ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Sep 1, 2022, 7:01 AM IST

  • రాష్ట్రంలో నేటి నుంచి కేంద్రమంత్రుల పర్యటన..

Central Ministers Telangana Tour: పార్లమెంట్ ప్రవాస్‌ యోజనలో భాగంగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, మహేంద్రనాథ్‌ పాండే రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అందుతున్న విధానంపై ఆరా తీయనున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాల్లో పాల్గొననున్నారు.

  • TSLPRB: ఆ అభ్యర్థుల ఖాతాలో ముందే రెండు మార్కులు

TSLPRB: కానిస్టేబుల్‌ స్థాయి ప్రాథమిక రాతపరీక్ష కీ ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. పరీక్ష కీని వెబ్​సైట్​లో ఉంచారు. ఈ పరీక్షలో మాత్రం ఎలాంటి ప్రశ్నలను తొలగించలేదని చెప్పింది. అయితే సరైన సమాధానాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ రెండు మార్కులు మాత్రం కలవనున్నాయని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది.

  • భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తాం: కేసీఆర్‌

భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను కోరినట్లు తెలిపారు. పట్నాలో నితీశ్​కుమార్​తో భేటీ అనంతరం కేసీఆర్​ మీడియాతో మాట్లాడారు.

  • 50 లక్షల పరిహారం చెల్లించాలి..

Ibrahimpatnam incident: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం పట్ల పౌరహక్కుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు మృతి చెందిన మహిళల భర్తలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

  • Ganesha idols: డిఫరెంట్​ గెటప్స్​ల్లో గణేశుల దర్శనం..

Ganesh Idols: వినాయక చవితి వచ్చిందంటే కళాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వినాయక చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను కళాకారులు వినూత్నంగా తీర్చిదిద్దారు. పలు రకాల వస్తువులను, ధాన్యాలను వినియోగించి భిన్నమైన గణనాథులను కొలువుదీర్చారు. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..?

  • ఏడు నెలల గర్భిణికి ఆపరేషన్​.. పిండం వృద్ధి చెందలేదని లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్​

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి.. నెలలు నిండక ముందే ఆపరేషన్​ చేసి బిడ్డను బయటకు తీశారు ఓ ప్రభుత్వ వైద్యుడు. పిండం వృద్ధి చెందలేదని గ్రహించిన డాక్టర్​.. మళ్లీ లోపల పెట్టి కుట్లు వేశారు. ఈ దారుణ ఘటన అసోంలోని కరీంగంజ్​లో జరిగింది.

  • పొట్టలో 62 చెక్క ముక్కలు, 15 స్ట్రాలు, 2 హెన్నా కోన్స్​..

గుజరాత్​లోని జునాగఢ్​ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తికి ఆపరేషన్​ చేసి అతని పొట్ట నుంచి 62 చెక్కముక్కలు, 15 ప్లాస్టిక్​ స్ట్రాలు, 2 హెన్నా కోన్​లను బయటకు తీశారు.

  • చైనాకు తైవాన్​ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు డ్రాగన్ డ్రోన్లు పరార్!

China Taiwan drone : అమెరికా ప్రతినిధులసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ రాక తర్వాత కవ్వింపు చర్యలు పెంచిన చైనాకు తైవాన్‌ కూడా దీటుగానే బదులిస్తోంది. తాజాగా తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న చైనా డ్రోన్లపై కాల్పులు జరిపింది. రెచ్చగొట్టే చర్యలకు దిగితే అదేస్థాయిలో ప్రతిచర్యలు కూడా ఉంటాయని గట్టి సంకేతాలు పంపింది. డ్రోన్లను తిప్పికొట్టే వ్యవస్థలను బలోపేతం చేయటంపై దృష్టి సారించిన తైవాన్‌కు.. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా కూడా భారీ రక్షణ ప్యాకేజీ అందజేయనుంది.

  • సూర్యకుమార్‌ మెరుపులు.. హాంకాంగ్​పై టీమ్​ఇండియా విజయం

Asiacup 2022 teamindia vs Hongkong పాకిస్థాన్​పై గెలిచిన టీమ్​ఇండియా హాంకాంగ్​పై కూడా సునాయసంగా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ సూపర్-4కు దూసుకెళ్లింది.

  • ఆమిర్ షాకింగ్​ నిర్ణయం.. ఏకంగా రూ.100కోట్లను..

ఎప్పుడూ అదిరిపోయే సినిమాలతో అలరించే బాలీవుడ్​ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. ఈ సారి లాల్​సింగ్​ చడ్డా సినిమాతో కాస్త నిరాశపరిచారు. అయితే ఇప్పుడాయన​ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.