ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

author img

By

Published : Sep 3, 2022, 7:00 AM IST

  • నేడే కేబినెట్​ భేటీ.. వాటిపైనే ప్రధానంగా చర్చ..!

TS Cabinet Meeting: శాసనసభ సమావేశాలు, తెలంగాణ వజ్రోత్సవాలు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. పోడు భూముల అంశం, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ సహా ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిలు సహా వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి, సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

  • జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో కీలక మలుపు

Jubilee Hills gang rape case updates: జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగేలా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర ఆధారాలతో పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

  • కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు పేదలు కనిపించట్లేదా?: మంత్రి గంగుల

Gangula kamalakar fires on Nirmala Sitharaman: రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.. రేషన్ బియ్యం పంపిణీ విషయంలో చేసిన వ్యాఖ్యలను పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. తెలంగాణలో 90.34 లక్షల కార్డులుంటే అందులో కేంద్రం బియ్యం ఇస్తున్నది కేవలం 59 శాతం కార్డులకే అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఉచితాలు ఇవ్వొద్దనేది భాజపా విధానం అయితే, సంక్షేమంపై వెనక్కి తగ్గరాదనేది తెరాస విధానమని గంగుల వివరించారు.

  • విమోచన దినోత్సవం నిర్వహించాలని భాజపా నిర్ణయం.. రానున్న అమిత్​షా..!

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమాలకు కమలనాథులు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్​షా రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

  • వినాయక నిమజ్జనం.. భక్తులతో కలిసి స్టెప్పులేసిన పోలీసులు

Dance in Vinayaka Immersion: వినాయక నిమజ్జనం అనగానే ఊరేగింపులు, డీజే స్టెప్పులు గుర్తొస్తాయి. వాడవాడలా నుంచి వచ్చే గణనాథుల ఊరేగింపులతో రోడ్లన్నీ కిటకిటలాడుతాయి. వినాయక నిమజ్జనంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ వాయిద్యాలకు అనుగుణంగా చిందులేస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి స్టెప్పులేస్తారు. అక్కడక్కడ భద్రత కోసం వచ్చిన పోలీసులు సైతం భక్తులతో కలిసి డ్యాన్స్​లేస్తారు.

  • వైద్యుడిపై కులవివక్ష!.. వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్.. మేక కోసం తల్లి దారుణ హత్య

వైద్యుడిపై ఆస్పత్రి వర్గాలు కులవివక్ష ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడి కులాన్ని సాకుగా చూపి వైద్యుడికి కనీసం కుర్చీ కూడా ఇవ్వడం లేదంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, ఉత్తరాఖండ్​లో ఉన్నతవర్గ మహిళను వివాహం చేసుకున్న దళితుడు హత్యకు గురయ్యాడు. తన అత్త, మామలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాజస్థాన్​లో.. మేకను విక్రయించిందన్న కోపంతో తల్లిని హత్య చేశాడు ఓ బాలుడు.

  • మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి.. పలువురికి గాయాలు

అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్లు సమాచారం.

  • 'ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన లక్ష్యం'

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్​బీఐ ప్రధాన కర్తవ్యమని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ధరల పెరుగుదల, జీడీపీ వృద్ధిపై ప్రపంచ పరిణామాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. భారత్‌ వద్ద పెద్ద ఎత్తున విదేశీ మారక నిల్వలు ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు.

  • నీరజ్​ చోప్రా 'గోల్డ్​' జావెలిన్​ వేలం.. భారీ మొత్తానికి దక్కించుకుందెవరో తెలుసా?

విశ్వవేదికపై చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా జావెలిన్​ వేలంలో అదిరే ధర దక్కించుకుంది. గతంలోనే దీనిని వేలం వేయగా రూ. 1.5 కోట్లకు బిడ్​ వచ్చింది. అయితే దీనిని దక్కించుకుంది ఎవరో తెలుసా?

  • అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు.. అందుకే ఈవెంట్‌ రద్దైందన్న రాజమౌళి

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంపై చిత్రబృందం విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అభిమానులందరికీ క్షమాపణలు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.