ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలువనమా రాఘవకు రిమాండ్ Vanama Raghava judicial custody: పాల్వంచలోని నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.కేరళ సీఎంతో భేటీ Kerala cm meet KCR: ప్రగతి భవన్లో కమ్యూనిస్టు నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్‌తో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన పినరయి విజయన్‌తో పాటు సీపీఎం జాతీయ నాయకులను కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు.బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్ Pm Modi call to Bandi Sanjay : బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జాగరణ దీక్ష, అరెస్టు తదితర పరిణామాలపై ఆరా తీశారు. పోరాటాలపై వెనక్కి తగ్గొందని గట్టిగా పోరాడాలని ప్రధాని బండి సంజయ్‌కు సూచించారు.మోగిన ఎన్నికల నగారా Five States election in 2022: దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు శంఖారావం మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు. కరోనా విజృంభణ Telangana Corona: రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,156 పరీక్షలు నిర్వహించగా... 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,041కి చేరింది.పార్లమెంట్‌లో కరోనా Parliament Corona: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న వేళ పార్లమెంట్‌లో కూడా కరోనా కలకలం రేపింది. రెండ్రోజులుగా పార్లమెంటు సిబ్బందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 350 మందికిపైగా కరోనా పాజిటివ్ అని తేలింది.' బూస్టర్ డోసుతో మెరుగైన ఫలితాలు' Covaxin Booster Dose: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. బూస్టర్ డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను విడుదల చేసింది.ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి మూడోవేవ్! Omicron variant in India: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఈ వేరియంటే కారణమని నిపుణులు తేల్చారు. మరోవైపు, ఫిబ్రవరిలో కరోనా ప్రస్తుత వేవ్ తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, రోజుకు ఐదు లక్షల కేసులు బయటపడే అవకాశం ఉందని అమెరికా వైద్య నిపుణుడు అంచనా వేశారు. సినీ పరిశ్రమను మీరే ఆదుకోవాలి తెలుగు చిత్ర పరిశ్రమను ప్రేక్షకులు ఆదుకోవాలని యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కోరారు. కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లలో సినిమాలను చూడాలని అన్నారు.ఆ రేసులో మయాంక్ ICC Player of the Month: డిసెంబర్ నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ. ఈ జాబితాలో భారత జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చోటు దక్కించుకున్నారు.