ETV Bharat / city

ఈటీవీ భారత్ - ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

TOP NEWS OF THE HOUR
TOP NEWS OF THE HOUR
author img

By

Published : Sep 12, 2021, 5:53 AM IST

Updated : Sep 12, 2021, 9:04 PM IST

21:45 September 12

టాప్​ న్యూస్​ @10PM

  • స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి..

రాష్ట్రంలో రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్న సీఎం.. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ జరగాలని సూచించారు.

  • వారిలో యాంటీబాడీలు సున్నా..

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా.. చాలామందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందటం లేదని ఒడిశాలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ లైఫ్​ సైన్సెస్​.. తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి కాలేదని తేలింది. జన్యుపరమైన వ్యత్యాసాలే కారణమని అభిప్రాయపడింది.

  • సండే.. ఫన్​ డే..

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై 'సండే ఫన్ డే' సందడిగా జరిగింది. ప్రతి ఆదివారం సందర్శకుల కోసం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఆర్మీ బ్యాండ్, లేజర్ షో ఆకట్టుకుంటున్నాయి.

  • 'సాగర్​' వద్ద కోలాహలం..

హైదరాబాద్ హుస్సేన్​సాగర్​లో గణేశ్​ నిమజ్జనాలు జోరందుకున్నాయి. ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను సాగర్​లో నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. 

  • ప్రశాంతంగా ముగిసిన నీట్​..

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసే నీట్(NEET) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. తాగునీటి బాటిళ్లు, చిన్న శానిటైజర్లను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

20:58 September 12

టాప్​ న్యూస్​ @9PM

  • ప్రశాంతంగా నీట్​..

  • న్యాయమూర్తి ఔదార్యం..

కోర్టు ముందుకు నడిచి రాలేని ఓ దివ్యాంగుడిని వెతుక్కుంటూ న్యాయమూర్తే వెళ్లారు. రోడ్డుపై అతని కారు వద్దే తీర్పు చెప్పారు. ప్రమాదంలో వికలాంగుడిగా మారిన వ్యక్తికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించారు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ కొర్బా జిల్లాలో జరిగింది.

  • ఆ బాధ్యత మేము తీసుకుంటాం..

హుజూరాబాద్‌లో ఓటు అడిగే నైతిక హక్కు భాజపా నేతలకు లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు . పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు తగ్గిస్తామనే హామీతో ఓట్లు అభ్యర్థించాలని చురకలు అంటించారు. రైతులను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా మోసం చేస్తోందని మండిపడ్డారు. గుడ్డిగా భాజపాకు ఓటు వేస్తే మరింత కష్టాల్లోకి పడడం ఖాయమని హెచ్చరించారు.

  • ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉంటాం..

ఎస్సీల వర్గీకరణకు వైతెపా కట్టుబడి ఉంటుందని వైఎస్​ షర్మిల హామీ ఇచ్చారు. తుంగతుర్తి వైతెపా అభ్యర్థిగా ఏపూరి సోమన్నను ఆమె ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వైతెపా ఆధ్వర్యంలో జరిగిన 'దళితభేరి' సభకు షర్మిల హాజరయ్యారు.

  • పాక్ వక్రబుద్ధి..

కశ్మీర్​లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 131పేజీలతో కూడిన డాక్యుమెంట్​ను విడుదల చేసింది పాకిస్థాన్​. ఈ క్రమంలో భారత ప్రభుత్వంపై అనేక నిందలు వేసింది. కశ్మీర్​ అంశం మా దేశ అంతర్గత వ్వవహారమని భారత్​ ఎన్ని సార్లు చెప్పినా.. పాక్​ తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు.

19:50 September 12

టాప్​ న్యూస్​ @8PM

  • జీపు బోల్తా- ఏడుగురు మృతి..

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు చిక్కబళ్లాపుర్​లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​-బెంగలూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

  • అతిపెద్ద ఇంక్యుబేటర్​గా టీ-హబ్-2..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధం అయిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ భవనం దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్​గా టీ-హబ్ నిలవనుంది.

  • కాంగ్రెస్​ కమిటీ నియామకం..

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ఛైర్మన్‌గా, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కన్వీనర్‌గా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పలువురు సీనియర్​ నాయకులను సభ్యులుగా నియమించింది.

  • ఆసుపత్రిలో అర్జున్​రెడ్డి..

అర్జున్​రెడ్డి సినిమాలో హీరో పూటుగా తాగొచ్చి రోగులకు హీరో వైద్యం చేస్తుంటాడు. అచ్చం అదే సీన్​ ఆ ఆస్పత్రిలోనూ రిపీటయ్యింది. అక్కడ హీరో ఆపరేషన్లు చేస్తే.. ఇక్కడ మాత్రం మందులతోనే సరిపెట్టాడనుకోండి. అయినా.. అసవు విషయం కనిపెట్టి రోగుల బంధువులు లొల్లి షురూ చేశారు.

  • మానం వీడిన రవిశాస్త్రి..

మాంచెస్టర్​ వేదికగా భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు(India Vs England 5th Test) కరోనా కారణంగా రద్దైంది. అయితే ఈ మ్యాచ్​ రద్దవ్వడానికి ప్రధానకారణంగా టీమ్ఇండియా కోచ్​ రవిశాస్తి ఓ పుస్తకావిష్కరణ(Ravi Shastri Book Launch) కోసం వెళ్లడమే కారణమని మీడియాలో కొన్ని కథానాలు వచ్చాయి. వాటిపై తొలిసారి భారత ప్రధానకోచ్​ రవిశాస్త్రి స్పందించాడు.

18:47 September 12

టాప్​ న్యూస్​ @7PM

  • సోమవారమే ప్రమాణస్వీకారం..

గుజరాత్​ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్​ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​. ఆదివారం గవర్నర్​ను కలవనున్నట్లు స్పష్టం చేశారు.

  • గర్జనపల్లిలో ఉద్రిక్తత..

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిబ్బంది యత్నించగా.. స్థానిక దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేజారకుండా పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

  • క్యూ ఆర్​ కోడ్​ గణేశ్..

పెరిగిన సాంకేతికతతో ఏటా జరిగే గణపయ్య ఉత్సవాల్లోనూ(ganesh) ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో గణేశుడు భక్తులకు దర్శనమిస్తుండగా... కానుకలు సమర్పించడానికి సంస్థాన్ నారయణపురం యువత వినూత్న ఏర్పాటు చేశారు. అదేంటంటే...

  • సాహసాలకు మరో హీరో రెడీ..

మన దేశానికి చెందిన ప్రముఖులు మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్​తో సాహసాలు చేయించిన బేర్ గ్రిల్స్​.. ఇప్పుడు మరో బాలీవుడ్​ హీరోతో స్టంట్​లు చేయించనున్నాడు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరంటే?

  • ఐపీఎల్​ వ్యాఖ్యాతలు వీరే..

ఐపీఎల్​(IPL 2021) రెండో దశ మ్యాచ్​ల కోసం వ్యాఖ్యాతలు(IPL Commentators) సిద్ధమవుతున్నారు. వారి పేర్లను స్టార్​స్పోర్ట్స్​ ప్రకటించింది. ఇంగ్లీష్​, హిందీ కామెంటేటర్ల పేర్లను ప్రస్తుతం విడుదల చేసింది.

17:42 September 12

టాప్​ న్యూస్​ @6PM

  • ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం..

సైదాబాద్​లో జరిగిన ఘటన తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని హోం మంత్రి, డీజీపీని కోరారు.

  • జీపీఎస్​ కంటే కచ్చితంగా..

కొత్త ప్రదేశానికి వెళ్లి.. అక్కడ చిరునామా దొరక్కా... లేదా వ్యక్తులను కలుసుకునేందుకు ఇబ్బందులు పడ్డారా...? గూగుల్ మ్యాప్స్ వంటి వెసులుబాట్లు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్దేశిత గమ్యం చేరుకోలేక పోయారా..? అలాంటి ఇబ్బందులను అధిగమించే సరికొత్త యాప్​ వచ్చేసింది..!

  • మళ్లీ రాజుకున్న పోడు వివాదం..

  • అక్కడ సంగీతానికి నో ప్లేస్..

అఫ్గానిస్థాన్​లో సంగీత కళాకారుల(Afghan musicians) పరిస్థితి దయనీయంగా మారింది. గత పాలనలో మాదిరిగానే సంగీతంపై నిషేధం విధిస్తారనే భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. కాబుల్​లోని తమ కార్యాలయాలను మూసివేస్తున్నారు. కళాకారులు, అనుబంధ రంగాల వారు ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.

  • ఓటీటీలో దృశ్యం2

విక్టరీ వెంకటేశ్(daggubati venkatesh).. తన కొత్త సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా(rrr release date) పడటం వల్ల ఆ తేదీన తమ చిత్రాన్ని ఓటీటీలో తీసుకురావాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది.

16:48 September 12

టాప్​ న్యూస్​ @5PM

  • ఉత్కంఠకు తెర.. భూపేంద్ర పటేల్​కే పగ్గాలు..

గుజరాత్​ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్​ను ఎంపిక చేసింది భాజపా(gujarat cm news). విజయ్​ రూపానీ స్థానాన్ని ఆయనతో భర్తీ చేసింది(gujarat bjp news).

  • తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది..

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితులతో తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తోందని తెలిపారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్​కు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

  • ఈ గణపయ్య కొంచెం స్పెషల్..

గణేశ్​ నవరాత్రులు వచ్చాయంటే ఊరూ-వాడా పండగే. ఎంతో ఇష్టంగా నిలుపుకొన్న బొజ్జ గణపయ్యను తొమ్మిది రోజుల పాటు అందంగా అలంకరించుకుని పూజలు చేస్తుంటాం. నవరాత్రులు పూర్తయ్యే వరకూ నిష్ఠగా ఉంటూ నిత్యం కొలుచుకుంటాం. అయితే ఓ ఆలయంలో మాత్రం గణపయ్య రోజుకో వర్ణంలో దర్శనమిస్తారట.

  • మరో దారుణం..

తన స్నేహితులతో కలిసి టాయిలెట్​కు వెళ్లిన చిన్నారిపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • అశ్విన్​కు అవకాశం ఇవ్వండి..

భారత ఆఫ్​స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ ఆడేందుకు వీలైనన్ని అవకాశాలివ్వాలని బీసీసీఐ సెలెక్టర్లకు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ ఇయాన్​ ఛాపెల్​ సూచించారు. అశ్విన్​ ఇప్పటికే తన ప్రదర్శనతో అన్ని పరిస్థితుల్లోనూ ఆడగలడని నిరూపించుకున్నట్లు తెలిపారు. మిడిల్​ ఆర్డర్​లో అశ్విన్​కు చోటిస్తే జట్టు మరింత పటిష్ఠంగా మారుందని అభిప్రాయపడ్డారు.

15:48 September 12

టాప్​ న్యూస్​ @4PM

  • అత్యవసర విచారణకు హైకోర్టు నో..

వినాయక నిమజ్జనంపై తీర్పుపై ఇవాళ న్యాయమూర్తి ఇంట్లో అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. హౌజ్​మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.

  • పాదయాత్ర ఎందుకో చెప్పాలి..

భాజపా నేతలు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ సిలిండర్ల ధర పెంచిందని తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక అనుబంధ గ్రామమైన అంకంపేట గ్రామంలో 43 రెండు పడకల ఇళ్ల సామూహిక నూతన గృహా ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

  • వారికి బుద్ధి ప్రసాదించు రామయ్య..

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాచలంలో జరిగిన మండల కమిటీ ఎన్నికల సమావేశంలో మంత్రి, ఎంపీ పాల్గొన్నారు.

  • యువత, విద్యాసంస్థలదే కీలకపాత్ర..

సమాజంలో సానుకూల మార్పు కోసం విద్య, సమకాలీన అంశాలపై యువత దృష్టి సారించాలని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ(CJI JUSTICE NV RAMANA) సూచించారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థలు ప్రముఖ పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

  • మూవీ అప్డేట్స్​ వచ్చేశాయ్..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో లవ్​స్టోరి, హిట్ హిందీ రీమేక్, మిషన్ ఇంపాజిబుల్ 7, ప్లాన్ బి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

14:37 September 12

టాప్​ న్యూస్​ @3PM

  • ఎగ్జామ్ స్టార్ట్..

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(NEET 2021) రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష కోసం కేటాయించిన నగరాలు, పట్టణాల్లో కరోనా నిబంధనల నడుమ పరీక్ష కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

  • కొత్త సీఎం వేట.. కాసేపట్లో స్పష్టత..

గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్న ప్రశ్నకు కాసేపట్లో సమాధానం తెలిసిపోనుంది. భాజపా ఎమ్మెల్యేలు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశమై.. ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. భాజపా అధిష్ఠానం పంపించిన పరిశీలకులు.. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లద్ జోషి సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుంది.

  • నిమజ్జనం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం..

గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. రేపు ప్రభుత్వం తరఫున హౌజ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్​లో గణేశు నిమజ్జనం యథావిధిగా చేసుకునేలా హైకోర్టు అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని కోరకున్నట్లు తెలిపారు. 

  • అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు..

కుండపోతగా కురిసి కుదిపేసి కాస్త విరామం తీసుకున్న వానాలు.. మళ్లీ వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశమున్నా... రేపు, ఎల్లుండి మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు రానున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతోంది.

  • బోన్​ సర్జరీ విజయవంతం..

రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్​ తేజ్(Sai Dharam Tej road accident)​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

12:51 September 12

టాప్​ న్యూస్​ @1PM

భాజపాకు సీనియర్ నేత రాజీనామా

భాజపాకు సీనియర్ నాయకుడు కొలను హన్మంత్ రెడ్డి రాజీనామా చేశారు. గజ్వేల్‌ సభలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు హన్మంత్‌ రెడ్డి వెల్లడించారు. ఈనెల‌ 17న జరిగే రేవంత్‌ సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. 2014లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన హన్మంత్ రెడ్డి... గత అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరారు.  

పారాలింపిక్స్​ విజేతలతో మోదీ సమావేశం

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics 2021) పతకాలు సాధించిన భారత​ క్రీడాకారులను ఇటీవల కలిసిన ప్రధాని మోదీ(Modi Meets Paralympians).. వారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వీడియోను తాజాగా ట్విట్టర్​లో షేర్ చేశారు ప్రధాని.

మోదీజీ హెల్ప్

'నేనో శాస్త్రవేత్తను. నా శరీరంలో అమెరికా నిఘా వర్గాలు మైక్రోచిప్​ను (Microchip in body) అమర్చాయి. నేను పెట్టుకున్న హెల్మెట్ తీసేస్తే శరీరంలో నుంచి వైబ్రేషన్లు వస్తాయి. నన్ను మోదీనే కాపాడాలి' అంటూ ఓ వ్యక్తి దిల్లీలోని లూటెన్స్​ ప్రాంతంలో తిరిగాడు. ఎవరా వ్యక్తి? అసలేంటీ కథ?

ద్రవ్యోల్బణం లెక్కలే మార్కెట్లకు కీలకం!

స్టాక్ మార్కెట్లకు (Stock market) ఈ వారం ద్రవ్యోల్బణం లెక్కలు, అంతర్జాతీయ పరిణామాలు దిశా నిర్దేశం (Market Outlook) చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి సూచీలు ఈ వారం కొత్త గరిష్ఠాల వద్ద స్థిరంగా ఉంటాయా? ఒడుదొడుకులకు అవకాశాలు ఉన్నాయా?

ఈ సెలబ్రిటీలు వాడే స్పోర్ట్స్ బైక్స్ ధరెంతో తెలుసా?

బైక్​ యాక్సిడెంట్​ జరిగి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు హీరో సాయిధరమ్​ తేజ్(Sai dharam tej road accident))​. ఈ నేపథ్యంలో ఆయన నడిపిన స్పోర్ట్స్​ బైక్​ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఈయన దగ్గర ఉన్న ఖరీదైన స్పోర్ట్స్​ బైక్ లాంటివే పలువురు సెలబ్రిటీల దగ్గర ఉన్నాయి. వారెవరు, వాటి ధర ఎంతంటే?
 
11:49 September 12

టాప్​ న్యూస్​ @12PM

121 ఏళ్లలో రెండోసారి!

దిల్లీలో వర్షాలు ఎన్నడూ లేనంతగా కురుస్తున్నాయి. వర్షాల ధాటికి రికార్డులు (Delhi rainfall record) బద్దలయ్యాయి. 77 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం (Delhi rain) నమోదు కాగా.. 121 ఏళ్లలో ఇది రెండో అత్యధికమని భారత వాతావరణ శాఖ తెలిపింది.

'ముత్తూట్'​లో దొంగల బీభత్సం

ముత్తూట్​ ఫైనాన్స్​(Robbery in Muthoot Finance) కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు.. తుపాకీలతో దూసుకువచ్చారు. ఉద్యోగులను బెదిరించి, 12 కిలోల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

వైకల్యాన్ని ఓడించారు

దివ్యాంగులైతేనేమి.. అంతర్జాతీయ సమాజం ముందు దేశాన్ని గర్వించేలా చేశారు. తమ వైకల్యాన్ని ఓడించి.. అద్భుత విజయాలు సాధించారు. ఆ గెలుపు చప్పట్లతోనే తమను హేళన చేసిన వారికి సమాధానం చెప్పారు. అడుగు ముందుకు వేయనీయకుండా నలువైపుల నుంచీ ఉక్కిరిబిక్కిరి చేసే ముళ్ల కంచెల్ని దాటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఒకరు ఒంటిచేత్తో.. మరొకరు ఒంటి కాలితో ఇలా.. ఎవరి పంథాలో వారు టోక్యో పారాలింపిక్స్​లో పతకాల పండించారు. వారెవరో తెలుసుకుందాం.

జూలో 13 గొరిల్లాలకు కరోనా

గొరిల్లాలు మరోసారి కరోనా బారినపడ్డాయి. ప్రముఖ అట్లాంటా జూలో 13 వెస్ట్రన్​ లోల్యాండ్​ గొరిల్లాలకు పాజిటివ్​గా తేలింది. జూ సిబ్బంది ద్వారా.. వీటికి వైరస్​ సోకినట్లు అనుమానిస్తున్నారు.

గోపీచంద్​కు ప్రభాస్​ విషెస్

గోపీచంద్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'(Seeti Maar Telugu Movie)​.. ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటుడు ప్రభాస్(Prabhas Actor) ఇన్​స్టా వేదికగా​ ఓ పోస్ట్​ చేశారు. గోపీచంద్​ బ్లాక్​ బస్టర్ హిట్​ కొట్టారని అన్నారు.

10:45 September 12

టాప్​ న్యూస్​ @11AM

రేవంత్.. దళిత గిరిజన ఆత్మగౌరవ సభ

టీపీసీసీ(TPCC) పొలిటికల్ అఫైర్స్​ కమిటీ సమావేశం శనివారం ఆన్​లైన్​లో(ONLINE) నిర్వహించారు. గజ్వేల్ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

డయల్ 100కు కాల్​ చేసిందెవరో

ఈనెల 10న హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్​ హీరో సాయిధరమ్ తీవ్రంగా గాయపడ్డాడు. వంతెనపై స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో జారిపడ్డాడు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల సమయస్ఫూర్తితో.. గాయపడిన సాయిధరమ్​ తేజ్​ను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే..!

కొత్త సీఎం కోసం వేట

గుజరాత్ కొత్త సీఎం వేట (Gujarat new CM) మొదలైంది. తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు భాజపా పరిశీలకుల హోదాలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్ ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. నేడు సమావేశం కానున్న పార్టీ శాసనసభాపక్షం కొత్త ముఖ్యమంత్రిని (Gujarat CM news) ఎన్నుకునే అవకాశముంది. 

దీదీ ఆస్తులు తరిగాయ్​

భవానీపుర్​ ఉప ఎన్నికల(bhabanipur by election) కోసం నామినేషన్​ వేసేటప్పుడు సమర్పించిన ప్రమాణపత్రాల్లో తన ఆదాయ(Mamata Banerjee Income) వివరాలు వెల్లడించారు బంగాల్ ముఖ్యమంత్రి(West Bengal Cm) మమతా బెనర్జీ. తనకు సొంతిల్లు, సొంత వాహనం లేదని ఆమె పేర్కొన్నారు.

ఈ వాటర్​ చాలా కాస్ట్​ గురూ

చాలామంది సినీ, క్రీడా సహా ఇతర ప్రముఖులు ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. వారు తాగే నీరుకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు. అయితే ఇంతకీ ఆ నీటి లీటర్​ ధర ఎంతో తెలుసా? తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే. ఇంతకీ ఎంతంటే?

09:47 September 12

టాప్​ న్యూస్​ @10AM

బడిలో కరోనా పాఠాలు

కరోనా వైరస్​కు(Coronavirus) సంబంధించిన పూర్తి అంశాలను పాఠశాలల్లో (Covid lessons for students) పిల్లలకు బోధించనున్నారు. ఈ మేరకు బంగాల్ ప్రభుత్వం.. తన అనుబంధ పాఠశాలల్లో ఈ సబ్జెక్టును పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయం తీసుకుంది.

'నీట్​' రూల్స్​

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో ఏడు, ఏపీలో తొమ్మిది పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆభరణాలు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, పర్సు, చేతి గడియారాలకు అనుమతి ఉండదని ఎన్​టీఏ స్పష్టం చేసింది. నీట్ రాత పరీక్షకు.. కేంద్రంలోనే పెన్ను ఇస్తారు. రెండు గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు.. ఒకటిన్నర తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది.

సాయితేజ్​కు సర్జరీ అవకాశం.!

రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్​ తేజ్(Sai Dharam Tej road accident)​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

కరోనా తగ్గుముఖం

దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona cases in India) గణనీయంగా తగ్గింది. కొత్తగా 28,591 మందికి వైరస్​(Corona Update) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 338 మంది కొవిడ్​(Covid-19) బారిన పడి మరణించారు.

ఆ రెండు దేశాలతో పాక్ రహస్య మంతనాలు

తాలిబన్ల అధ్యక్షతన అఫ్గాన్‌తో(Taliban Afghanistan) నెలకొల్పే సత్సంబంధాలపై(Pakistan Afghanistan) చైనా, రష్యా సహా పలు దేశాల ఉన్నతాధికారులతో పాకిస్థాన్​ ఐఎస్​ఐ చీఫ్​ (Pakistan Isi Chief) రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయా దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌​ ఇస్లామాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

08:46 September 12

టాప్​ న్యూస్​ @9AM

దళితబంధుపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు(DALITHA BANDHU) పథకాన్ని మరో నాలుగు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలుకు సంబంధించి సీఎం కేసీఆర్(CM KCR)​ రేపు సమీక్ష నిర్వహించున్నారు.

థ్యాంక్స్ కేజ్రీజీ

భారీ వర్షాల ధాటికి దిల్లీలోని రోడ్లన్నీ(Delhi Rain News) జలమయమయ్యాయి. ఈ క్రమంలో దిల్లీ నడివీధుల్లో బోటులో తిరుగుతూ.. భాజపా నేత ఒకరు కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన కలను నెరవేర్చారంటూ సెటైర్ వేశారు.

మండిపడ్డ ట్రంప్​

9/11 దాడులు (9/11 attack) జరిగి 20 ఏళ్లు పూర్తయిన (9/11 attack anniversary) సందర్భంగా ఓ వీడియో సందేశం విడుదల చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​పై(Joe Biden) విమర్శలు సంధించారు. అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ(Afghan US Troops) తీరు విచారకరమని పేర్కొన్నారు. దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించాడని మండిపడ్డారు. మరోవైపు, అఫ్గాన్​లో చివరిసారి అమెరికా చేసిన డ్రోన్ దాడిలో నిఘా వైఫల్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

స్పోర్ట్స్​ బైక్​ల జోరు

స్పోర్ట్స్​ బైక్స్(SPORTS BIKES)​ అంటే యువతకు చాలా క్రేజ్​. హై స్పీడ్​తో మజా చేస్తూ ఖాళీగా ఉన్న రోడ్లపై రేస్​ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఆ ఆశ హద్దు దాటి.. జనారణ్యంలోకి ప్రవేశించింది. పట్టణాలు, నగరాల్లో పరిమిత వేగంతోనే వాహనాలు నడపాలి. కానీ అంత ఖరీదు పెట్టి కొన్న బండితో మామూలు స్పీడ్​తో వెళ్తే ఏం థ్రిల్​ వస్తుంది అనుకుంటారో ఏమో.. రోడ్డుపై ఎన్ని వాహనాలు వెళ్తున్నా.. అతివేగంతో దూసుకెళ్తున్నారు. దాని ఫలితంగా ఎన్నో పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు. 

ఐసీయూలో పీలే!

ఫుట్​బాల్ దిగ్గజం పీలే(footballer pele in hospital).. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పెద్దప్రేగులోని కణతిని తొలగించిన అనంతరం ఆయనను ఇంటెన్సివ్ కేర్​లో ఉంచారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన అభిమానులకు తన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు పీలే.

07:36 September 12

టాప్​ న్యూస్​ @8AM

చుక్కల టీకాతో మంచి ఫలితాలు

కొవిడ్​ వైరస్​కు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకా (బీబీవీ154) క్లినికల్‌ పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి దశ ప్రయోగాల్లో ఈ టీకా బాగా పనిచేస్తోందని నిర్ధారణ అయినట్లు సమాచారం.

అందుకే మూడో డోస్​

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మూడో డోసు టీకా ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కొవిడ్‌-19 పరిశోధకులు డాక్టర్‌ శ్రీధర్‌ చిలిమూరి అభిప్రాయపడ్డారు. సాధారణ వ్యక్తులు రెండో డోసు పొందిన 6 నెలల తర్వాత మూడో డోసు (బూస్టర్‌) పొందితే మంచిదన్నారు. దీనివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని చెప్పారు. రెండో డోసు పొందిన 6 నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడవుతోందన్నారు. 2024 నాటికి కరోనా వైరస్‌ ప్రభావం తగ్గే అవకాశం ఉందన్నారు.

శిథిల భవనాల్లో న్యాయస్థానాలు

న్యాయవ్యవస్థకు మౌలిక వసతుల కల్పన అంశాన్ని నిర్లక్ష్యం చేశామన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ. దేశంలో ఎన్నో కోర్టులు శిథిలావస్థకు చేరిన భవనాల్లో కొనసాగుతున్నాయని.. దానివల్ల సిబ్బంది, న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత న్యాయవ్యవస్థలో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు.
 
నేడే నిర్ణయం!

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ రూపానీ రాజీనామాతో కొత్త సీఎం ఎంపికపై భాజపా దృష్టి సారించింది. కొత్త సీఎంను ఎన్నుకొనేందుకు (Gujarat CM News) గుజరాత్‌ భాజపా శాసనసభాపక్షం ఇవాళ భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం పదవికి పలువురు కేంద్ర మంత్రులు సహా అనేక మంది నేతలు రేసులో నిలిచారు. అటు విజయ్‌ రూపానీ రాజీనామా (Vijay Rupani Resignation) వ్యవహారంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. భాజపా ఆయనను బలిపశువు చేసిందని ఆరోపించాయి.

ఇంగ్లాండ్​తో సిరీస్‌ ముగిసిందా.?

అనూహ్య పరిణామాల మధ్య ఆగిపోయిన భారత్‌-ఇంగ్లాండ్‌(Ind vs Eng 5th test) అయిదో టెస్టు భవితవ్యంపై అంతులేని సందిగ్ధత నెలకొంది. ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దయినట్లా? వాయిదా వేశారా? భారత్‌ ఆ మ్యాచ్‌ను వదులుకున్నట్లా? సిరీస్‌ ఇంతటితో ముగిసిందా లేదా? ఇలా అభిమానుల మదిలో మెదులుతున్న పలు ప్రశ్నలకు సమాధానం ఇప్పుడే దొరికేలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్​ను ఏం చేయాలన్నదానిపై ఈసీబీ(ECB).. ఐసీసీకి లేఖ రాయనున్నట్లు తెలిసింది. మరి ఐసీసీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

06:35 September 12

టాప్​ న్యూస్​ @7AM

సుప్రీం కీలక వ్యాఖ్యలు

రెవెన్యూ రికార్డుల్లో ఉండే మ్యూటేషన్ ఎంట్రీ..(Property Mutation) ఆస్తిపై వ్యక్తి యాజమాన్య హక్కును నిర్ధరించలేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. యాజమాన్యపు హక్కు మార్పిడి అయ్యిందనేందుకు మాత్రమే ఈ నమోదు ప్రక్రియ జరుగుతుందని తెలిపింది.

పెంచిన తల్లిని చంపించింది

కళ్లు తెరవని పసికందును తల్లిదండ్రులు కాదనుకున్నా ఓ తల్లి చేరదీసి ఆదరించింది. తన పిల్లలతో సమానంగా పెంచి పెద్ద చేసి ఆస్తిలో వాట కూడా ఇచ్చింది. పెళ్లి చేసి ఓ ఇంటికి పంపించాలనుకుంది. కానీ ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న కూతురి కోరికను పెంపుడు తల్లి నిరాకరించింది. దీంతో కక్ష్య పెంచుకున్న కూతురు... ప్రేమికుడిని రెచ్చగొట్టి.... తల్లిని హత్య చేయించింది. పోలీసుల దర్యాప్తులో కూతురు కుట్ర బయటపడింది.

మౌలిక వసతులతోనే

మనకున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వృద్ధికి బాటలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో మౌలిక వసతులను భారీయెత్తున విస్తరిస్తే అది ఆర్థికాభివృద్ధికి గొప్ప ఆలంబన అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ధోనీ అవసరం ఏముంది?

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup) మెంటార్​గా మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఎందుకు నియమించారో అర్థం కావడంలేదని అన్నాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. కోహ్లీ, శాస్త్రిల నేతృత్వంలో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తుంటే మెంటార్​ అవసరం ఎక్కడ ఉందని ప్రశ్నించాడు. 

'సీటీమార్'​ వసూళ్లే ఎక్కువ!'

'సీటీమార్'​ సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు దర్శకుడు సంపత్​ నంది. ప్రేక్షకులు థియేటర్​కు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ చిత్రం రుజువు చేసిందని అన్నారు. తన తర్వాతి మూవీ కోసం రెండు కథలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

05:15 September 12

టాప్ న్యూస్ @6AM

  • విద్యార్థులకు షాక్..

జేఎన్‌టీయూహెచ్‌(JNTUH), ఉస్మానియా విశ్వవిద్యాలయాలు(Osmania University) బీటెక్‌(BTech), బీఫార్మసీ(B pharmacy) చదవబోయే విద్యార్థులకు షాక్‌ ఇచ్చాయి. రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులను ఏకంగా రెట్టింపు చేశాయి. బీటెక్‌ రెగ్యులర్‌ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచారు.

  • నేడే నీట్​

  • రుణ ఊబిలోనే రైతు కుటుంబాలు

దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు అయిదేళ్లలో 57% పెరిగాయి. 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి తెలంగాణలో 91%, ఏపీలో 93% రైతు కుటుంబాలు రుణ ఊబిలో చిక్కుకుపోయాయి. తెలంగాణలో ఒక కుటుంబం సగటు రుణం రూ.1,52,113గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,45,554గా ఉంది.

  • రేపు అత్యవసర సమావేశం

నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై సోమవారం దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

  • చర్చకు సిద్ధం

రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా చర్చకు సిద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాసకు సవాలు విసిరారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అనుహ్య స్పందన వస్తోందని తెలిపారు. కాలికి గాయమైనా.. అమ్మవారి దయ.. కార్యకర్తల ఆశీర్వాదం వల్ల ఆరోగ్యం బాగుందన్నారు. ప్రజల సమస్యలు, బాధలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం వస్తోందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక హోద తీసుకురాకపోతే.. కేంద్రం నుంచే తామే ఆ దిశగా చర్యలు చేపడతాం అంటున్న బండి సంజయ్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

  • ఫిరాయింపులకు అడ్డుకట్ట పడాలంటే..

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం అయిపోయాయి. పార్టీ ఫిరాయింపులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చట్టం అమలులో ఉన్నా.. ఈ పోకడలో ఎలాంటి మార్పురాలేదు. ఈ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలంటే ప్రస్తుతం ఉన్న చట్టంలో పలు కీలక మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • అభివృద్ధికి చురుకు

  • తయారీ ప్రారంభించండి

దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న టెస్లా విజ్ఞప్తిపై (tesla india) కేంద్రం స్పందించింది. భారత్​లో తయారీ ప్రారంభించాకే సుంకాల తగ్గింపు విషయం పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

  • తాలిబన్ల జెండా

అఫ్గాన్​ అధ్యక్షుడి భవనంపై తాలిబన్లు (taliban news) శనివారం తమ జెండాను ఎగురవేశారు. అమెరికాపై వైమానిక దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన రోజే తాలిబన్లు.. జెండా ఎగురవేయడం గమనార్హం.

  • యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం..

యూఎస్‌ ఓపెన్‌ (us open 2021) మహిళల సింగిల్స్‌లో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువకెరటం ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ పోరులో 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌(కెనడా)ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

Last Updated : Sep 12, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.