ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM

author img

By

Published : Sep 2, 2022, 9:00 AM IST

  • ఆ అంశాలపై రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలి: సీఎం కేసీఆర్​

southern zonal council meeting 2022: రేపు జరగబోయే దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్​ అలీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం హాజరుకానుంది.

  • దూకుడు పెంచుతోన్న భాజపా.. 'మునుగోడు'లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

BJP Focus On Munugode By Elections: మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు దూకుడు పెంచుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ భాజపా జెండా ఎగరవేయాలని భావిస్తున్న కమలనాథులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. మునుగోడులో అంతంతమాత్రంగానే ఉన్న భాజపా గెలవాలంటే చెమటోడ్చాల్సిన పరిస్థితి.

  • ఊపందుకున్న 'మునుగోడు' రాజకీయం.. ఇంటింటికీ పార్టీల ప్రచారం..!

Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో తెరాసతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి.

  • నేడు ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ssc supply results 2022: రాష్ట్రంలో నేడు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • లారీలో పేలిన 100కి పైగా గ్యాస్‌ సిలిండర్లు..

ఏపీలోని ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్‌లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దాలతో లారీలోని సిలిండర్లు పేలాయి.

  • టీ పొడికి 'గోల్డ్'​ టచ్.. కిలో ధర రూ.2.5 లక్షలు

సాధారణంగా కిలో టీ పొడి రూ.300కు పైగా ఉంటుంది. అదే అసోంకు చెందిన ఆరోమికా సంస్థ తయారు చేసిన బ్లాక్​ టీ పొడి కిలో ధర తెలిస్తే అవాక్కవుతారు. 24 క్యారెట్ల బంగారం జత చేసిన ఈ బ్లాక్​ టీ పొడి కిలో ధర రూ.2.5 లక్షలు. అయితే దీంతో పాటు వైవిధ్యమైన రుచులను అందించే మరెన్నో టీ పొడులు తయారు చేశామని కంపెనీ అధికారులు చెబుతున్నారు.

  • భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!

రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్‌, శుక్రవారం మరో మైలురాయిని అందుకోనుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్ ప్రధాని మోదీ చేతుల మీదుగా లాంఛనంగా నౌకాదళంలో చేరనుంది.

  • ఆ ఫోన్​ కాల్స్​, మెసేజెస్​ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా స్వాహా!

Cyber crime safety tips in India : బ్యాంకుకు వెళ్లి.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే కాలం కాదిది. అరచేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తోనే క్షణాల్లో అన్నీ చక్కబెట్టేస్తున్నాం. పొదుపు ఖాతా ప్రారంభం నుంచి, షేర్లలో మదుపు వరకు అన్నీ యాప్‌లతోనే సాధ్యం అవుతోంది. ఇదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సైబర్‌ మోసగాళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు తమ ఖాతాదారులను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నాయి.

  • కోహ్లీ బెస్ట్ బ్యాటర్‌.. కానీ ఆసీస్‌తో అంత ఈజీ కాదు: రికీ పాంటింగ్‌

విరాట్​ కోహ్లీ ఫామ్​పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ స్పందించాడు. కోహ్లీ తిరిగి ఫామ్​లోకి వచ్చాడని, అతను అత్యుత్తమ బ్యాటర్​ అని ప్రశంసించాడు. అయితే ఆసీస్​తో తలపడేటప్పుడు అంతగా రాణించకపోవచ్చని చెప్పాడు.

  • ''రంగ రంగ వైభవంగా' కథ అందుకే ఒప్పుకున్నా'

తొలి చిత్రం 'ఉప్పెన'తో ఘన విజయం అందుకున్నారు యంగ్​ హీరో వైష్ణవ్‌ తేజ్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా' శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్​ తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.