ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 2, 2022, 7:00 AM IST

  • నేడు ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

రాష్ట్రంలో నేడు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • దసరాకు ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే పరేషాన్​ తప్పదు..!

దసరా పండగకు ఇంటికి వెళ్లాలి అనుకుంటున్నారా.. అయితే కష్టమే! ఎందుకు అని ఆలోచిస్తున్నారా.. ఇప్పటి నుంచే రైళ్లలో ప్రయాణించేవారు రిజర్వేషన్లు దొరకక అవస్థలు పడుతున్నారు. అసలు టికెట్​ దొరకడమే గగనమైపోయింది. వెయిటింగ్​ లిస్ట్​ ప్రతి రైలుకీ కొండంత ఉంది. పేద ప్రజలకు ఈ విషయం గుదిబండలా మారనుంది. రాష్ట్ర ప్రజల కోసమే తీసుకొని వచ్చారు అని చెప్పిన జనసాధారణ్​, ప్రత్యేక రైళ్ల జాడే లేదు. దీంతో ఈసారి దసరాకు ఇంటికి వెళ్లాలంటే పరేషాన్ తప్పేలా లేదు.

  • ఆ అధికారి.. సైంధవ పాత్రధారి

రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో అనేక జనావాసాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులు, నిర్మాణ పనులకు అటవీశాఖ అనుమతులు అవసరం. ఇందుకు సంబంధించిన వందలాది దరఖాస్తులు అటవీ అనుమతుల కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నాయి. అటవీశాఖ వీటిని పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

  • రాజగోపాల్​ రెడ్డిపై కాంగ్రెస్ చార్జ్​షీట్​, విడుదలకు సన్నాహాలు

Congress is ready to release the charge sheet: మునుగోడు ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ఛార్జ్​షీట్ విడుదలకు సిద్ధమైంది. పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజక వర్గానికి మోసం చేశారని పేర్కొన్న కాంగ్రెస్‌.. భాజపా, తెరాసల వైఫల్యాలను ఎండగట్టింది. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన హస్తం పార్టీ.. గడప గడపకూ కాంగ్రెస్‌ను తీసుకెళ్లేందుకు ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. రేపు పీసీసీతో పాటు ముఖ్యనాయకులు పార్టీ రూపొందించిన ఛార్జ్​షీట్‌ను మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది.

  • తస్మాత్​ జాగ్రత్త.. ప్రకటనల చాటున ప్రమాదం

Dangerous Hoardings in Vijayawada: విజయవాడలో వీధులు వెంట నడవాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. వ్యాపార సంస్థలు.. ఏర్పాటు చేస్తున్న భారీ హోర్డింగ్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వర్షాకాలం కావడంతో ఏమాత్రం చిన్నగాలి వీచినా.. పెద్దపెద్ద హోర్డింగ్స్‌ కుప్పుకూలుతూ ప్రయాణికులను ప్రమాదాల బారిన పడేస్తున్నాయి.

  • భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!

రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్‌, శుక్రవారం మరో మైలురాయిని అందుకోనుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్ ప్రధాని మోదీ చేతుల మీదుగా లాంఛనంగా నౌకాదళంలో చేరనుంది.

  • మైనర్లపై లైంగిక వేధింపులు.. మురుగ మఠాధిపతి అరెస్ట్​

కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు అరెస్టు చేశారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు వెల్లడించారు కర్ణాటక శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ అలోక్​ కుమార్​. వైద్యపరీక్షలు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

  • ట్విట్టర్​లో 80 శాతం నకిలీ ఖాతాలే.. మస్క్​ కీలక వ్యాఖ్యలు

Twitter Fake Accounts: ట్విట్టర్​పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి విరుచుకుపడ్డారు. 80 శాతం ట్విట్టర్​ ఖాతాలు నకిలీవేనన్న ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ గతంలో చెప్పినట్లు నకిలీ ఖాతాలు 5శాతం కాదని.. అంతకంటే ఎక్కువేనని అన్నారు.

  • 'కేఎల్ రాహుల్‌ క్లాస్​ ఆటగాడు.. అతడికి ఇంకాస్త సమయం అవసరం'

టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ కేఎల్ రాహుల్‌ ఫామ్​పై వస్తున్న విమర్శలపై దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గవాస్కర్​ స్పందించాడు. రాహుల్​ అద్భుతమైన ప్లేయర్ అని, సర్జరీ నుంచి కోలుకున్న రాహుల్​కు ఇంకాస్త సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. గవాస్కర్​ వ్యాఖ్యలను మాజీ​ స్పిన్నర్​​ ప్రజ్ఞాన్‌ ఓజా సమర్థించాడు. రాహుల్​ ఫామ్​ ఆందోళన కలిగించే విధంగా లేదని పేర్కొన్నారు.

  • ''రంగ రంగ వైభవంగా' కథ అందుకే ఒప్పుకున్నా'

తొలి చిత్రం 'ఉప్పెన'తో ఘన విజయం అందుకున్నారు యంగ్​ హీరో వైష్ణవ్‌ తేజ్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా' శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్​ తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.