ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

author img

By

Published : Sep 27, 2022, 11:02 AM IST

  • సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!

Supreme Court live streaming : సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్​లో లైవ్​లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.

  • 'అబే మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు'.. జపాన్​ ప్రధానితో మోదీ భేటీ

PM Modi Attend Shinzo Abe Funeral : జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వెళ్లిన మోదీ.. జపాన్​ ప్రధాని ఫ్యూమియో కిషిదతో సమావేశమయ్యారు.

  • డ్రోన్ ద్వారా మందుల సరఫరా.. నిజామాబాద్​ టు నిర్మల్​.. మంత్రి కేటీఆర్ హర్షం..

పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో లభించే అన్ని మందులు.. చిన్న చిన్న పట్టణాల్లో లభ్యం కావు. ఒకవేళ దొరికినా వాటిని నిల్వ చేసుకోలేము. ఎందుకంటే వాటికి కూడా కొంత సమయం ఉంటుంది. ఆ సమయం దాటితే ఇంక మరి అది పనికిరాదు. అలాగని అవసరమైనప్పుడే తీసుకురావాలంటే.. సమయాభావం తప్పదు. ఫలితంగా రోగి ప్రాణానికే ముప్పు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే వీలైనంత త్వరగా వాటిని తీసుకురావడమే ఉత్తమం.. లేకపోతే రోగినే పెద్ద నగరాల్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లాలి.

  • పోలీసుల అదుపులో గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు.. సెటిల్​మెంట్​ చేస్తుండగా..!

Gangster Nayeem follower sheshanna in Police Custody: గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్​లో సెటిల్​మెంట్​ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు.

  • విదేశాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. ఇక ఆ సర్టిఫికెట్‌ అప్లై ఆన్‌లైన్‌లోనే!

Passport Police Clearance Certificate: పాస్‌పోర్ట్‌ పొందాలంటే తప్పనిసరిగా పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పొందాల్సిందే. వాటి కోసం రేపటి నుంచి తపాలా కార్యాలయాల్ని అందుబాటులోకి తేవాలని.. కేంద్రం నిర్ణయించింది. తద్వారా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మరింత వేగంగా పూర్తికానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 30 ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఆ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • విభజన సమస్యలపై నేడు దిల్లీలో సమావేశం.. రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని సీఎం ఆదేశం

విద్యుత్‌ బకాయిలు సహా విభజన సమస్యల విషయంలో రాష్ట్రవాదనలను బలంగా వినిపించాలని చట్టం, న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమస్యలపై నేడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దిల్లీలో జరగనున్న సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానుంది.

  • ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు కొలువుదీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు.

  • రెంట్​కు బాయ్​ఫ్రెండ్​.. స్టార్టప్​ బంపర్​ ఆఫర్​

'బాయ్​ఫ్రెండ్​ కావాలా? రెంట్​కు ఇస్తాం. ఎన్ని గంటలో మీరే చెప్పండి!'.. అంటోంది బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్. ఇందుకోసం ఓ యాప్​ను కూడా అభివృద్ధి చేసింది.

  • సిరీస్ గెలిచాం సరే.. మరి ఆ సమస్యల సంగతేంటో!

India South Africa T20 Series : ఆసియాకప్‌ పోయినా.. టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఈ ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా మీద సిరీస్‌ గెలిచేశాం. తొలి టీ20 ఓడాక కూడా సిరీస్‌ గెలవడం గొప్ప విషయమే. కానీ సిరీస్‌ నెగ్గాం కాబట్టి అంతా బాగుందనుకుంటే పొరపాటే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడింట్లోనూ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీమ్‌ఇండియాను అత్యంత కలవర పెడుతున్న అంశం.. డెత్‌ బౌలింగ్‌. మ్యాచ్‌ల ఫలితాలు తేలే ఈ ఓవర్లలో.. భారత బౌలర్ల ప్రదర్శన రోజు రోజుకూ ఆందోళన పెంచుతోంది.

  • అక్టోబర్​లో క్రేజీ కాంబినేషన్స్​.. పండుగ టైంలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌

అగ్ర తారల సినిమాల విడుదలలు.. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు.. కొత్త లుక్స్‌.. కొత్త కబుర్లతో సినీ అభిమానుల్ని మురిపించనుంది అక్టోబరు నెల. సెట్స్‌పైకి వెళతాయనుకున్న పలువురు అగ్ర తారల సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. వచ్చే నెల నుంచి ఆ సినిమాలన్నీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. దసరా, దీపావళి పండగలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ సందర్భంగా కొత్త సినిమాలు, కొత్త కలయికల గురించి అప్డేట్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.