ETV Bharat / city

Telangana Top News: టాప్‌ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 2, 2022, 2:58 PM IST

దేశంలో ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యూలర్ జారీ చేయటం పేదల నోట్లో మట్టికొట్టడమేనని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. కూలీల వ్యతిరేక నిబంధనలు రూపొందించిన ఆ సర్క్యూలర్​ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.

  • రూ.వెయ్యి కోట్లకు చేరువలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు

జీహెచ్‌ఎంసీ ఓ సరికొత్త రికార్డుకు త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. వెయ్యి కోట్ల రూపాయల చేరువలో ఆస్తిపన్ను వసూళ్లు చేసింది. తొలి 4 నెలల్లోనే రూ.999.05 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసి జీహెచ్‌ఎంసీ చరిత్ర సృష్టించింది. ఎర్లీ బర్డ్ పథకంలో 5 శాతం రిబేట్‌తో రూ.741.35 కోట్లు వసూళ్లు రాబట్టింది.

  • 'నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు'

ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరైన చీకోటి ప్రవీణ్ తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. తప్పుడు పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు.

  • టార్గెట్​ ఆంధ్ర, కేరళ!

చైనాకు చెందిన నిఘా నౌక 'యువాన్ వాంగ్​ 5'.. శ్రీలంకలోని హంబన్​టొట నౌకాశ్రయం వైపు వెళ్తోంది. అయితే ఈ నౌక 750 కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా భారత్​లోని కల్పక్కం, కూడంకుళం సహా అణు పరిశోధనా కేంద్రాలు దీని పరిధిలో వస్తాయి.

  • ఏపీలో దంచికొడుతున్న వానలు..

ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. నిన్న అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురవగా నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెరవాడ వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • పిడుగుపాటుకు నలుగురి మృతి

ఏపీలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులు పడి ఒకేరోజు నలుగురు మృత్యువాత పడ్డారు.

  • 'విక్రమ్'​ రేంజ్​లో నాగార్జున​ కొత్త సినిమా..

ఆలీతో సరదాగా కార్యక్రమానికి 'కార్తికేయ 2' టీమ్​ విచ్చేసి సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో దర్శకుడు చందూ మొండేటి.. సీనియర్​ హీరో నాగార్జనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు.

  • నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోదాలు..

నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు చేపట్టింది ఈడీ. దిల్లీలోని సంస్థ ప్రధాన కార్యాలయం సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. పలు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

  • విమానం కిందకు దూసుకెళ్లిన కారు..

దిల్లీ విమానాశ్రయంలో అనూహ్య ఘటన జరిగింది. ఎయిర్​పోర్ట్​లో నిలిపి ఉంచిన ఓ విమానం కిందకు కారు దూసుకెళ్లింది. విమానం ముందు చక్రాల వరకు కారు వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • 'ఉపాధి హామీపై కొత్త సర్క్యూలర్​ వెంటనే ఉపసంహరించండి..'

దేశంలో ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యూలర్ జారీ చేయటం పేదల నోట్లో మట్టికొట్టడమేనని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. కూలీల వ్యతిరేక నిబంధనలు రూపొందించిన ఆ సర్క్యూలర్​ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.

  • రూ.వెయ్యి కోట్లకు చేరువలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు

జీహెచ్‌ఎంసీ ఓ సరికొత్త రికార్డుకు త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. వెయ్యి కోట్ల రూపాయల చేరువలో ఆస్తిపన్ను వసూళ్లు చేసింది. తొలి 4 నెలల్లోనే రూ.999.05 కోట్ల ఆస్తి పన్ను వసూల్ చేసి జీహెచ్‌ఎంసీ చరిత్ర సృష్టించింది. ఎర్లీ బర్డ్ పథకంలో 5 శాతం రిబేట్‌తో రూ.741.35 కోట్లు వసూళ్లు రాబట్టింది.

  • 'నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు'

ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరైన చీకోటి ప్రవీణ్ తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. తప్పుడు పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు.

  • టార్గెట్​ ఆంధ్ర, కేరళ!

చైనాకు చెందిన నిఘా నౌక 'యువాన్ వాంగ్​ 5'.. శ్రీలంకలోని హంబన్​టొట నౌకాశ్రయం వైపు వెళ్తోంది. అయితే ఈ నౌక 750 కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా భారత్​లోని కల్పక్కం, కూడంకుళం సహా అణు పరిశోధనా కేంద్రాలు దీని పరిధిలో వస్తాయి.

  • ఏపీలో దంచికొడుతున్న వానలు..

ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. నిన్న అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురవగా నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెరవాడ వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • పిడుగుపాటుకు నలుగురి మృతి

ఏపీలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులు పడి ఒకేరోజు నలుగురు మృత్యువాత పడ్డారు.

  • 'విక్రమ్'​ రేంజ్​లో నాగార్జున​ కొత్త సినిమా..

ఆలీతో సరదాగా కార్యక్రమానికి 'కార్తికేయ 2' టీమ్​ విచ్చేసి సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో దర్శకుడు చందూ మొండేటి.. సీనియర్​ హీరో నాగార్జనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.