోసం దుండగులతో ఆమె 53 వేల డాలర్లకు బేరం కుదుర్చుకుందని అధికారులు తెలిపారు.

08:47 September 15

టాప్​ న్యూస్​ @9AM

  • ఇవాళ ఈడీ విచారణకు ముమైత్ ఖాన్

డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నందు, రానా, రవితేజతో పాటు అతని డ్రైవర్‌ శ్రీనివాస్, నవదీప్​, ఎఫ్ ​క్లబ్‌ జనరల్‌ మేనేజర్​ను అధికారులు విచారించారు. నేడు నటి ముమైత్​ఖాన్​ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

  • మూడేళ్లుగా కుమార్తెపై అత్యాచారం

తనకు తోడుగా.. పిల్లలకు రక్షణగా ఉంటాడని నమ్మి ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. కానీ అతను మాత్రం ఆమె కూతురుపై కన్నేశాడు. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు.. రాక్షసుడిలా బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెప్తే అంతు చూస్తానంటూ భయపెట్టాడు. కానీ విషయం గ్రహించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిపోతున్న క్రైమ్​ రేట్..

రాష్ట్రం అభివృద్ది దశలో దూసుకెళ్తుందా లేదా అని పక్కన పెడితే... నేర విభాగంలో మాత్రం ఎక్కడా బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిపోతుంది. మావన అక్రమ రవాణ కేసుల్లో రెండో స్థానంలో ఉండగా... సైబర్, ఆర్థిక నేరాల్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ(NRCB) వార్షిక నివేదిక విడుదల చేసింది.

  • ఆమెవరు? ఆ రాత్రి ఏం జరిగింది?

రాత్రి 11:30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి ఓ అమ్మాయి(18) పరుగెత్తుకుంటూ ఎదురుగా ఉన్న ఫంక్షన్‌హాల్‌లోకి వెళ్లి అక్కడే ఉన్న బస్సులో తలదాచుకుంది. మత్తులో ఉన్న ఆమెను నిర్వాహకులు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఠాణాలో అప్పగించారు. ఆమె ఎవరు..? ఎందుకలా పరుగెత్తుకుంటూ వచ్చింది..? అని తేల్చాల్సిన పోలీసులు బాధితురాలిని ఆశ్రమానికి తరలించి చేతులు దులుపుకొన్నారు.

  • చైనా ఉక్కుపాదం!

చైనా మీటూ (China MeToo movement) ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన మహిళకు.. కోర్టులో ప్రతికూల తీర్పు వచ్చింది. మహిళ చేసిన ఆరోపణలు రుజువు కాలేదని న్యాయస్థానం పేర్కొంది. అయితే, ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వంపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కఠిన ఆంక్షలను విధించే చైనా.. న్యాయం చేయాలంటూ వస్తున్న మహిళలపై సైతం అదే పంథాను కొనసాగిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

07:57 September 15

టాప్​ న్యూస్​ @8AM

  • పెరిగిన క్రైం రేటు

రాష్ట్రం అభివృద్ది దశలో దూసుకెళ్తుందా లేదా అని పక్కన పెడితే... నేర విభాగంలో మాత్రం ఎక్కడా బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిపోతుంది. మావన అక్రమ రవాణ కేసుల్లో రెండో స్థానంలో ఉండగా... సైబర్, ఆర్థిక నేరాల్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ వార్షిక నివేదిక విడుదల చేసింది.

  • ఆ విషయంలో శిక్షించడం సరికాదు

దంపతులిద్దరూ విషం తాగినప్పుడు.. ఆత్మహత్యకు ప్రేరేపించాడని భర్తకు శిక్ష విధించడం సరికాదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను తోసిపుచ్చింది.

  • వైర్​లెస్​ విద్యుత్

వీధుల్లో విద్యుత్‌ స్తంభాలు, తీగలేవీ లేవు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్‌ టవర్లేవీ లేవు. అయినా ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగులీనుతూనే ఉన్నాయి. ఫ్రిజ్‌, ఏసీ వంటివి యథావిధిగా పనిచేస్తూనే ఉన్నాయి. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. మరి అదే నిజమైతే? వైర్‌లెస్‌ విద్యుత్తు పంపిణీ పరిజ్ఞానంతో ఇది సాకారమయ్యే రోజులు మరెంతో దూరంలో లేవు.

  • దృష్టంతా దానిపైనే..

యూఎస్​ ఓపెన్​లో(US Open 2021) సంచలనాత్మక విజయం సాధించి టైటిల్​ సొంతం చేసుకుంది బ్రిటన్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను(Emma Raducanu US Open). తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. మానసిక దృఢత్వం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. భవిష్యత్​లో మరిన్ని టైటిళ్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు చెప్పింది.

  • ఆ పేరు ఎవరు పెట్టారు..?

అమితాబ్​ బచ్చన్(amitabh bachan name)​.. ఈ పేరు తెలియని వారుండరు. వెండితెరపై తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. బుల్లితెరపై కూడా చాలా కాలం నుంచి అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే బిగ్​బీకి.. అమితాబ్​ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా?

06:55 September 15

టాప్​ న్యూస్​ @7AM

  • పెరుగుతున్న పోక్సో కేసులు

కళ్లకు కామపు పొరలు... ఉచ్ఛనీచాలు లేవు... చిన్నాపెద్దా తేడా లేదు.... వావీవరసా ఊసే ఉండదు... మనిషి మృగమవుతున్నాడు. ఉన్మాదిగా మారి లైంగిక దాడులకు తెగబడుతున్నాడు. అభం శుభం తెలియని పసిపిల్లలనూ కిరాతకంగా చిదిమేస్తున్నాడు. ప్రతి మూడు గంటలకో అత్యాచారం. రోజుకు ఎనిమిదికి పైగా కేసులు... ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో వెెలుగు చూసిన ఆరేళ్ల చిన్నారి ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన అన్ని ఉదంతాల్లో గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలు వినియోగించిన తర్వాతే కొందరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడినట్లు వెల్లడైంది.

  • ఉపసంఘం ఏర్పాటు

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయం మేరకు... గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని నియమించింది.

  • నా భర్త... పోలీసుల నుంచి ఎలా పారిపోగలడు?

దిశ(disha case) నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో విచారణను సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) ముమ్మరం చేసింది. కమిషన్ ముందుకు మృతుడు చెన్నకేశవులు భార్య హాజరయ్యారు. సరిగ్గా నడవలేని చెన్నకేశవులు... పోలీసుల నుంచి ఎలా పారిపోగలడని వాంగ్మూలం ఇచ్చారు. తనకు న్యాయం చేయాలని కమిషన్​ను కోరారు.

  • అందుకే అజ్ఞాతవాసం!

అఫ్గాన్​ తాలిబన్ల ప్రభుత్వంలో(Taliban Government) ఉప ప్రధానిగా నియామకం పొందిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు(Mullah Baradar).. మంత్రివర్గంలో హక్కానీలకు ముఖ్య పాత్ర లభించడం ఏమాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయమై హక్కానీలతో(Haqqani Afghanistan) బరాదర్‌కు మాటల యుద్ధం జరిగిందని, మనస్తాపానికి గురైన ఆయన కాబుల్‌ను విడిచి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • ఆ బాకీ ఇప్పుడు తీర్చుకున్నా..

ఇటీవల 'సీటీమార్​' సినిమాతో విజయాన్ని అందుకున్న హీరో గోపిచంద్​.. హిట్‌ అనే మాట వినడానికి చాలా ఏళ్లు పట్టిందని అన్నారాయన. కాగా, ఈ మూవీ తనకెంతో ప్రత్యేకమని చెప్పారు కథానాయిక తమన్నా. వీరిద్దరూ ఈ మూవీ గురించి ఇంకా పలు విశేషాలను తెలిపారు.

05:30 September 15

టాప్​ న్యూస్​ @6AM

  • జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల..

జేఈఈ మెయిన్స్​-2021 ఫలితాలను(JEE MAINS RESULTS) జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) బుధవారం విడుదల చేసింది. మొత్తం 44 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా.. 18 మంది మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థుల హవా కొనసాగింది. ఏపీ నుంచి నలుగురు మొదటి ర్యాంక్‌ సాధించగా.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

  • మెట్రోను ఆదుకుంటాం..

కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్​ అండ్​ టీ కంపెనీ ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.

  • నేడు ఈడీ ముందుకు ముమైత్​ఖాన్​..

  • ఐదు రోజుల క్రీడా పండుగ..

చారిత్రక నగరంలో ఐదు రోజుల క్రీడా పండుగ మొదలవుతోంది. నేటి నుంచి హనుమకొండ జేఎన్ఎస్ మైదానంలో 60వ జాతీయ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్ షిప్​ పోటీలు ప్రారంభమౌతున్నాయి. ఇప్పటికే 23 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు నగరానికి చేరుకున్నారు. సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

  • నేడే లా సెట్​ ఫలితాలు..

లాసెట్, పీజీ ఎల్​సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించనున్నారు.

  • నేడే తీర్పు..

  • మోదీ భేటీ..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పథకాల అమలులో అవలంబించాల్సిన మెరుగైన విధానాల గురించి చర్చించారు.

  • ఎలాంటి దాడులు చేయం..

అఫ్గానిస్థాన్​ భూభాగాన్ని.. ఇతర దేశాల్లో దాడులు చేసేందుకు ఉపయోగించమన్న ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నామని అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. గతేడాది అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను వదులుకుంటామన్నారు.

  • దాయాదీ పోరు?

కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​పై (T20 World Cup 2021) తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇండియా మరోసారి టైటిల్​ గెలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఈసారి ఫైనల్​కు వెళ్లే జట్లు ఇవేనంటూ ఆసక్తికర ప్రకటన చేశారు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

  • మహేశ్ భావోద్వేగ ట్వీట్..

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై భావోద్వేగానికి గురయ్యాడు సూపర్​స్టార్ మహేశ్. నేరస్థులను వెంటనే శిక్షించాలని కోరాడు.

Last Updated : Sep 15, 2021, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.