ETV Bharat / city

Telangana Top news: టాప్ న్యూస్@ 9PM - Top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news
టాప్ న్యూస్@ 9PM
author img

By

Published : Jul 17, 2022, 8:58 PM IST

  • సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

CM KCR Comments on Cloud Burst: సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉన్నట్టు తెలుస్తోందని సీఎం కేసీఆర్​ తెలిపారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇలా జరిగిందని వివరించిన కేసీఆర్​.. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలపై క్లౌడ్​ బరస్ట్​ చేస్తున్నట్టు సమాచారం వస్తోందని పేర్కొన్నారు.

  • ' మూడు షిఫ్టుల్లో పనిచేయండి'

CM KCR Visit: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్​ పర్యటించారు. మొదట భద్రాచలంలో పర్యటించిన సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు వెళ్లారు. వరద బాధితులను పరామర్శించారు. అనంతరం.. అధికారులు, ప్రజాప్రతినిధులతో వరద ముంపు ప్రాంతాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

  • బోనాల సంబురం.. పోటెత్తిన భక్తులు

Lashkar Bonalu: బంగారు బోనాలు.. పోతురాజు విన్యాసాలు.. సాంప్రదాయదుస్తుల్లో ముత్తైదువులు.. ప్రముఖుల సందర్శనలు.. పోటెత్తుతున్న భక్తులతో.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. రెండ్రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

  • ' కేసీఆర్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి..'

Revanth Reddy Comments: హైదరాబాద్​ లక్డీకపూల్​లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్​ నేతలు సమావేశమయ్యారు. మూడున్నర గంటలపాటు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన నేతలు.. సీఎం కేసీఆర్​ క్లౌడ్​ బరస్ట్​ అంశంపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్​ను కేంద్రం వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు.

  • ఈ శతాబ్దపు జోక్

Bandi Sanjay On CM KCR: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే విదేశీ కుట్ర అంటూ కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తప్పిదాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్​ మునిగిందన్నారు. సీఎం చేసిన కామెంట్లు జోకర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

  • 200 కోట్ల మార్కు దాటిన వ్యాక్సినేషన్​

రోనా టీకా పంపిణీలో భారత్ ఆదివారం(జులై 17)​ మరో మైలురాయి సాధించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసింది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్​ మరోసారి చరిత్ర సృష్టించిందని ట్వీట్​ చేశారు

  • ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా(80) ఎంపికయ్యారు. ఈ మేరకు అల్వాను బరిలోకి దించనున్నట్లు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు

  • రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం

భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు..మాక్ పోలింగ్ జరగనుండగా ఆ తర్వాత 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది

  • సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు సింగపూర్​ ఓపెన్​ టైటిల్​ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్​ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్​లో తొలి సూపర్​ 500 టైటిల్​ను దక్కించుకుంది.

  • నిర్మాతల సంచలన నిర్ణయం

క్యారెక్టర్​ ఆర్టిస్ట్​లు, హీరోహీరోయిన్​లు పారితోషికాలు పెంచడం.. తమకూ కనీస వేతనాలు పెంచాలంటూ జూనియర్​ ఆర్టిస్ట్​లు సమ్మెకు దిగడం మొదలైన కారణాల వల్ల భవిష్యత్తులో సినిమాల నిర్మాణంపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్​లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.