ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM - telangana topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jun 19, 2022, 2:58 PM IST

  • పెట్రోల్​పై రూ.20, డీజిల్​పై రూ.14.. మళ్లీ ధరలు పెంచక తప్పదా?

ప్రభుత్వ రంగ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు కొంతకాలంగా వాహనదారులకు ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇటీవల కేంద్రం కూడా పెట్రోల్​పై రూ.8​, డీజిల్​పై రూ.6 మేర ఎక్సైజ్​ సుంకం తగ్గించింది. ఈ తరుణంలోనే ప్రైవేట్​ ఆయిల్​ కంపెనీలు మాత్రం లబోదిబోమంటున్నాయి. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నాయి. కారణం ఏంటి?

  • హైదరాబాద్​లో చల్లబడిన వాతావరణం..

కొన్ని రోజులుగా ఉక్కపోతలతో సతమతవుతోన్న రాజధాని వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

  • కేసీఆర్ లేదా కేటీఆర్ రావాల్సిందే..

బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ... ఆరోరోజు నిరసనకు దిగారు. దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో శనివారం చర్చలు జరిపినా... విఫలం కావటంతో మళ్లీ ధర్నా చేస్తున్నారు.

  • వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా: షర్మిల

వైఎస్సార్​​టీపీ అధ్యక్షురాలు షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. వైతెపా జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని ఆమె ఆకాంక్షించారు.

  • కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..?

రైతు బజార్‌లో ఇవాళ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • తనయుడితో కలిసి పదో తరగతి పరీక్ష.. తండ్రి పాస్​.. కొడుకు ఫెయిల్​

తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్​ కాగా.. కొడుకు ఫెయిల్​ అయ్యాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది.

  • పక్షి దెబ్బకు విమానంలో మంటలు​..

పట్నా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైట్​జెట్​ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేయగా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఇంజిన్​ను పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పైస్​జెట్​ ప్రతినిధులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు అధికారులు.

  • 'రుణాలు' భారం కావద్దంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కొవిడ్‌-19 పరిస్థితుల నుంచి చాలామంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అవసరాలు పెరగడంతోపాటు, పిల్లల ఫీజులు తదితరాల ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం అధికమవుతోంది. ఓవైపు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ దశలో అప్పులు తీసుకునే వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

  • పంత్​ వర్సెస్​ దినేశ్​ కార్తీక్​.. అవకాశం దక్కేదెవరికో?

ఇటీవల దినేశ్‌ కార్తీక్‌ ఆటతీరు చూసిన పలువురు మాజీలు అతడు కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌లో ఉండాలని ఆశిస్తున్నారు. మరోవైపు పంత్‌ టీ20 లీగ్‌లో అంతగా మెరవకపోవడం.. తాజా సిరీస్‌లో బ్యాటర్​గా విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది.

  • అక్కడ 'బాహుబలి 2' రికార్డును బ్రేక్​ చేసిన కమల్​ 'విక్రమ్'​

దిగ్గజ నటుడు కమల్​హాసన్​ నటించిన 'విక్రమ్'​ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను అందుకుంది. ఓ రాష్ట్రంలో ఏకంగా 'బాహుబలి 2' రికార్డులను అధిగమించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.