ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Sep 7, 2022, 9:00 AM IST

  • గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠ్మానరణం

కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్‌ విశ్వనాథకత్తి గుండెపోటుతో కన్నుమూశారు. డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఇచ్చిన చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు.

  • తండ్రి స్మారకం వద్ద రాహుల్​ ఘన నివాళులు

తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ సందర్శించారు. బుధవారం ఉదయం ప్రత్యేక నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన 'భారత్‌ జోడో యాత్ర' బుధవారం లాంఛనంగా ప్రారంభం కానుంది.

  • రోగికి గుండెపోటు.. సీపీఆర్​తో ప్రాణాలు కాపాడిన డాక్టర్​.. వీడియో వైరల్

చెకప్​ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన వైద్యుడు హుటాహుటిన అతడి వద్దకు వచ్చి సీపీఆర్​ చేసి ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

  • ఆగస్టులో అంచనాలకు మించి వాణిజ్య పన్నుల రాబడి

Telangana Commercial Tax Revenue in August : రాష్ట్రంలో ఆగస్టులో వాణిజ్య పన్నుల రాబడి ఆశాజనకంగా ఉంది. గతేడాది ఆగస్టులో 5,173.25 కోట్లు రాబడి రాగా ఈ ఏడాది ఆగస్టులో రూ.6,446.32 కోట్ల మేర ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అంటే 25 శాతం వృద్ధి నమోదు చేసిందని పేర్కొన్నారు.

  • వరంగల్​కు మరో జాతీయస్థాయి ఘనత

Global Network of Learning Cities : కాకతీయుల పూర్వపు రాజధాని వరంగల్ మరో ఘనత సాదించింది. ఇప్పటికే పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతున్నఈ పట్టణం యునెస్కో ‘గ్లోబల్‌ నెట్వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ (జీఎన్‌ఎల్‌సీ)’కు ఎంపికైంది. 44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపునివ్వగా ఇందులో మన దేశం నుంచి 3 మాత్రమే ఉన్నాయి. వరంగల్‌తో పాటు కేరళలోని త్రిశూర్‌, నీలాంబుర్‌ నగరాలు ఈ ఘనత సాధించాయి.

  • నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు

భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది.

  • పుతిన్​ సమక్షంలో యుద్ధ విన్యాసాలు

రష్యా నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాలకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం హాజరయ్యారు.. వస్టాక్‌-2022 పేరుతో భారీఎత్తున నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భారత్​తో సహా పలు దేశాలు పాల్గొంటున్నాయి.

  • 10 కోట్లు దాటిన డీమ్యాట్​ ఖాతాలు

దేశంలోని డీమ్యాట్​ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్​ ముందు సుమారు 4 కోట్లు ఉన్న ఖాతాలు ఇప్పుడు ఏకాంగా పది కోట్లకు చేరిందని ట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ గణాంకాలు వెల్లడించాయి.

  • ఇది ప్రపంచ కప్​ తెచ్చే జట్టేనా?

ఎప్పుడో 2007లో, టీ20 ప్రపంచకప్‌ మొదలైనపుడు ట్రోఫీ అందుకుంది భారత్‌. అప్పట్నుంచి ఇంకో కప్పు కోసం నిరీక్షణ కొనసాగుతోంది. గత ఏడాది ఘోరమైన ప్రదర్శనతో కనీసం గ్రూప్‌ దశను కూడా దాటలేకపోయింది టీమ్‌ఇండియా. ఈసారైనా తప్పులు దిద్దుకుని కప్పుకేసి దూసుకెళ్తుందనుకుంటే.. ఆసియా కప్‌లో సాధారణ ప్రదర్శనతో ఆశలు, అంచనాలను ఒక్కసారిగా తగ్గించేసింది. సూపర్‌-4లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన రోహిత్‌ సేన.. ఇక ఫైనల్‌ చేరుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఆసియా కప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న జట్టు ఫైనల్‌ కూడా చేరకుండా నిష్క్రమించే పరిస్థితి రావడం ప్రపంచకప్‌ సన్నాహాలను ప్రశ్నార్థకం చేస్తోంది.

  • రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా సంతోషమే: ఆర్య

తమిళ నటుడు ఆర్య.. 'వరుడు'లో విలన్​గా కనిపించినప్పటికి 'నేనే అంబానీ', 'రాజా రాణి' లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. త్వరలో 'కెప్టెన్'​ అనే కొత్త ప్రాజెక్ట్​తో ధియేటర్లలోకి రానున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి మరిన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.