ETV Bharat / city

Telangana Top News: టాప్‌న్యూస్‌ @ 7PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Sep 19, 2022, 6:59 PM IST

  • తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు..

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

  • భాజపా గూటికి కెప్టెన్​ అమరీందర్​ సింగ్..

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపా కండువా కప్పుకున్నారు. తాను స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా భాజపాలో విలీనం చేశారు.

  • కోర్టులో నలుగురిని హాజరుపర్చిన ఎన్ఐఏ అధికారులు

ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో నిఘా పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న నలుగురిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ ఉగ్ర సంబంధ శిక్షణా కార్యక్రమాలకు పాల్పడిన మరో 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పలు కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు, కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు.

  • పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని!

ఈ హెడ్డింగ్ చూసి.. ఇదేదో టెంప్ట్ చేయడానికి, ఈ ఆర్టికల్ చదివించడానికి పెట్టిన హెడ్డింగ్ అనుకుంటే.. మీ థాట్ 100000 పర్సెంట్ రాంగ్. ఈ వ్యవహారం నిజంగా జరిగింది! "అవునా..? అదెలా సాధ్యమబ్బా? పెళ్లి కాగానే.. మూడు రోజుల్లోనే విషయం తేలిపోద్దిగా! ఏడాది కాలం ఎందుకు పట్టింది? మరి, ఆ గుట్టు ఎలా రట్టైంది?" అనే డౌట్స్ వస్తున్నాయా? ఇప్పుడు ఈ ఆర్టికల్ చదవండి.. స్వయంగా మీరే తెలుసుకుంటారు..

  • కలెక్టరేట్​ల వద్ద ఇద్దరు ఆత్మహత్యాయత్నం..

రాష్ట్రంలో రెండు వేర్వేరు కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు కలకలం సృష్టించాయి. జోగులాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. అదే విధంగా సూర్యాపేటలో తమ భూమికి పట్టా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కాసేపు ఆయా ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది.

  • సీఎం యోగికి గుడి..

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై అభిమానాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఏకంగా ఆయన విగ్రహంతో గుడికట్టి.. రోజూ ప్రత్యేక పూజలు చేస్తున్నాడు.

  • కస్టమర్స్​లా ఎంట్రీ.. క్షణాల్లో బంగారం మాయం..

క్షణాల్లో బంగారు ఆభరణాలు మాయం చేసిన ఇద్దరు అక్కాతమ్ముళ్లను గుజరాత్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆగస్టు 23న అహ్మదాబాద్​లోని శివరంజనీ గోల్డ్​ షోరూమ్​కు పూనమ్​ రంగ్వానీ అనే మహిళ వెళ్లింది. కొత్త మోడళ్ల బంగారు గాజులు, కంకణాలు చూపించమని అడిగింది. అనేక రకాలను వారు చూపించగా.. అందరి కళ్లుగప్పి రూ.75 వేలు విలువైన కంకణాన్ని ఆమె చోరీ చేసింది.

  • బ్రిటన్ రాణికి తుది వీడ్కోలు..

రాచరిక సంప్రదాయాలతో బ్రిటన్ రాణి అంత్యక్రియలు ముగిశాయి. వివిధ దేశాధినేతలు, రాజులు, రాణి కుటుంబీకులు క్వీన్ ఎలిజబెత్​-2కు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.

  • హాట్‌ టాపిక్‌గా అథ్లెట్​ వినేశ్‌ ఫొగాట్‌..

కామన్‌వెల్త్‌ 2022 పతక విజేత, భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. క్వాలిఫికేషన్‌ రౌండ్లో మంగోలియా రెజ్లర్‌ ఖులాన్‌ బత్కుయాగ్‌ చేతిలో పరాజయం పాలైన ఆమె.. ఆ తరువాత అనూహ్యంగా కాంస్య పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

  • విజువల్​ వండర్​గా నాగార్జున 100వ సినిమా..

గత మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్‌లో సీనియర్​ హీరో నాగార్జున.. తన 100వ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం తను ఇద్దరు దర్శక-నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.