ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news
టాప్ న్యూస్ @ 9PM
author img

By

Published : Apr 23, 2022, 8:58 PM IST

  • ' ​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తాం'

Kishan Reddy on pragathi bhavan: కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తెరాస నేతలు పబ్బం గడుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్​ విసిరారు. ఇప్పుడు ప్రగతిభవన్​ కల్వకుంట్ల ప్రగతిభవన్​గా ఉందని.. దానిని భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తామని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • 'బండి సంజయ్ మర్డర్ చేశారంటే నమ్ముతారా?

ఖమ్మంలో యువకుని ఆత్మహత్య ఘటనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కోవడం పై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈనాడు-ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంపై.. అబద్ధపు ఆరోపణలపై తాము గుడ్డిగా నమ్మమని.. ఆ ఘటనలో మంత్రి తప్పేం లేదని స్పష్టం చేశారు.

  • '20 ఏళ్లు మాట్లాడుకునేలా బహిరంగ సభ'

వచ్చే నెల 6న హనుమకొండ​లో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పర్యటన దృష్ట్యా ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్​ఛార్జిలను నియమించారు.

  • 'పెట్రో, డీజిల్​పై నయా పైసా తగ్గించలేదు'

Bandi Sanjay letter on fuel rates: భాజపా, మిత్ర పక్షాలు పాలన సాగిస్తున్న రాష్ట్రాలు మినహా.. తెలంగాణతో పాటు మరో 4 జిల్లాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. ధర్నాలు ఆందోళనలతో ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు.

  • పిల్లల్ని చిదిమేసిన కారు

children died in Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బైక్‌పై ఉంచి తండ్రి పెట్రోల్‌ కోసం వెళ్లాడు. అదే సమయంలో ఓ కారు టైరు పేలి బైక్​ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు.

  • 'కేంద్రమే నిధులిస్తే.. కర్ణాటకలో ఎందుకు లేవు?'

Minister Harish Rao: కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా లెక్కచేయడం లేదని మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన మొత్తం రూ.7,183 కోట్లు తక్షణం కేంద్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

  • 'హైకోర్టుల్లో స్థానిక భాషల అమలు.. కానీ!'

CJI N V Ramana: దేశంలోని వివిధ హైకోర్డుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ. త్వరలోనే శాస్త్ర సృజనాత్మకత, కృత్రిమ మేధ ద్వారా అది సాధ్యమవుతుందని, కానీ, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెన్నైలో హైకోర్టు పరిపాలన భవన నిర్మాణానికి సీఎం స్టాలిన్​తో కలిసి శంకుస్థాపన చేశారు.

  • హనుమాన్ చాలీసా సవాల్​.. నవనీత్ కౌర్​ ఇంటిపై దాడి!

మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతాని ఎంపీ నవనీత్​ రాణా సవాల్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమె ఇంటి వద్దకు శివసేన కార్యకర్తలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. నవనీత్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ప్రధాని ముంబయి పర్యటనను దృష్టిలో ఉంచుకొని తన ఆందోళనను విరమిస్తున్నట్లు నవనీత్ కౌర్ ప్రకటించారు.

  • మోదీ పర్యటనకు ముందు మరో ఎన్​కౌంటర్

Modi JK visit security: జమ్ముకశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ప్రధాని జమ్ముకశ్మీర్ పర్యటనకు ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.

  • ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

IPL 2022 GT Vs KKR: ఐపీఎల్​ 2022లో భాగంగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​.. 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్​లోకి దూసుకెళ్లింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.